nagam janardhan reddy in a mood to quit from bjp

Nagam janardhan reddy moves far from bjp party

Nagam janardhan reddy moves far from BJP party, nagam janardhan reddy in a mood to quit from bjp, TDP government, Nagam janardhan reddy, mahaboobnagar, BJP, TDP, TRS, congress

senior politician from mahaboob nagar Nagam janardhan reddy moves far from BJP party as he is not drawing any importance within the party

బీజేపికి నాగం దూరం.. ఇంతకీ ఏమీటీ అంతరంగం..?

Posted: 08/17/2015 09:46 AM IST
Nagam janardhan reddy moves far from bjp party

తెలంగాణ రాష్ట్రం సీనియర్ నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి బీజేపి పార్టీకి దూరం అవుతున్నారా..? అంటే అవుననే సంకేతాలే వెలువడుతున్నాయి. తెలంగాణ తొలి విడత సహా మలి విడత ఉద్యమంలో పోరాడిన నేతకు కమలం పార్టీలో తగిన గుర్తింపు రావడం లేదని ఆయన బీజేపి దూరంగా వుంటున్నారు. అంతేకాదు పార్టీ నేతల నుంచి కూడా ఆయనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని తెలుస్తుంది. ఆయనను ఎన్నికల నేపథ్యంలో అవసరానికి వాడుకుని వదిలేశారని ఆయన అవేదన చెందుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం.

టీడీపీ పార్టీ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేసిన నాగం.. తాజా పరిస్థితుల నేపథ్యంలో తన భవిష్యత్తు తెలియక ఆగం ఆగం అవుతున్నారని సమాచారం. నిత్యం ముక్కుసూటిగా వెళ్లే స్వభావం.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే నైజం.. పాయింట్ వైజ్ గా ప్రశ్నించే వైనం నాగం సోంతం. అయితే ఇలాంటి నేతకు తగిన ప్రాధాన్యత లభించకపోవడంతో ఆయన బీజేపీని వీడేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి మధ్య దూరం కూడా మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా కిషన్ రెడ్డి చేపట్టిన పాలమూరు జిల్లా పర్యటనకు నాగం దూరంగా ఉన్నారు. జిల్లాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశానికి నాగం గౌర్హాజరు అయ్యారు.  అయితే కిషన్ రెడ్డి పర్యటపై తమకు సమాచారం లేదని నాగం అనుచరులు చెబుతున్నారు.

పాలమూరు జిల్లాకు చెందిన నాగం.... తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని వీడి బీజేపీలో చేరారు. అయితే ఆయనకు పార్టీలో అనుకున్నంత ప్రాధాన్యత మాత్రం లభించటం లేదు. అదే జిల్లాకు చెందిన పార్టీ నేత యెన్నం శ్రీనివాసరెడ్డికి ఇచ్చినంత ప్రాధాన్యత కూడా నాగంకు ఇవ్వటం లేదని ఆయన మద్దతుదారులు వాపోతున్నారు.  కాగా గత కొంతకాలంగా నాగం...పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బీజేపి కండువా కప్పుకుని అటు టీడీపీని, ఇటు కాంగ్రెస్, మరోవైపు టీఆర్ఎస్ లను చెడామడా తిట్టేసి.. కమలంలో భవిష్యత్తును వెతుకున్న నేతకు ఆదరణ కరువైయ్యింది. ఇప్పుడు ఆయన ఏ పార్టీలోకి వెళ్లాలని భావిస్తున్నారన్న విషయం చర్చనీయాంశంగా మారింది.

ఇటీవలే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లగా, సీఎం కేసీఆర్ లేకపోవడంతో.. నిరాశగా ఎదురుతిరిగారని కథనాలు వెలువడ్డాయి. అయితే ఆయన కారులో ప్రయాణించేందుకు ఉత్సహ పడుడుతన్నారా..? అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. ఇక మరికోందరు ఆయన అనుచరులు టీఆర్ఎస్ కన్నా అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా వుండే కాంగ్రెస్ లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఏటు తోచని స్థితిలో వున్న నాగం తిరిగి సొంతగూటికి చేరుతున్నారా..? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగం తన భవిష్యతు ఎలా వుండాలని నిర్ణయించుకుంటున్నారో ఆయన అంతరంగానికే తెలియాలి. తెలిసి అడుగేయాలి. ఆ పార్టీలో కూడా ఆయనకు ప్రాధాన్యం లభించకపోతే.. ఆయన పరిస్థితి అగం అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagam janardhan reddy  mahaboobnagar  BJP  TDP  

Other Articles