reaseon behind kadiyam announcement of no dsc this year

How come telangana vaccant teacher posts evapourated

kadiyam on dsc, united state vaccancies evapourated, bitter news to teacher job Aspirants, no dsc this year says kadiyam srihari, deputy chief minister kadiyam srihari, bitter news, teacher job Aspirants, telangana, Telangana government

what is reason behind Telangana deputy cm kadiyam srihari announcement on dsc, how come united state vaccant teacher posts evapourated

ఉమ్మడి రాష్ట్ర ఉపాధ్యాయ ఖాళీలు ఉష్ కాకీ....?

Posted: 08/18/2015 03:27 PM IST
How come telangana vaccant teacher posts evapourated

సుమారుగా రెండు దశల్లో జరిగిన ఉద్యమం తరువాత సాకారమైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంతో తమ కష్టాలు దూరమవుతాయని భావించుకుంటూ ఉద్యమంలో క్రీయాశాలక పాత్ర పోషించిన నిరుద్యోగుల ఆశలు అడియాలుగా మారుతున్నాయి. దేశ 29వ రాష్ట్రంగా జూన్ రెండున అవిర్భవించిన తెలంగాణ స్వప్నం సాకారమై 15 మాసాలు కావస్తున్నా.. రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయింది. తెలంగాణ వచ్చినా.. మా బతుకుల్లో వెలుగులు లేవు, ఉద్యోగాలతో వెలుగుల్ని నింపాల్సిన పాలకులకు తమను పట్టించుకోవడం లేదంటూ నిరుద్యోగులు అంగళారుస్తున్నారు.

తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా డిగ్రీ పూర్తి చేయడమే గగనంగా మారినా.. వాటితో పాటు బిఎడ్, పండిత్ కోర్సులు చేసి.. బతకలేక బడి పంతులు అన్నట్లుగా.. చిన్న ఉపాధ్యయ పోస్టును సాధించి. రేపటి తరాలను, భావి పౌరులను క్రమశిక్షణలో తీర్చిదిద్దేందుకు దోహదం పడదామని ఎదురు చూస్తున్న ఉపాధ్యయ ఆశావహుల ఆశలను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ ఏడాది డీఎస్సీ లేదని ప్రకటనతో అడియాశలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణకు చేసిన ఏర్పాట్లను అడ్డుకుని.. తమ రాష్ట్ర ఖాళీలను అలాగే ఉంచాలని, వాటిని ఆంధ్రవారితో భర్తీ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అరోపించిన అప్పటి ప్రతిపక్షం.. టీఆర్ఎస్ అడ్డుకుంది.

తలెంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాది కావస్తున్నా.. ఆప్పటి ఖాళీలను ఇంకా భర్తీ చేయలేదు. అటు మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పదివేల పైచిలుకు పోస్టులకు ఉసాధ్యాయ పోస్టులకు పరీక్షలు నిర్వహించినా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం చల్లగా చావుకబురు చెప్పిందన్నట్లుగా  తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ లేవు. ఇప్పట్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశమేదీ లేదని ప్రకటన చేసింది. మరి రాష్ట్ర విభనకు ముందు ఉన్న ఖాళీలు ఏమైనట్లు.. ఎవరితో భర్తీ  చేశారు. ఎలా భర్తీ చేశారు అన్న అనుమానాలు నిరుద్యోగులలో రేకెత్తుతున్నాయి.

రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర సర్కార్‌ 10,313 పోస్టులను భర్తీ చేసింది. అంటే... ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం తెలంగాణలో సుమారు 8 వేల పోస్టులు ఖాళీగా ఉండాలి! కానీ, ఖాళీలేవీ లేవని మంత్రి కడియం శ్రీహరి ప్రకటించడం నిరుద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో చివరి సారిగా 2012లో డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. అప్పట్లో 21వేల పోస్టులు భర్తీ చేశారు. ఆ తరువాత 2014లో 18వేల పోస్టులతో నోటిఫికేషన్‌ రావాల్సి ఉన్నా... అది సాధ్యపడలేదు. కాగా అప్పుడు ప్రకటించిన ఖాళీల్లో సుమారు 13వేలు తెలంగాణ జిల్లాలకు చెందినవేనని సమాచారం.

కాగా, ఈ ఏడాది డీఎస్సీ లేదని ప్రకటించిన ప్రభుత్వం.. వచ్చే ఏడాది ఇప్పుడు అప్పుడు అంటూ.. కాలయాపన చేసిన మరో ఏడాది కూడా అలాగే గడిపితే.. పరీక్షలు రాసేందుకు తమ వయోపరిమితి మించిపోతుందని అశావహులు అందోళన చెందుతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా 15 వేల సోస్టులకు నియామకాలు చేపడుతున్నామని, వచ్చే నెల నోటిఫికేషన్ విడుదల అవుతుందని ప్రకటించినా..  ఇప్పటికీ ఆ నోటిఫికేషన్ ఏమైందో.. ఎందుకు కాలయాపన జరుగుతుందో కూడా అర్థం కావడం లేదని నిరుద్యోగులు అంటున్నారు. మా తెలంగాణ కోటి రతనాల వీణ.. అన్న దశరధీ మాటలను అక్షర సత్యాలు చేయాలంటే.. నిరుద్యోగుల జీవితాలలో సాధ్యమైనంత త్వరగా వెలుగులు నింపాలని తెలంగాణవాదులు కోరుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vaccant teacher posts  kadiyam srihari  Telangana government  

Other Articles