Four ycp mlas may join tdp

four ycp mlas may join tdp, four ycp mlas to join tdp, four ycp mlas from nellore to join tdp, gudur mla pasham sunil, kavali ramireddy pratapkumar reddy, sarvepally mla kakani govardhan reddy, sullurupeta mla sanjeevaiah, minister narayana,

four MLAs from Nellore district of YS Jagan's YSR Congress may join in Andhra Pradesh CM Nara Chandrababu Naidu's Telugudesam party.

గోడ దూకేందుకు సిద్దంగా ఆ.. నలుగురు..?

Posted: 01/10/2015 05:14 PM IST
Four ycp mlas may join tdp

వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మరో జలక్ తగలనుందా..? అంటే అవుననే సమాధానాలు వినబడుతున్నాయి. వైసీపీ అధినేత వైయస్ జగన్ కు పెద్ద షాక్ ఇచ్చేందుకు నెల్లూరు జిల్లాకు చెందిన నలుగురు ప్రజాప్రతినిధులు రెడీ అవుతున్నారు. వైసీపీ పార్టీలోంచి.. అధికార టీడీపీ పార్టీలోకి గొడ దూకేందుకు సిద్దమవుతున్నారు. జిల్లాలోని మెజారిటీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు అధినేత జగన్‌కు షాక్ ఇవ్వడానికి సిద్ధపడినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నలుగురు ఎమ్మెల్యేలు సర్వం సిద్ధం చేసుకున్నారని సమాచారం

గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య త్వరలో టిడిపిలో చేరుతారని జిల్లాలో ప్రచారం జోరందుకుంది. మంత్రి నారాయణ కొద్ది రోజులుగా నలుగురు ఎమ్మెల్యేలతో జరుపుతున్న మంతనాలు ఓ కొలిక్కి రావడంతో ఆ నలుగురు వైసీపీ నుంచి విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

2014 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో ఏడింట వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. నెల్లూరు, తిరుపతి ఎంపీ స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. ఊహించని రీతిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు నిరాశకు గురయ్యారు. అంతే కాకుండా, ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే ఒకరిద్దరి ఎమ్మెల్యేల మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. అయితే, వాటిని పరిష్కరించడంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకత్వం విఫలమైందని అందువల్లే తాము పార్టీ నుంచి వీడిపోతునట్లు వారు బహిరంగంగానే చెబుతున్నారు.

నెల్లూరు జిల్లా నిన్న జరిగిన ఫ్లెమింగో ఫెస్టివల్‌లో పాల్గొన్న సునీల్ - ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసలు, పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణను కూడా ప్రశంసించారు దీని వెనుక ఉన్న పరమార్థం సునీల్‌ టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి సునీల్‌ గతంలో టీడీపీలో ఉంటూ గూడూరు మున్సిపల్‌ చైర్మన్‌గా గెలుపొందారు. ఇక సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య కూడా సునీల్‌ బాటలోనే నడుస్తారని సమాచారం.

కావలి, సర్వేపల్లి ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి, కాకాణి గోవర్థనరెడ్డి కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడి ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. కావలి, సర్వేపల్లి నియోజకవర్గాల్లో ఎన్నికల సందర్భంగా నకిలీ మద్యం పంపిణీకి సంబంధించి కొంతమంది వైసీపీ నేతలపై ఉన్న కేసులను సీబీసీఐడీ దర్యాప్తు చేస్తోంది. జిల్లాలో టీడీపీని పటిష్ఠపరచడంలో భాగంగా మంత్రి నారాయణ కొందరు వైసీపీ ఎ మ్మెల్యేలతో చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో వారు టిడిపిలోకి వెళ్లి సమస్యల నుంచి గట్టెక్కే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ys jagan  ysr congress  nellore  YCP  TDP  telugu desham  

Other Articles