రేవంతుడి చేతికి వజ్రాయుధం | revanth reddy join hands with OU JAC

Revanth reddy join hands with ou jac

TTDP MLA Revanth Reddy, OU-JAC, Telangana Formation Day, ఓయూ జేఏసీ, టీటీడీపీ ఎమ్మెల్యే, రేవంత్ రెడ్డి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, బహిరంగ సభ, telangana news, latest news, political gossips

TTDP MLA Revanth Reddy Shook Hands With OU-JAC. Planning For Public Meeting on Telangana Formation Day.

రేవంతుడి చేతికి వజ్రాయుధం

Posted: 05/30/2016 05:33 PM IST
Revanth reddy join hands with ou jac

తెలంగాణ తెలుగుదేశం దుకాణం దాదాపుగా బంద్ అయిపోయిందన్న దశలో  ‘‘నేనున్నానంటూ’’ ఒంటరి పోరుకు సిద్ధపడ్డాడు రేవంత్ రెడ్డి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయ సరిగ్గా ఏడాది గడుస్తున్నా... ఇప్పటికీ మీసం మెలేస్తూ టీ ప్రభుత్వానికి, సీఎం సాబ్ కేసీఆర్ కు వార్నింగ్ లు ఇస్తూనే ఉన్నాడు. కోర్టు ఆంక్షలతో కొనాళ్లు సైలెంట్ గా ఉన్నప్పటికీ తాను పార్టీ మారుతున్నాడంటూ ప్రభుత్వ అనుకూల పత్రిక ప్రచురించడటంతో కాలిన ఆయన మళ్లీ తెరపైకి దూకారు. తాను తాల్చుకుంటే 2019లో టీడీపీని అధికారంలోకి తేవటమే కాదు, కేసీఆర్ ఏం చూసుకుని ఎగిరిపడుతున్నారో ఆ గద్దె నుంచి లాగి తాను అక్కడ కూర్చోగలనని సవాల్ కూడా విసిరాడు. ఐ యామ్ బ్యాక్ అంటున్న రేవంత్ తీసుకోబోయే స్టెప్పులేంటో ఓసారి పరిశీలిస్తే...

పాలేరు ఎన్నికల కోసం కాంగ్రెస్ తోపాటు వామపక్ష పార్టీల సహకారం తీసుకుంది టీడీపీ. ఈ పొత్తులో ప్రముఖ పాత్ర పోషించింది రేవంత్ రెడ్డియే అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యనేతలతో మంతనాలు జరిపి టీఆర్ఎస్ కు ఎదురెళ్దామని ధైర్యాన్ని నూరిపోసి ముందుకు తీసుకెళ్లాడు. కానీ, ప్రభుత్వమే మొత్తంగా అక్కడ ప్రచారం చేయటంతో కూటమి దారుణంగా ఓటమి పాలైంది. అయితే, ఈ ఓటమితోనే తప్పులను సరిదిద్దుకునేందుకు మంచి అవకాశం దొరికినట్లయ్యింది. ఇకపై ప్రభుత్వంపై ఎలాంటి పోరుకు సిద్ధపడినా ఉమ్మడిగానే కలిసి వెళ్లేందుకు పార్టీలన్నింటిని ఆయన ఒప్పించగలిగాడు. అంతేకాదు ఈ ప్రయత్నంలో మరో శక్తివంతమైన ఆయుధాన్ని ఆయన సంపాదించగలిగాడు.

ఉద్యోగాల నోటిఫికేషన్ల ఆలస్యంతోపాటు, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ తో తమ పొట్ట కొడుతున్నాడని భావిస్తూ గులాబీ బాస్ పై గుస్సాతో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను కలుపుకుని పోయేందుకు ఆయన సిద్ధమయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని పార్టీలతో కలిసి ఓయూలోనే నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారాయన. అమరవీరుల కుటుంబానికి ద్రోహం చేస్తున్నారనే ప్రధాన డిమాండ్ తో ఓ సభ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం టీఆర్ఎస్పీ మినహా అన్ని విద్యార్థి సంఘాలు ఈ ఉద్యమానికి మద్ధతు ప్రకటించాయి. మొత్తం 1200 మంది బ‌లిదానం చేసుకుంటే కేవలం 488 మందికి సాయం అందిందనేది ఆయన వాదన. విద్యార్థులు త్యాగాలు చేసి తెలంగాణ సాధిస్తే... భోగాలు మాత్రం ఇప్పుడు కేసీఆర్ కుటుంబం అనుభవిస్తుందని ఉస్మానియా విద్యార్థులు కూడా విమ‌ర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఉమ్మడి పోరుకు వీరంతా ఏకమైనట్లు తెలుస్తోంది.  జేఏసీ నేతలు ఇప్పటికే రేవంత్ ను కలిసి తమ మద్ధతు కూడా తెలిపినట్లు భోగట్టా. విద్యార్థుల తరపున సమస్యలను ఒక్కోక్కటిగా తీసుకుని అయా అంశాలపై పోరాటం చేసేందుకు విపక్షాలన్నీ ముందుకు వచ్చాయంట. దశల వారీగా జరిగే ఈ పోరాటంలో ముందుండి నాయకత్వాన్ని నడిపించే బాధ్యత మాత్రం రేవంత్ పైనే పెట్టినట్లు సమాచారం. దీనికి ప్రజాసంఘాల మద్ధతు కూడా లభించడంతో టీ ప్రభుత్వం పై రేవంత్ సమర శంఖం పూరించినట్లేనని అర్థమౌతోంది.

ఇకపై ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచే భవిష్యత్ కార్యచరణకు రూపకల్పన చేయనున్నట్లు ఆయన ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో అన్ని శక్తులను ఏకంగా చేసి 2019 నాటికి ఓ బలమైన ప్రత్యర్థి కూటమిని ఏర్పాటు చేయాలన్న ఫ్లాన్ వేశారాయన. ఇందుకోసం ఓయూ సభ ఓ బీజం అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. అమ‌రుల త్యాగాల‌ను గుర్తించుకోవ‌డం కోస‌మే అవతరణ దినోత్సవం ఈ బ‌హిరంగ స‌భ‌ను  ఏర్పాటు చేసినట్లు జేఏసీ నేతలు చెబుతున్నప్పటికీ, ఈ స‌భ‌ను సక్సెస్ చేసి ప్రభుత్వంపై సమర శంఖం పూరించడంతోపాటు కేసీఆర్ కు పెద్ద షాక్ ఇవ్వాల‌ని రేవంత్ ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు.


భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TTDP MLA Revanth Reddy  OU-JAC  Telangana Formation Day  

Other Articles