తెలంగాణ కాంగ్రెస్ గజ గజ గజ.... | sunitha laxmareddy may join TRS soon

Sunitha laxmareddy may join trs soon

medak congress, big shock to medak congress, sunitha laxmareddy, sunitha laxma reddy to TRS, sunitha laxma reddy may TRS, sunitha laxma reddy in congress, సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ లోనే, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్, కారెక్కనున్న సునీతా లక్ష్మారెడ్డి, తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ గాసిప్స్, రాజకీయ గుసగుసలు, తెలంగాణ వార్తలు, తెలుగు వార్తలు, తాజా వార్తలు, latest news, telugu news

medak key leader former minister sunitha laxmareddy may quit congress and join TRS soon.

తెలంగాణ కాంగ్రెస్ గజ గజ గజ....

Posted: 06/20/2016 11:36 AM IST
Sunitha laxmareddy may join trs soon

తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు తన పార్టీలోని నేతలను కదిలించాలంటేనే గడగడ లాడిపోతుంది. తమ నేతలు అధికార పార్టీలోకి మారతారంటూ రూమర్లు రావటం, ఆపై వారిని బుజ్జగించి నిలువరించేందుకు పెద్దలో, లేక అధిష్ఠానమో దిగటం లాంటివి జరిగేవి. కానీ, చర్చలు తుస్సుమంటూ ఆ మరుసటి రోజే వారు కండువా మార్చేసుకోవటం మనం చూశాం. దీంతో నేతల జోలికి వెళ్లేందుకు పార్టీ వణికిపోతుంది. ఈ క్రమంలో ఇప్పుడ మరో కీలక నేత పార్టీ మారతారనే వార్తలతో పార్టీ పెద్దల గుండెలు కలుక్కుమంటున్నాయి.

మెదక్‌ జిల్లా కీలక నేత, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి త్వరలో పార్టీ మారతారంటూ ఇప్పుడు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే గతంలోనే ఆమె పార్టీ మారతారని అనుకున్నప్పటికీ ఆ పని చచ్చినా చేయనని ఆమె ఖరాఖండిగా చెప్పారు. కానీ, ప్రస్తుతం నెలకొన్న పరస్థితులు, సన్నిహితుల ఒత్తిడితో ఖచ్ఛితంగా మారొచ్చనే అంటున్నారు. పైగా కొంత కాలంగా ఆమె కేసీఆర్ తో రహస్య మంతనాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.
 
భర్త వాకిటి లక్ష్మారెడ్డి మరణంతో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె సానుభూతితో 1999 సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాధించారు. ఆపై దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వెన్నంటే ఉండి ఆమె నడిచారు. దీంతో అధికారంలోకి రాగానే ఆమెకు మంత్రి పదవి కట్టబెట్టారాయన. ఆపై వరుసగా 2004, 2009లలో నర్సాపూర్ నుంచి ఆమె ఎమ్మల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి మంత్రి వర్గంలో చురుకుగా ఆమె పనిచేశారు. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం గులాబీ సెంటిమెంట్ ముందు ఆమె ఓడిపోయారు. అయినప్పటికీ జిల్లాలో పార్టీ బాగోగులు చూస్తూ వస్తున్నారు.

తెలంగాణలో పార్టీ ఇప్పుడప్పుడే బాగుపడే స్థితి లేకపోవటంతో రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారాల్సిందేనని ఆమె సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారంట. కీలకంగా, క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఆమె ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు హ్యండివ్వదని పార్టీ భావిస్తోంది. అయితే మెదక్ బైపోల్ సమయంలో తనకు టికెట్ ఇస్తారని ఆశించిన ఆమె పార్టీపై గుస్సాతో ఉందని తెలుస్తోంది. అంతేకాదు ఎంత చేస్తున్నా పార్టీ పట్టించుకోకపోవటం, ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆమె ఊగిసలాటలోనే ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. కేసీఆర్ తో రహస్య మంతనాలపై ఆమె దాటవేయం దీనికి మరింత బలం చేకూరుస్తుంది. దీంతో ఆమె గులాబీ గూటికి చేరతారా అన్న గుబులు కాంగ్రెస్ లో నెలకొంది.


భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : medak congress  sunitha laxmareddy  quit congress  telangana congress  TRS akarsh  

Other Articles