మల్లారెడ్డి కొట్టింది మాములు దెబ్బ కాదు | TDP lost national party recognition over mallareddy jump

Tdp lost national party recognition over mallareddy jump

TTDP MP mallareddy, TRS, national party recognition, టీఆర్ఎస్, టీటీడీపీ ఎంపీ, మల్లారెడ్డి, జాతీయ పార్టీ హోదా, politics, political news, telangana news

TTDP MP mallareddy announced he joins in TRS soon. This decision effect on national party recognition for TDP.

మల్లారెడ్డి కొట్టింది మాములు దెబ్బ కాదు

Posted: 06/01/2016 12:38 PM IST
Tdp lost national party recognition over mallareddy jump

టీటీడీపీ కథ ముగిసింది. అంతా అనుకున్నట్లు గానే తెలంగాణలో ఆ పార్టీకి మిగిలిన ఏకైక ఎంపీ మల్లారెడ్డి కారెక్కనున్నట్లు ప్రకటించేశారు. మహానాడు ముందు నుంచే పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న ఆయన కార్యకర్తలతో పార్టీ మారే విషయమై ఎడతెరపని చర్చలు జరిపి చివరికి మారాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం టీడీపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. ఒకరు రేవంత్ రెడ్డి, ఇంకోకరు ఆర్.కృష్ణయ్య. అయితే తనకు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని, తాను టెక్నికల్ గా మాత్రమే ఎమ్మెల్యేనని గతంలోనే ప్రకటించేసుకున్నాడు కృష్ణయ్య. దీంతో రేవంత్ ఒక్కరే టీడీపీ తరపున గళం విప్పే ఏకైక నేతగా మిగిలారు. అసలు పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన సమయంలో మల్లారెడ్డి పార్టీ మారటం పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. కానీ, చంద్రబాబు ఎప్పటి నుంచో కంటున్న కలకు మల్లారెడ్డి గండికొట్టి పోవటం ఇక్కడ చెప్పుకోదగిన అంశం.

తెలుగుదేశం పార్టీకి జాతీయ హోదా కట్టబెట్టాలన్నది చంద్రబాబుకు ఎప్పటి నుంచో ఉంది. తాజాగా జరిగిన మహానాడులో కూడా ఈమేర ఓ తీర్మానం చేశారు కూడా. ఏదైనా ఒక పార్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో 6 శాతం చొప్పున ఓట్లయినా రావాలి.. లేదా దేశం మొత్తమ్మీద ఉన్న లోక్‌సభ సీట్లలో రెండు శాతాన్ని మూడు రాష్ట్రాల నుంచి పొందాలి. చంద్రబాబు రెండో దాని మీద ఆధారపడాలనుకున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో పార్టీకి ఎంపీలుండటంతో మరో రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు గెలుచుకుంటే చాలు అన్నది ఆయన ప్లాన్. అంతేకాదు మూడో రాష్ట్రంగా పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలతోపాటు అండమాన్ నికోబార్ దీవులను ఆయన నమ్ముకున్నారు. తెలుగు ప్రజలు ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా సెటిల్ అయి ఉండటంతో పాటు, అక్కడి ప్రభుత్వాలతో బాబుకి మాంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో పొత్తు ద్వారా అయినా సరే ఒక్క ఎంపీ స్థానంలో గెలిచి జాతీయ హోదా కొట్టేయొచ్చని భావించారు.  

కానీ, మల్లారెడ్డి ఇప్పుడు చేసిన పనితో అది మళ్లీ కలగానే మిగిలింది. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికలపై టీడీపీ ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అంతేకాదు ప్రత్యక్షంగా మల్లారెడ్డిని లాక్కోవటం ద్వారా పరోక్షంగా కేసీఆర్ చంద్రబాబును మరో దెబ్బ కొట్టారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణతో పాటు ఏదైనా ఒక రాష్ట్రంలో కనీసం ఒక్కో ఎంపీ సీటు అయిన గెలుచుకోవాల్సిన అవసరం ఇప్పుడు టీడీపీ లక్ష్యంగా మారింది.


భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TTDP MP mallareddy  TRS  national party recognition  

Other Articles