venkaiah naidu | controversary comments | father of the nation | mahatma gandhi

Venkaiah naidu controversial comments on father of nation

venkaiah naidu takes on rahul gandhi, congress party leaders, Venkaiah naidu, central minister, rahul gandhi, kisan sandesh yatra, cintroversial comments, mahatma gandhi, father of the nation, power politics

venkaiah naidu takes on rahul gandhi and congress party leaders alleges kisan sandesh yatra as a part of power politics

జాతిపితపై వెంకయ్య వివాదాస్పద వ్యాఖ్యలు..?

Posted: 05/15/2015 10:22 PM IST
Venkaiah naidu controversial comments on father of nation

నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్లు యూపీఏ హయాంలో రాజ్యసభలో పలు బిల్లులను నిలువరింపజేసిన అప్పటి ప్రతిపక్ష బీజేపీకి ఇప్పడు కాంగ్రెస్ అమలుపరుస్తున్న అదే విధానం మింగుడు పడటం లేనట్లుంది. అధికారంలో వున్న బీజేపి ప్రభుత్వానికి ఇది అసహనాన్ని కలిగించేందుకు కారణమవుతోంది. దీనికి తోడు ఎలాగైనా తమ పట్టుబట్టిన బిల్లులను అమోదం చేసుకోవాలని బీజేపి ప్రయత్నిస్తుండగా, బీజేపి చేస్తున్న సవరణలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమానికి కూడా సిద్దమైంది. ముందే నెలకోన్న అసహనానికి.. ఈ అక్కస్సు కూడా తోడై బీజేపి నేతలను కలవర పెడుతున్నట్లు వుంది.

గత యూపీఏ ప్రభుత్తం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూ సేకరణ బిల్లులో సవరణలు చేసిన బీజేపి ప్రభుత్వం.. దానిని పార్లమెంటులో అమెదింపజేసుకునేందుకు అన్ని రకాలుగా వ్యయప్రయాసలు పడుతోంది. ఈ క్రమంలో ఎట్టిపరిస్థితుల్లో దానిని పార్లమెంటులో నెగ్గనీయకుండా అడ్డుకుంటామని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాందీ లోక్ సభలో తేల్చిచెప్పారు. ఈ క్రమంలో పార్లమెంటు లోపలా. భయట దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్నారు. ఈ ప్రసంగం మధ్యలో సూటు బూటు వేసుకున్న పెద్దలు మీ కాళ్ల కింద వున్న బంగారు భూమిని లాక్కునేందుకు కూడా యత్నిస్తారని రైతులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ క్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రధాని మోడీ సూటు బూటు వేసుకున్నారా..? అంటూ ప్రశ్నిస్తూనే.. మరో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. మోడీ సూటు వేసుకున్నారని కాంగ్రెస్ నేతలు అరోపిస్తున్నారని.. అప్పట్లో గాంధీ, నెహ్రూలు కూడా సూటు బూటు వేసుకున్నారన్న సంగతి మర్చిపోవద్దని సూచించారు. అయితే నెహ్రూను విమర్శంచడంలో వెంకయ్య తప్పిదం లేకపోవచ్చు కానీ, మహాత్మ గాంధీని కూడా జత కట్టి వెంకయ్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.

జాతిపిత మహాత్మ గాంథీని కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగా ఆయన అభివర్ణించడం.. ఆయన సూటు వేసుకున్నారని గుర్తు చేయడం ఎంత వరకు సమంజసం అయనకే తెలియాలి. ప్రథాన మంత్రి నరేంద్ర మోడీ.. జాతిపిత కలలు కన్న పరిశుభ్రమైన సమాజం కోసం ఆయన జన్మదినం రోజునే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించి.. దేశవ్యాప్తంగా పలువురు వాణిజ్యవేత్తలకు, క్రీడాకారులకు, రాజకీయ నాయకులకు ఈ కార్యక్రమంలో పాల్గోనాలని పిలుపునిచ్చిన విషయం కూడా తెలిసిందే. కానీ వెంకయ్య మాత్రం గాందీజీని పార్టీ వ్యక్తిగానే అభివర్ణించి అవమానించారని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

దేశానికి స్వతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిన మహనీయులను గౌరవించకపోయినా పర్వాలేదు కానీ.. వారిని అవమానించే స్థాయికి చేరుకోవద్దని పలువురు సూచిస్తున్నారు. స్వాత్రంత్య ఉద్యమానికి ముందు గాంధీజీ సూటు బూటు వేసుకున్నారు కానీ, ఉద్యమానికి తీసుకువెళ్తున్న క్రమంలో ఆయన చోక్కాను కూడా వదిలివేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని వెంకయ్యకు పలువురు గాంధేయవాదులు సూచిస్తున్నారు. రాజకీయాల మద్యలో మహనీయుడి ప్రస్తావన తీసుకువచ్చి.. వారికి అపఖ్యాతిని మూటగట్టేందుకు చేసే రాజకీయాలను ఇప్పటికైనా రాజకీయ నాయకులు చాలించుకోవాలని కోరుతున్నారు.
.
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkaiah naidu  central minister  rahul gandhi  kisan sandesh yatra  

Other Articles