anti social elements challenge government officials, law and order faces questions

Government officials face life threat in andhra pradesh

law and order, Musunuru, TDP, Andhra pradesh, nandamuri harikrishna comes in rescue of MRO Vanajakshi, TDP polit bureau member nandamuri harikrishna, nandamuri harikrishna, harikrishna, Vanajakshi, Musunuru MRO Vanajakshi warning letter, Vanajakshi warning letter, Warning letter to MRO Vanajakshi, Mandal magistrate, Mandal revenue officer, Musunuru, TDP, Warning letter

anti social elements challenge government officials, as musunuru mro vanajakshi recieves threat letter stating her to get transfered or will be killed

నాటి ఘనాపాటి.. ఏదీ వెదురు (పోలీసు) లాఠీ...

Posted: 08/06/2015 07:34 PM IST
Government officials face life threat in andhra pradesh

రాష్ట్రంలో శాంతిభద్రతలకు ప్రమాదం వచ్చింది. పట్టపగలు ఫాక్షన్ హత్యలు జరుగుతున్నాయ్.. ఆడపడుచులకు భద్రత కరువైంది. ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలను కాపాడేది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే. తాము అధికారంలోకి వస్తే.. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగనీయకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలో ఊదరగోట్టి అధికారంలోకి వచ్చిన టీడీపీ.. అధికారంలోకి వచ్చిన 14 మాసాలు కావస్తున్నా.. రాజధాని నిర్మాణంపై, పేద రైతుల భూములను సేకరించడపై పెట్టిన శ్రధ్ద.. శాంతి భద్రతల విషయంలో మాత్రం చూపడం లేదు.

నిజానికి చంద్రబాబు పాలన అంటే శాంతిభద్రతలకు పెద్దపీట వేస్తుందని తొమ్మిదేళ్ల అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు ప్రజలు. అయితే.. ఈ సారి మాత్రం తమకు శాంథిభద్రతలు పట్టవన్నట్లు ఆయన వ్యవహరిస్తుంటే.. ప్రజలు విస్తుపోతున్నారు. శాంతి భద్రతలను పరిరక్షించడంతో చంద్రబాబును మించిన ఘనపాటి లేరని ఆయన పార్టీని అధికారంలోకి తెచ్చిన ప్రజలు ఇప్పుడాయన దృష్టి మరలిపోవడంపై నాటి ఘనాపాటికి ఏదీ వెదురులాఠీ అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
 
గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్శిటీ మొదటి సంవత్సరం చదువుతున్న తెలంగాణ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన జరిగి పక్షం రోజుల కావస్తున్న.. అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలేజీ ప్రిన్సిఫల్ స్వయంగా విద్యార్థులను నైట్ క్లబ్ లకు తీసుకువెళ్లి వారితో కలసి స్టేట్ పై డాన్స్ చేసినా.. ఆ వీడియోలు భయటకు వచ్చినా ఆయనపై ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రిషితేశ్వరి తరువాత, నెల్లూరు జిల్లాలో మరో ఘటన, కృష్ణా రాష్ట్రంలో మరో ఘటనలు జరిగినా ప్రభుత్వం ర్యాగింగ్ భూతంపై చర్యల్లో తీసుకోవడంతో కేవలం ప్రకటనలకే పరిమితం అవుతోంది.

ఇక రెవెన్యూ ఉద్యోగులందరినీ ఏకం చేసి అందరూ ఒక్కటిగా ఏకతాటిపైకి వచ్చిన ఉద్యమించే దిశగా ప్రేరేపించిన సంఘటన ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి ఘటన. అక్రమంగా ఇసుక రవాణా చేస్తు దందాలకు పాల్పడుతున్న ఓ నిజాయితీ గల మహిళా అధికారిపై.. స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సాక్షిగా అయన అనుఛరులు దాడికి పాల్పడ్డారు. అమెతో పాటు మండల రెవెన్యూ సిబ్బందిపై ఇసుక మాఫియా గుండాలు దాడులు చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగులందరూ.. ఏకమై విధులను బహిష్కరించారు.

సమస్య తీవ్రస్థాయికి చేరడంతో తమ గూటికి చెందిన పక్షిని రక్షించుకునే క్రమంలో ఎట్టకేలకు రంగంలో దిగిన పార్టీ అధినేత. ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు.. రెవెన్యూ ఉద్యోగులతో తన నివాసంలో చర్చలు జరిపి వారిని తిరిగి విధుల్లకు హాజరవ్వడంలో సఫలీకృతుల్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటన జరిగి పక్షం రోజులు దాటుతున్నా.. ఇప్పటి చింతమనేనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పార్టీ అధినేతకే తెలియాలి.

ఈ క్రమంలో ముసునూరు ఎమ్మార్వో వనజాక్షికి చంపేస్తామంటూ.. ఆగంతకుల నుంచి బెదిరింపు లేఖ అందింది. పది రోజుల్లో ఉరు విడిచి వెళ్లాలని, ముసునూను నుంచి బదిలీ కావాలని.. లేకుంటే చంపేస్తాం అంటూ ఆగంతకుల బెదిరింపు లేఖ సారాంశం. ఇప్పటికే ఆమెను హతమార్చేందుకు రెండు పర్యాయాలు రెక్కీ నిర్వహించామని కూడా ఆగంతకులు లేఖలో పేర్కోన్నారు. మీ భర్త, పిల్లల్ని వదిలి మిమ్మల్ని చంపడానికి ప్లాన్ సిద్దం చేశామని ఆగంతకులు పేర్కోన్నారు. అందుకోసం ఇసుక రీచ్ లో గోడవ జరిగిన 8వ రోజే వనజాక్షిని చంపమని తమకు సుఫారీ ఇచ్చారని లేఖలో ఆగంతకులు పేర్కోన్నారు. దాంతో వనజాక్షి ముసునూరు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే స్వయంగా ప్రభుత్వాధినేత చంద్రబాబు హామీతో విధులకు హాజరైన రెవెన్యూ అధికారులలో ఇప్పుడీ లేఖ.. ఆందోళనను కలిగిస్తుంది. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా..? అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యేందుకు కారణమవుతుంది. ఇంత జరుగుతున్నా రాష్ట్ర హోం మంత్రి చిన్నరాజప్ప ఏం చేస్తున్నారు..? ఎక్కడున్నారు..? ఆయన ప్రభుత్వంలో భాగం కాదా..? అని విమర్శలు వినబడుతున్నాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఏ కేసులో చిక్కుతారా..? అంటూ ఎదురుచూస్తున్న ఏపీ పోలీసులు వారిపై వెనువెంటనే కేసులు బనాయించి.. జైళ్లకు పంపడంలో సిద్దహస్తులుగా పేరు తెచ్చుకున్నారు. వారికి కేవలం ప్రతిఫక్ష పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులే టార్గెట్ గా పనిచేస్తున్నారా..? లేక ప్రజల రక్షణ బాధ్యతను కూడా నిర్వర్తిస్తున్నారా..? అన్న ప్రశ్నలు కూడా వినబడుతున్నాయి. ఎమ్మార్వో వనజాక్షి కేసులో బాధ్యులైన వారిని ఎందరినీ జైలు పంపారని కూడా ప్రజలు నిలదీస్తున్నారు. ఈ ప్రశ్నలకు పోలీసులు అధికారులు ఏమి బదులిస్తారో..? వారికే తెలియాలి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vanajakshi  law and order  Musunuru  TDP  Andhra pradesh  

Other Articles