Congress to nominate kushboo as tnpcc women cell chief

congress to nominate kushboo as TNPCC women cell chief, Actress kushboo yet to get key post, congress leader kushboo to get good post, threat to kushboo in congress, state women cell president post to kushboo, TNPCC women cell chief Actress kushboo, TNPCC women cell chief kushboo,

congress to nominate kushboo as TNPCC women cell chief

తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా...?

Posted: 03/22/2015 03:24 PM IST
Congress to nominate kushboo as tnpcc women cell chief

డీఎంకే పార్టీకి టాటా చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నటి కుష్భుకు ఆ పార్టీలో ఆదరణ లభిస్తున్నది. ఆమెను తమ ప్రాంతానికి వచ్చి సభల్లో ప్రసంగించాలని కాంగ్రెస్ నాయకులు అమెను ఆహ్వానించేందుకు పోటీ పడుతున్నారు. కుష్బూతో తమిళనాట మరోమారు కాంగ్రెస్ వైభవం తథ్యమన్న వారు లేకపోలేరు. ఈ తరుణంలో కష్బూకు పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు రంగం సిద్దమవుతోందన సమాచారం. కాంగ్రెస్‌లో ప్రత్యేక గ్లామర్‌గా అవతరించిన కుష్భు.. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీలో చేరినా.. ఇంతవరకు ఎలాంటి పదవి కేటాయించలేదు. అయితే అమెకు రాజ్య సభ పదవి ఇవ్వాలని యోచించినా.. కాంగ్రెస్ ఇటీవల రాష్ట్రాలలోనూ అనుకున్న మేర విజయాలను నమోదు చేసుకోకపోవడంతో ఇప్పడు కష్బూకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాల్ని కేటాయించేందుకు అధిష్టానం కసరత్తులు చేస్తున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి.

దీంతో మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు కుష్భుకు దక్కనున్నాయన్న ప్రచారంతో రాష్ట్ర పార్టీలోని సీనియర్ మహిళా మణులు కినుకు వహించే పనిలో పడ్డారు. తమను కాదని నిన్నగాక మొన్న వచ్చిన కుష్భుకు ఆ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించేందుకు సిద్ధం అవుతున్నారు. కాగా, ఆ పదవిని చేజిక్కించుకునేందుకు రాహుల్ మద్దతు దారు జ్యోతి మణి తీవ్రంగానే కుస్తీలు పడుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే మరి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TNPCC  Kushboo  women cell chief  

Other Articles