గంటా మంత్రి పదవి ఊస్టింగేనా..? May Ganta Srinivas lose his ministry

May ganta srinivas lose his ministry

Ganta Srinivas, Ganta, Chadrababu Naidu, AP, Ministers, Chiranjeevi, Sarainodu Audio, గంటా, గంటా శ్రీనివాస్, ఏపి, చంద్రబాబు నాయుడు

AP CM Chandrababu Naidu anger Ganta Srinivas. Ganta Srinivas behaving like Chiranjeevis favour. So Chandrababu so anger on his behaviour.

గంటా మంత్రి పదవి ఊస్టింగేనా..?

Posted: 04/16/2016 03:07 PM IST
May ganta srinivas lose his ministry

ఏపీ మంత్రివ‌ర్గంలో పున‌ర్వవ‌స్థీక‌ర‌ణ అంటూ జ‌రిగితే గంటా శ్రీనివాస‌రావు మీద వేటు ప‌డుతుంద‌న్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే  చాలాసార్లు సీరియ‌స్ అవుతున్నప్పటికీ ఈ మంత్రిగారి తీరు మార‌క‌పోవ‌డంతో చంద్రబాబు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. నారా లోకేష్ స‌హా చంద్రబాబుకి స‌న్నిహితంగా ఉంటున్న మ‌రోమంత్రి నారాయ‌ణ‌కు స్వయంగా వియ్యంకుడైన గంటా పూర్తిగా చిరంజీవి మ‌నిషిలా వ్యవ‌హ‌రిస్తున్న తీరు చంద్రబాబుకి న‌చ్చడం లేద‌ని స‌మాచారం. చాలాకాలంగా గంటా శ్రీనివాస‌రావు , చిరంజీవి మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరూ ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ లోకి చేరి చెరో చోట మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు. ఆత‌ర్వాత ఎన్నిక‌ల‌కు ముందు చిరంజీవిని విడిచి గంటా సైకిలెక్కేసిన‌ప్పటికీ ఆయ‌న‌తో సంబంధాలు మాత్రం కొన‌సాగిస్తున్నారు. ఇప్పటికీ చిరంజీవి ఇంట జ‌రిగే అన్ని వ్యవ‌హారాలు గంటా సొంత వ్యవ‌హారంగానే భావిస్తున్నారు. ఇటీవ‌ల శ్రీజ వివాహం బెంగ‌ళూరులో జ‌రిగిన‌ప్పుడు హాజ‌రైన ఏకైక మంత్రి గంటా శ్రీనివాస‌రావే కావ‌డం విశేషం. అంతేగాకుండా విశాఖ‌లో మెగా హీరో అల్లు అర్జున్ సినిమా స‌రైనోడు ఫంక్షన్ వ్యవ‌హారాల‌న్నీ పూర్తిగా త‌న భుజాల మీద వేసుకుని గంటా నిర్వహించిన‌ట్టు చంద్రబాబు భావిస్తున్నారు. చివ‌ర‌కు చిరంజీవి వ‌స్తున్నందున టీడీపీ కార్యక‌ర్తల‌ను అక్కడికి త‌ర‌లించిన‌ట్టు కూడా చెబుతున్నారు.

అయితే ఆ వేడుక‌ల్లో చిరంజీవి ఏపీ ప్రభుత్వ తీరును విమ‌ర్శించారు. విశాఖ‌లో సినీరంగం అభివృద్ధి అంటూ మాట‌లు త‌ప్ప చేత‌లు లేవ‌ని సూటిగా విమ‌ర్శలు చేసేశారు. దాంతో దాని సెగ చంద్రబాబుని తాకిన‌ట్టు తెలుస్తోంది. గంటా ప‌ర్యవేక్షణ‌లో సాగిన స‌మావేశంలో చంద్రబాబు మీద విమ‌ర్శలు రావ‌డం ఆయ‌న స‌హించ‌లేక‌పోతున్నట్టు చెబుతున్నారు. దాంతో గంటాకి మ‌రోమారు గ‌ట్టిగా క్లాస్ పీకిన‌ట్టు తెలుస్తోంది. అంత‌టితో స‌రిపెట్టకుండా ఎన్నిమార్లు చెప్పినా వ్యవ‌హారం మార్చుకోని విద్యామంత్రికి ఇక ఊస్టింగ్ త‌ప్పద‌న్నట్టుగా టీడీపీ వ‌ర్గాలు అంత‌ర్గతంగా చ‌ర్చించుకుంటున్నాయి. త్వర‌లో మంత్రివ‌ర్గంలో మార్పులు జ‌రిగితే కాపు సామాజిక‌వ‌ర్గం కోటాలో తూర్పు గోదావ‌రి నుంచి తోట త్రిమూర్తులు లేదా జ్యోతుల నెహ్రూల‌లో ఒక‌రికి అవ‌కాశం ఇచ్చి..విశాఖ నుంచి ఎంవీఎస్ మూర్తి, బండారు స‌త్యాన్నారాయ‌ణ మూర్తిలో ఒక‌రికి చోటు క‌ల్పించే ఛాన్స్ ఉంద‌ని చెబుతున్నారు . ఎటు చూసిన‌ప్టపికీ చంద్రబాబు గంటాను సాగ‌నంప‌డం ఖాయ‌మ‌న్న ప్రచారం సాగుతోంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles