Chandrababu in Scam | Keshvareddy schools

Chandrabababu naidu and narayana in the keshva reddy schools scam

Chandrababu Naidu, KeshvaReddy schools, Scam, Narayana, AP

deschandrabababu naidu and Narayana in the Keshva reddy schools scam. A political gossip goes viral in the state of AP. Keshva Reddy schools which collect near to 400 crores.

కేశవరెడ్డి కుంభకోణంలో చంద్రబాబు..?నారాయణ..?

Posted: 09/09/2015 11:38 AM IST
Chandrabababu naidu and narayana in the keshva reddy schools scam

కాదేదీ కవిత్వానికి అతతీం అన్నాడు శ్రీశ్రీ కానీ.. మన రాజకీయ నాయకులు మాత్రం కాదేదీ కుంభకోణానికి అతీతం అన్నట్లు తయారయ్యారు. ఎందుకంటే అడుగడుగునా కుంభకోణాలు చోటుచేసుకుంటే శ్రీశ్రీ గారి గొప్ప కవితకు అర్థమే మారిపోతుంది. తాజాగా ఓ కుంభకోణంలో కొత్త పేరు వినిపిస్తోంది. ఆ వినిపిస్తున్న పేరు మామూలు వ్యక్తిదే అని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఏపి సిఎం చంద్రబాబు నాయుడు పేరు కావడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంతకీ ఏంటా కుంభకోణం అనుకుంటున్నారా..? కేశవరెడ్డి కాన్సెప్ట్ స్కూల్స్. అవును స్కూల్ పేరుతో చేసిన ఓ చాటు మాటు దోపిడీలో చంద్రబాబు నాయుడు ఉన్నారంటూ వస్తున్న వార్తలు అందరికి ఆశ్చర్యాన్నికలిగిస్తున్నాయి. దాదాపు 400 కోట్ల రూపాయల వరకు జరిగిన వసూళ్లతో బోర్డ్ తిప్పేయడం. దాని వెనుక చంద్రబాబు, అనుచరుల హస్తం ఉందని వార్తలు రావడం విశేషం.

2005లో కేశవరెడ్డి కాన్సెప్ట్ స్కూల్ లో ‘తరగతిని బట్టి డిపాజిట్‌ చెల్లిస్తే, పిల్లల చదువు పూర్తయిన వెంటనే తిరిగి మీ సొమ్ము మీకు తిరిగి ఇచ్చేస్తాం’ అని నమ్మబలికారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 56 బ్రాంచిల‌ ద్వారా దాదాపు 400 కోట్లకు పైగా డిపాజిట్లును వసూలు చేసినట్లు అంచనా. ఇందులో చిత్తూరు జిల్లా మదనపల్లిలో రూ.ఆరు కోట్లు, తిరుపతిలో రూ.22 కోట్లు వసూలైనట్లు అధికారులు నిర్ధారించారు. తొలుత ఐదేళ్ల పాటు నమ్మకంగా డిపాజిట్లను తిరిగి చెల్లించిన కేశవరెడ్డి ఆ తరువాత వాయిదా వేస్తూ వచ్చారు. డిపాజిట్‌ దారులు ఏడాదిగా బ్రాంచిల చుట్టూ తిరుగుతున్నా స్పంద‌న లేదు. కేశవరెడ్డి తీరుపై ఆగ్రహించిన బాధితులు నెలరోజులుగా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. తమకు న్యాయంచేయాలని ప్రజాప్రతినిధులను, అధికారులను వేడుకున్నారు. కలెక్టర్‌ స్పందిస్తూ డిఇవో నేతృత్వంలో విచారణ కమిటీని వేశారు. త్వరలో జిల్లాలోని బ్రాంచిలను విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

గ‌త ఏడాది వ‌ర‌కు బాగానే సంపాదించిన కేశ‌వ‌రెడ్డి సంస్థలు ఇపుడు హఠాత్తు గా ఎందుకు న‌ష్టాల్లో కూరుకుపోయాయి? అలా జ‌రిగితే ప్రభుత్వం ఏం చేస్తోంది అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికి కార‌ణం చంద్రబాబు కోటరీలో కీలక మంత్రి నారాయ‌ణ అని కొంత మంది అనుకుంటున్నారు. కేశవరెడ్డి విద్యాసంస్థలను త‌మ చేతుల్లోకి తీసుకునేందుకు ఏపీ మంత్రి నారాయణ ఎత్తుగ‌డ‌ వేశారని. ఈ క్రమంలో ఆ విద్యాసంస్థలను త‌నదైన శైలిలో ఒత్తిడి చేశారని సమాచారం. త‌ద్వారా పాత మేనేజ్‌మెంట్ వాటిని స‌మ‌ర్థంగా న‌డిపించ‌లేక‌…వాటాదారుల‌కు సొమ్ములు చెల్లించ‌లేక న‌ష్టాల పాల‌యింది కొంత మంది భావిస్తున్నారు. తాజాగా రంగంలోకి దిగిన నారాయ‌ణ‌ త్వర‌లోనే కేశ‌వ‌రెడ్డి సంస్థల‌ను త‌న నారాయ‌ణ కాన్సెప్ట్‌ స్కూల్స్‌  కు అప్పగించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడని వెల్లడైంది. బాబు క్యాబినెట్ మంత్రిగా ఉన్న వ్యక్తి త‌న పాత విద్యా వ్యాపార‌ అనుభ‌వంతోనే 400 కోట్ల సంస్థను మోసం చేసేందుకు స్కెచ్ వేస్తే.. చంద్రబాబు మౌనం వహిస్తున్నారని, దీనివల్ల చంద్రబాబుకు 400 కోట్ల కుంభకోణంతో సంబంధం ఉందని ప్రచారం జరుగుతోంది.



If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  KeshvaReddy schools  Scam  Narayana  AP  

Other Articles