ముష్టితో ఆపగలడా? | Shivasena Angry with Devendra Fadnavis over cabinet expansion

Shivasena angry with devendra fadnavis over cabinet expansion

BJP-Shivasena Alliance, BJP-Shivasena Alliance the end, Devendra Fadnavis Uddhav Thackeray, Devendra Fadnavis ignore Shivasena, Maharashtra alliance end

Maharashtra Chief Minister Devendra Fadnavis added 11 more ministers to his government on Friday morning, allotting partner Shiv Sena only two junior posts, in yet another message from the BJP on who is boss.

ముష్టితో ఆపగలడా?

Posted: 07/08/2016 01:56 PM IST
Shivasena angry with devendra fadnavis over cabinet expansion

మహారాష్ట్ర రాజకీయాల్లో కొంత కాలంగా మిత్రపక్షాల మధ్య జరుగుతున్న ఓపెన్ వార్ అందరికీ తెలిసిందే. షోలే కార్టూన్లతో ఈ వివాదం తీవ్రస్థాయికి చేరి, బహిరంగంగానే కటీఫ్ చెప్పాలని ఇరు పార్టీల నేతలు వాదులాడుకోవటం చూశాం. అయినా ఇవేం పట్టన్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢ్నవీస్, ఇంకోవైపు ఉద్దవ్ థాక్రే లు బాగా నటిస్తున్నారు.

మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో 17 ఏళ్ల బంధాన్నే కాదనుకుని నితీశ్ కుమార్ తెగదెంపులు చేసుకున్నాడు. అలాంటి ముస్లిం మైనార్టీల మద్ధతు అధికంగా ఉన్న మోదీకి శివసేన కూడా దూరం కావటం పెద్ద సమస్య కాకపోవచ్చు అని అంతా అనుకున్నారు. కానీ, సీన్ రివర్స్ అయ్యింది. మత సంబంధమైన అంశంపై కాకుండా మంత్రులు, పదవుల విషయంలో మిత్రపక్షం బెట్టు చేసుకుంటూ రావటం ఆశ్చర్యానికి గురిచేసింది.

మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉన్న మహారాష్ట్ర లో బీజేపీ 122, సేన 63గా ఉన్నాయి. ఇక ఎన్సీపీ41, కాంగ్రెస్ 42తో సరిపెట్టుకున్నాయి. అలాంటి పరిస్థితుల్లో హిందూత్వ భావజాలాలు దగ్గరగా ఉన్న ఈ రెండు ప్రభుత్వాన్ని ఏర్పరచడం పెద్ద ఆశ్చర్యపరచలేదు. కానీ, పోర్ట్ ఫోలియోల విషయంలోనే శివసేన మొదటి నుంచి బీజేపీకి సినిమా చూపించుకుంటూ వస్తోంది. ఇది మనసులో పెట్టుకునే తమవారు మంత్రులుగా ఉన్నారనే చూడకుండా, బహిరంగంగానే బీజేపీ పాలనపై సేన విమర్శలు ఎక్కుపెట్టింది. చాన్స్ దొరికినప్పుడల్లా తమ స్వరగళం సామ్నాలో దుమ్మెత్తిపోయటం ప్రారంభించింది. ఆపై ప్రతి విమర్శలు ఇలా సాగుతుండగా గబ్బర్ ఎపిసోడ్ ఎపిసోడ్ వ్యాఖ్యలు ఆ అగ్గికి మరింత ఆజ్యం పోశాయి.

ఈ నేపథ్యంలో దోస్తీ ఉంటుందా? ఊడుతుందా? అన్న అనుమానాలకు తెరదించుతు జవదేకర్ సమక్షంలో ఫడ్నవీస్, ఉద్దవ్ లు పళ్లు ఇగిలిస్తూ తమ మధ్య కలహాలు ఏం లేవంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చి పడేశారు. అయినప్పటికీ మరోసారి పదవుల పంపకంతో కమలం, పులి ఆగ్రహానికి గురికాక తప్పడం లేదు. ఫడ్నవీస్ వేసిన ముష్టితో శివసేనలో ఆగ్రహాజ్వాలలు రగులుతున్నాయి.    

తాజాగా శుక్రవారం(జూలై 8, 2016) జరిగిన మంత్రివర్గ విస్తరణలోనూ సేనకు మొండి చెయ్యే మిగింది. మొత్తం 11 మందిని క్యాబినెట్ లోకి తీసుకోగా, శివసేన నుంచి ఇద్దరికి చోటు లభించింది. కనీసం నలుగురి నుంచి ఐదుగురు తమవారికి స్థానం లభిస్తుందని భావించిన శివసేనకు భంగపాటే ఎదురైంది. ఎమ్మెల్యేలు అర్జున్ ఖోట్కర్ (జల్నా), గులాబ్ రావ్ పాటిల్ (జల్ గావ్)లను జూనియర్ మంత్రులుగా తీసుకుని చేతులు దులుపుకున్నాడు. ఫడ్నవీస్ నిర్ణయంతో అలిగిన శివసేన చీఫ్ థాక్రే మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హజరుకాలేదు.

దీంతో ఇరు పార్టీల మధ్య మైత్రి ఎన్ని రోజులు కొనసాగుతుందా అన్న అనుమానాలు మళ్లీ వ్యక్తం అవుతున్నాయి. దీనికి తోడు వచ్చే ఏడాది ఉన్న ముంబై మున్సిపాలిటీ ఎన్నికలను ఇరు పార్టీలు ఛాలెంజ్ గా తీసుకుంటున్నాయి. ఎవరికి వారే పోటీ చేయాలని భావిస్తున్న తరుణంలో కొద్ది రోజుల్లోనే ఈ కలహ స్నేహనికి ముగింపు పడే ఛాన్స్ ఉన్నట్లు స్పష్టంగా అర్థమౌతుంది. అంతకాలం కాలేకట్టెను పెడుతున్నప్పటికీ  ముసిముసి నవ్వుల ముసుగేసి ఇలా నడిపిస్తూనే ఉంటారేమో!    

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharashtra  BJP-Shivasena Alliance  Devendra Fadnavis  Uddhav Thackeray  Ministries  

Other Articles