యువరాజు కొత్త శత్రువు ఎవరో తెలుసా? | priyanka gandhi new enemy for Rahul gandhi

Priyanka gandhi new enemy for rahul gandhi

rahul gandhi new enemy priyanka, priyanka vs rahul, rahul gandhi vs priyanka gandhi, ప్రియాంక వర్సెస్ రాహుల్, రాహుల్ వర్సెస్ ప్రియాంక, రాహుల్ గాంధీ ప్రియాంకగాంధీ, రాహుల్ శత్రువు ప్రియాంకగాంధీ, ఏఐసీసీ కొత్త చీఫ్ ప్రియాంకగాంధీ, కాంగ్రెస్ కొత్త అధ్యక్షురాలిగా ప్రియాంక, తెలుగు వార్తలు, జాతీయ వార్తలు, రాజకీయా గుసగుసలు, latest news, political gossips, telugu news

congress high command thinks priyanka gandhi better than rahul gandhi. And may appoint as new party chief. tough fight between rahul and priyanka for party chief.

యువరాజు కొత్త శత్రువు ఎవరో తెలుసా?

Posted: 06/11/2016 04:42 PM IST
Priyanka gandhi new enemy for rahul gandhi

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ కథ యువరాజుగానే ముగిసేలా ఉంది. సార్వత్రిక ఎన్నికల దగ్గరి నుంచి తాజా అసెంబ్లీ ఎన్నికల దాకా అన్నింట్లోనూ రాహుల్ పొడిచింది ఏం లేదంటూ సీనియర్లు ఓ అంచనాకు వచ్చారు. ఈ విషయమై ఇప్పటికే చాలా సార్లు అధినేత్రి సోనియాకు వారు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో పార్టీ పగ్గాలు మారే అవకాశం ఉన్నట్లు పార్టీలో అంతర్గ చర్చ మొదలైంది. తాను దిగిపోవాల్సిన సమయం వచ్చిందంటూ సోనియాగాంధీ తన దగ్గర ప్రస్తావించిదంటూ ఓ సీనియర్ చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాబోయే పార్టీ చీఫ్ ఎవరన్న చర్చ మొదలైంది.

సోనియాగాంధీ కూతురు, రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీకి పార్టీ పగ్గాలు అప్పజెప్పే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాటన్ చీర కట్టుబాటుతో అచ్చం ఇందిరా గాంధీకి జిరాక్స్ కాపీ ఉన్న ప్రియాంకతో రాజకీయ ఆరంగ్రేటం చేయించడం ద్వారా ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో లాభపడొచ్చనే అంచనాకి పార్టీ వచ్చినట్లు తెలుస్తోంది. ఓవైపు భర్త రాబర్ట్ వాద్రాపై ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రజల్లో ఆమెపై మంచి అభిప్రాయం ఉండటంతో అతిత్వరలోనే ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ముఖ్యంగా కీలకంగా భావించే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల ప్రచారానికి ముఖ్య ఆయుధంగా ఆమెను వాడాలని కాంగ్ అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చిందట.

పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆశించిన మేర ఫలితాలు రాబట్టక పోవటంతో, ప్రియాంకను బరిలోకి దించడం దాదాపు ఖాయమయ్యిందనే అనుకోవచ్చు. అంతేకాకుండా 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ నుంచే ఆమెను బరిలోకి దింపుతారన్న ప్రచారం సాగుతుంది. రానున్న రోజుల్లో .దేశ రాజకీయాల్లో మరో ‘ఇందిర’లా ప్రియాంక మారుతుందన్న విశ్లేషణలూ సాగుతున్నాయి. శత్రువులు ఎక్కడో ఉండరు రా... చెల్లెలు, కూతుళ్ల రూపంలో ఇంట్లోనే తిరుగుతారంటూ అనే డైలాగ్ రాహుల్ గాంధీకి ఇప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పార్టీ అధ్యక్షుడి పగ్గాలను తన్నుకుపోవటంతోపాటు, ఏకంగా తన సీటుకే ఎర్తుపెట్టబోతున్న చెల్లి ప్రయత్నాలను అడ్డుకునేందుకు మరి యువరాజు దగ్గర ఏదైనా మంత్రదండం ఉందా?

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles