narayankhed tdp leader Vijayapal Reddy likely to join TRS

Another telangana tdp leader to join trs

Vijayapal Reddy is likely to join TRS, reports say vijapal will win with TRS ticket, Vijayapal Reddy, Telangana Tdp leader, harish Rao, padma devender reddy, TRS government, key role in the government, TDP, narayankhed, telangana rastra samithi, by elections

if reports are to be belived, former Mla of narayankhed assembly constituency Vijayapal Reddy is likely to join telangana rastra samithi and contest the by elections

టీఆర్ఎస్ పార్టీలోకి మరో టీటీడీపీ ముఖ్యనేత..?

Posted: 09/30/2015 10:14 AM IST
Another telangana tdp leader to join trs

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి ఏ మాత్రం భరించలేకపోతున్న అధికార పార్టీ టీఆర్ఎస్.. ఆ పార్టీని సాధ్యమైనంతమేరకు దెబ్బతీయాలని భావిస్తోంది. తమ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడినా.. తెలుగుదేశం పార్టీ నేతలు కుయుక్తులు పన్నుతూ దెబ్బతీయాలని ప్రయత్నాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తూ తెలంగాణ టీడీపీ నేతలను మార్చేందుకు యత్నిస్తుంది. తెలంగాణ సీమా:ద్ర పార్టీ పెత్తనం అవసరం లేదని ఇకనైనా ఆ పార్టీని వీడి రావాలని చామకింద నీరులా ప్రచారం చేస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీలోకి మరో తెలంగాణ టీడీపీ ముఖ్యనేత చేరుందుక సన్నాహాలు సిద్దం చేసుకున్నట్లు సమాచారం.

మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత.. విజయపాల్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్తేన్నట్లు విశ్వసనీయ సమాచారం. 1994 ఎన్నికలలో స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు ప్రభంజనంతో యావత్ రాష్ట్రంలో వీచిన సానుకూల పవనాలతో ఆయన ఎమ్మెల్యేగా గెలుపోందారు. ఆ తరువాత అనేక పర్యాయాలు అయన ఎమ్మెల్యేగా పోటీ చేసినా ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకులు విజయం సాధించారే తప్ప.. ఆయనకు మాత్రం శాసనసభ్యుడిగా ఎన్నిక కాలేదు. అయినా ప్రతీ పర్యాయం ఆయన రెండోస్థానానికి పరిమితయమ్యారు. దీంతో టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడానికి ఆయన సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అయితే ఇటీవల నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా పట్లోళ్ల కృష్ణారెడ్డి కన్నమూయడంతో రానున్న ఉప ఎన్నికలలో విజయం సాధించాలంటే తాను పార్టీ మారక తప్పదన్న నిర్ణయానికి విజయపాల్ రెడ్డి వచ్చినట్లు సమాచారం. విజయపాల్ రెడ్డిపై ప్రజల్లో సానుభూతి ఉంది. అయితే ఇన్నాళ్లు మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న కృష్ణారెడ్డికి అక్కడి ప్రజలు అండగా నిలిచారు. అయితే ఆయన కన్నుమూసిన తరువాత ప్రజలు మాత్రం విజయపాల్ రెడ్డి వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఇక్కడ పార్టీ మాత్రమే అయన విజయానికి అవరోధంగా మారిందన్న వార్తలు తీవ్రస్థాయిలో వినబడుతున్నాయి. టీడీపీ నుంచి పోటీ చేయడం వల్లే తెలంగాణ రాష్ట్రంలో ఆయనకు విజయావకాశాలు సన్నగిల్లుతున్నట్లు చెబుతున్నారు.

కాగా గత ఎన్నికలలో రెండోస్థానంలో నిలిచిన విజయపాల్ రెడ్డి సోదరుడు భూపాల్ రెడ్డి.. ఈ సారి కూడా పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే అన్నదమ్ముల ఎన్నకల పోరులో ఫలితం మరోమారు కూడా కాంగ్రెస్ సోంతం కావచ్చునన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఉప ఎన్నికలలో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తే.. తమకు లాభం ఉండదన్న టీఆర్ఎస్ ఈ క్రమంలో మరోమారు కాంగ్రెస్ ఈ సీటును రానీయకుండా ప్రజల్లో విజయ్ పాల్ రెడ్డికి వున్న పాపులారిటీ తో పాటు తమ పార్టీ టిక్కెట్ ఇస్తే విజయదుంధు:భి మ్రోగించడం ఖాయని పార్టీ వర్గాలు అంచనాకు వచ్చాయి. అయితే భూపాల్ రెడ్డికి ఎమ్మెల్సీ కట్టబెట్టడం ఉత్తమమని పార్టీ జిల్లా నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijayapal Reddy  Telangana Tdp leader  naraynakhed  by elections  TRS  

Other Articles