Maybe GHMC elections in December

Maybe ghmc elections in december

GHMC, Elections, Voter cards, TRS, Telangana, High court, Elections, baldia, Hyderabad, Swachh Hyderabad

Telangana Govt didnt completed some minor issues in Greater Hyderabad. the Elections commission started aadhar link to voter card.

డిసెంబర్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్..?

Posted: 08/08/2015 01:51 PM IST
Maybe ghmc elections in december

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు డిసెంబర్‌ తర్వాతే జరగనున్నట్లు తెలుస్తోంది. వార్డుల పునర్విభజన కానందునే ఎలక్షన్స్‌ ఆలస్యమవుతున్నాయని సంబంధితవర్గాలు వెల్లడిస్తున్నాయి. కానీ ప్రధాన ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాకే ఎన్నికలు నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇదే విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు కూడ సర్కారు సిద్ధమవుతుందని ప్రభుత్వంలో చర్చ జరుగుతుంది. జిహెచ్‌ఎంసి ఎన్నికలు నగరంలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌ అయ్యాయి. ఎంత తొందరగా ఎన్నికలు నిర్వహిస్తే అంత మంచిదనే రీతిలో రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఎక్కడికక్కడ తమ పార్టీ శ్రేణులను మేల్కొలిపే పనిలో ఆయా పక్షాలు నిమగమయ్యాయి. స్వచ్ఛ హైదరాబాద్‌ పేరుతో తమ కార్యకర్తల బలాన్ని పెంచుకోవాలని అధికారపార్టీ టిఆర్‌ఎస్‌ ముమ్మర ప్రయత్నాలు చేసింది.

నియోజకవర్గాల వారీగా సమీక్షల పేరుతో కాంగ్రెస్‌, టిడిపి, బిజెపి కార్యక్రమాలు ప్రారంభించాయి. ఉద్యమాల రూపేణా వామపక్షాలు సైతం క్రీయాశీలంగానే ఉన్నాయి. లోక్‌సత్తా, జనసేన, వైసిపి, ఇతర పార్టీలన్నీ బల్దియా ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నాయి. కాగా, ప్రభుత్వం వార్డుల విభజన పూర్తి కాలేదు. ఓటరు గుర్తింపునకు ఆధార్‌ కార్డు అనుసంధానమవ్వలేదు. ఇవన్నీ ఒకెత్తయితే నగరంలో చేపడుతున్న మల్టీలెవల్‌ ఫ్లైఓవర్లు, బహుళ ప్రయోజనాల ఫంక్షన్‌హాల్స్‌, ఇతర అభివృద్ధి పనులు ప్రారంభించడంతో పాటు కనీసం 50 శాతం పనులు పూర్తయ్యే వరకు బల్దియా ఎన్నికలను ఆలస్యం చేయాలనే యోచనలో సర్కార్‌ ఉన్నట్లు తెలిసింది. అంతేకాకుండా డిసెంబర్‌ తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని మరో సారి హైకోర్టుకెళ్లేందుకు సర్కార్‌ యోచిస్తోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే ఆయా రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశమూ లేకపోలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC  Elections  Voter cards  TRS  Telangana  High court  Elections  baldia  Hyderabad  Swachh Hyderabad  

Other Articles