RSS eases pressure on BJP, recommends not to act on tainted leaders before Bihar polls

Lalit modi row bjp not to take against vasundhara raje sushma swaraj

bjp party top brass ready to take action against raje, Raje Leaves Delhi Without Meeting BJP Top Brass, rajasthan, cm, vasundhara, raje, leaves, delhi, without, meeting, bjp, top, brass, india, lalit modi, narendra modi, niti aayog, BJP chief Amit Shah, modigate, vasundhara raje, bjp high comand, Narendra modi

The Rashtriya Swayamsevak Sangh (RSS) which seemingly has a strong grip over the BJP-led central government is averse to action against any of the tainted leaders.

మౌనమే.. నీ మాటా... ఓ మూగ మనసా..?

Posted: 06/30/2015 07:34 PM IST
Lalit modi row bjp not to take against vasundhara raje sushma swaraj

ఆర్థిక నేరాల అభియోగాలు ఎదుర్కోంటున్న ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ విదేశాలకు సునాయాసంగా వెళ్లేందుకు సహకరించారన్న వ్యవహరాంలో పీకల్లోతు కష్టాలలో కూరుకుపోయిన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై చర్యలకు కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించిందా..? అంటే కాదనే సమాధానాలే వినబడుతున్నాయి. వారిపై చర్యలు తీసుకోవడంలో ఇంకా మరికోంత కాలం బిజేపి మీనమేశాలు లెక్కపెడుతుందా..? అంటే అవునన్నే బదులు వస్తుంది. లలిత్ గేట్ వ్యవహరంలో వీరిద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని తెలుస్తుంది.

బీహర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిజేపీ.. అక్కడ తమ జెండాను ఎలాగైనా ఎగురవూయాలని భావిస్తున్న తరుణంలో లలిత్ గేట్ వేలుగుచూసింది. బిజేపి దాని మిత్రపక్షాలు బిజేపి ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడీని ఎన్నకున్న సందర్భంగా అప్పటి వరకు మిత్రపక్షంగా కోనసాగిన జేడీయు బిజేపితో తెగదెంపులు చేసుకుంది. మరీ ముఖ్యంగా బిహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ నేరుగా నరేంద్రమోడీపై విమర్శలు గుప్పించారు.

దీంతో ఇరు పార్టీల మధ్య అప్పడు రాజకున్న అగ్గి.. ఎన్నికలలోనే తేల్చుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఈ ఏడాది చివరిలో రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు కళంకితులుగా అభియోగాలు ఎదుర్కోంటున్న కేంద్రమంత్రి, ముఖ్యమంత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని, విపక్షాల ఒత్తిడికి తలొగ్గవద్దని ఆర్ఎస్ఎస్ ఉద్బోదించింది. దీంతో ఇరువురు మహిళా నేతలుకు ప్రస్తుతానికి పదవీ గండం లేనట్లేనని సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modigate  Bihar Polls  BJP  BJP government  RSS  Sushma Swaraj  vasundhara Raje  

Other Articles