ఆ రెండింటితోనే చెడిందా? | reason for KCR silence on kodandaram comments

Reason for kcr silence on kodandaram comments

KCR, prof kodandaram, gap between KCR and kodandaram, kodandaram slilence KCR, kodandaram on KCR two years ruling, తాజావార్తలు, తెలుగు వార్తలు, కోదండరాం, కేసీఆర్, కేసీఆర్ కోదండరాం, తెలంగాణ రాజకీయాలు, రాజకీయ వార్తలు, పాలిటిక్స్, latest news, telugu news

reason for KCR silence on kodandaram comments. kodandaram says he did not get KCR appontment.

ఆ రెండింటితోనే చెడిందా?

Posted: 06/08/2016 12:14 PM IST
Reason for kcr silence on kodandaram comments

ఈ రెండేళ్ల కాలంలో కేసీఆర్ సర్కార్ చేసిందేంటీ? అంటూ జేఏసీ చైర్మన్ ఫ్రొపెసర్ కోదండరాం వ్యాఖ్యలు రాజకీయ చిచ్చును రాజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాను చేసిన వ్యాఖ్యలుగా వస్తున్న వీటిపై స్పందించేందుకు కోదండరాం సుముఖంగా లేరు. తానేం మాట్లాడానో వీడియోలు చూసుకోవాలని, మంత్రులు చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని అంటున్నప్పటికీ, అసలు తానా వ్యాఖ్యలు చేయలేదని ఖండించడం కూడా చేయకపోవటం చర్చనీయాంశం. అదే సమయంలో తెలంగాణను  ప్రజలు, ప్రాంతాల మధ్య ఆర్థికపరమైన వ్యత్యాసం పెరిగిపోతుందన్న విషయాన్నే తాను చెప్పానని, ఇందులో తప్పేముందని ఆయన అంటున్నారు.

ప్ర్యతేక రాష్ట్రం కోసం పాలు-నీళ్లలా కలిసి పోరాడిన కోదండరాం కేసీఆర్ లు ఇప్పుడు అదే తెలంగాణలో పాము-ముంగిసలా మారబోతున్నారా? అన్న అనుమానాలు రెకెత్తుతున్నాయి. ఉవ్వెత్తున ఎగసిపడ్డ మలిదశ ఉద్యమంలో ప్రొఫెసర్ కమ్ జేఏసీ నేతతో కలిసి రాష్ట్ర కలల్నిబతికించుకుంటూ వస్తూ కేసీఆర్ జన నేతగా ముద్రపడిపోయారు. కోదండరాం అడుగులో అడుగేసుకుంటూ నడిచి పోరాటంలో సఫలీకృతులయ్యారు. అలాంటిది తన మంత్రులు మూకుమ్మడిగా కోదండరాంపై దాడిచేస్తున్న కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు. దీనిపై కారణాలు విశ్లేషిస్తే...

రాష్ట్రం ఏర్పాడ్డాక ఈ రెండేళ్ల కోదండరాం ఎక్కడా కనిపించింది లేదు. తన ఉనికి కనుమరుగవుతుందని బయపడిన ఆయన సడన్ గా ఇలా సీన్లోకి వచ్చి ఉంటాని విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఏం సాధించారంటూ కోదండరాం వేసిన ప్రశ్నలోనే మనకు కావాల్సిన సమాధానం కేసీఆర్ సైలెన్స్ రూపంలో దొరకుతుంది. అది ఆయనకు వ్యక్తిగతంగానా? లేక తెలంగాణ ప్రజలకు మద్ధతుగానా? అన్నదే అసలు విషయం. రెండు రోజుల క్రితం కోదండరాం చేసిన రెండు వ్యాఖ్యలతో మంత్రుల్లో ఆగ్రహావేశాలకు పెలుబిక్కాయి. ‘రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం’, ‘చేతకాకుంటే పదవి నుంచి కేసీఆర్ దిగిపోవాలి’... అంటూ కోదండరాం నోటి నుంచి రెండు మాటలు బాణాల్లా దూసుకు వచ్చాయి. ఓవైపు ప్రతిపక్షాలే తనను ప్రశ్నించేందుకు జంకుతున్న తరుణంలో సొంత మనిషిగా భావించే కోదండరాం నుంచే ఇలాంటి వ్యాఖ్యలు రావటంతో కేసీఆర్ కలత చెందారంట. అభివృద్ధి వైపు అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలతో ప్రతిపక్షాలకు కోదండరాం సపోర్ట్ ఇచ్చినట్లు భావిస్తున్న కేసీఆర్ తాను మాత్రం కామ్ గా ఉండి, తన మంత్రులతో విమర్శించే పని చేయిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఇంకోవైపు కేసీఆర్ తో గ్యాప్ గురించి స్పందించేందుకు కూడా కోదండరాం నిరాకరించారు. గతంలో ఉద్యమంలో ఉన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు కలిసిన జేఏసీ నేత, ఇప్పుడు సీఎంను కలిసేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తుందట. తన అవసరం తీరాక తనను ఇలా పక్కనపడేశారని కోదండరాం సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అంతేకాదు రాజకీయ ఆరంగ్రేటంతోపాటు, తాజాగా రాజ్యసభ సీట్లలో ఆయనకు హ్యాండ్ ఇవ్వటంతోనే ఇలా విమర్శలకు దిగారని మరోవాదన కూడా ఉంది. దీనికి తోడు ఆరు నెలల్లో కలిసేందుకు యత్నించినా, కనీసం తనకు అపాయింట్ మెంట్ లభించలేదని మీడియా ఎదుటే కోదండరాం వ్యాఖ్యానించడంతో కేసీఆర్ కావాలనే దూరం పెడ్తున్నారని అర్థమౌతోంది. అలాంటిది ప్రస్తుత పరిస్థితుల్లో వీరు మళ్లీ కలుస్తారా అన్నది ప్రశ్నార్థకమే.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  prof kodandaram  gap between KCR and kodandaram  

Other Articles