Rajaiah Likely To Be Suspended From Congress.. ?

Rajaiah to be suspended from congress

Siricilla Rajaiah, Siricilla Rajaiah suspension, congress damage control, congress suspends rajaiah, rajaiah family members, Siricilla Rajaiah fire accident, Siricilla Rajaiah unable to contest elections, Siricilla Rajaiah requests party to change his candidature, rajaiah warangal by polls, rajaiah family fire accident, Siricilla Rajaiah, Warangal bypolls

party high command is all set to suspend Rajaiah from the primary membership of the party to minimize the damage to some extent in elections

కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ రాజయ్య సస్పెన్షన్..?

Posted: 11/06/2015 06:09 PM IST
Rajaiah to be suspended from congress

వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో ముందస్తుగా ప్రకటించిన తమ అభ్యర్థి రాజయ్య విషయంలో కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. వరంగల్ ఉప ఎన్నికల కోసం జిల్లాలోని తన నివాసానికి వెళ్లి.. తన కోడలితో గొడవ పడి.. కోడలు సహా ముగ్గురు మనవళ్ల అనుమానస్పద మృతికి కారణమైన రాజయ్యపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ సన్నధమైన్నట్లు సమాచారం. ఇప్పటికే వరంగల్ ఉప ఎన్నికల అభ్యర్థిని మార్చ కొంత మేరకు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన కాంగ్రెస్ ఎన్నికలలో తమ అభ్యర్థి విజయం కోసం రాజయ్యపై చర్యలు తీసుకోనుందని సమాచారం.

ఉప ఎన్నికల నేపథ్యంలో వరంగల్ జిల్లాకు వెళ్లని రాజయ్య, తన కోడలు సారికతో ఏఐసిసికి లేఖ రాసిన అంశంపై గొడవ పడి.. అమెతో పాటు అమె ముగ్గురు కుమారులు అగ్ని ప్రమాదంలో సజీవ దహనం అవ్వడానికి, అనుమానాస్పదంగా మరణించడానికి కారణమైన రాజయ్యను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్సెండ్ చేయనుందని సమాచారం. ఈ మేరకు అధిష్టానం త్వరలోనే దిద్దుబాటు చర్యల చేపట్టనుందని తెలుస్తుంది.

కాగా రాజయ్యపై అధిష్టానం చర్యలకు ఉపక్రమించే విషయమై తెలంగాణ పీసీసీ కూడా అంగీకరించినట్టు సమాచారం. ఈ మేరకు ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కోడలి మరణం వెనుక ఆయన హస్తం కూడా ఉందని ప్రాథమిక సాక్ష్యాలు లభించడం, ప్రస్తుతం ఆయన జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నందువల్ల కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణమని పార్టీ వర్గాలు అంటున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sirisilla rajaiah  suspension  warangal by polls  congress  

Other Articles