Chandrababu naidu wants tollywood in telangana and andhra pradesh

andhra pradesh tollywood, tollywood moving to vizag, tollywood in telangana, chandrababu naidu on memu saitham, memu saitham programme highlights, tollywood latest news updates, tollywood stars on hud hud programme, kcr on tollywood

chandrababu naidu wants tollywood in telangana and andhra pradesh : ap chief minister chandrababu says tollywood industry should develop in telangana and also in andhra pradesh, government will be with movie artists in development programmes

మేముసైతంలో కోరికను బయటకు చెప్పాడు

Posted: 12/01/2014 09:26 AM IST
Chandrababu naidu wants tollywood in telangana and andhra pradesh

టాలీవుడ్ వైజాగ్ కు తరలిపోతుందన్న ఊహాగానాలు ఇంకా తగ్గటం లేదు. ఇండస్ర్టీ హైదరాబాద్ లోనే ఉంటుందని సినిమా ప్రముఖులు ప్రకటించినా.., వైజాగ్ పై ఆశలు మాత్రం అలాగే ఉంటున్నాయి. చాలామంది స్టార్లు ఇండస్ర్టీ వైజాగ్ వెళ్తే బాగుండు అనుకుంటున్నారు. అటు ఏపీ ప్రభుత్వం కూడా ఇదే కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని పరోక్షంగా ప్రకటించారు. ‘మేము సైతం’ కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు, తెలుగు పరిశ్రమ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో అభివృద్ధి చెందాలన్నారు. తెలంగాణలోని హైదరాబాద్ లో ఇప్పటికే ఇండస్ర్టీ వేళ్ళూనుకుపోయి అభివృద్ధి జరిగింది. కాని ఏపీలో అలా లేదు. అంటే టాలీవుడ్ ఏపీకి రావాలని ఆయన పరోక్షంగా ఈ వేదిక ద్వారా మనసులో మాటను బయటపెట్టారు.

ఇఫ్పటికే విశాఖలో చాలా సినిమాల షూటింగులు జరుగుతున్నాయి. వైజాగ్ లో వారానికోసారైనా సినిమా షూటింగ్ జరుగుతుంది. కొందరు పెద్ద నిర్మాతలు స్టూడియోలు కూడా కట్టించారు. అయితే ఇండస్ర్టీ తరలిపోదు అని మా ప్రకటించటంతో వారంతా చతికిలబడ్డారు. కాని చాన్సు వస్తే మాత్రం వైజాగ్ కు ప్యాకప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే వైజాగ్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ హైదరాబాద్ తో పోలిస్తే ఎక్కువ. ఖర్చులను హీరోలు, ఇతర స్టార్లు అంటే భరించగలరు. కాని టెక్నిషియన్లు, ఎక్కువ సంఖ్యలో ఉండే కిందిస్థాయి కార్మికులు ఈ ఖర్చులు భరించలేరు. దీనికి తోడు ఇక్కడ తరుచుగా వర్షాలు, తుఫానులు వచ్చే అవకాశాలు ఎక్కువ కావటంతో సినీ ప్రముఖులు ఎలా చేయాలి అనే ఆలోచనలో పడ్డారు.

ఇండస్ర్టికి ప్రస్తుతం తెలంగాణలో వచ్చిన ఇబ్బందేమి లేదు. పరిశ్రమను కళ్ళలో పెట్టుకుని చూసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారు. కాని ఇండస్ర్టీలో మాత్రం విభజనలు వచ్చి, తెలంగాణ, ఏపీ అనే ఫీలింగ్ ఏర్పడింది. రాష్ర్టాల వారిగా సంఘాలు కూడా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఎదురయ్యే ఇబ్బందులను తట్టుకుంటూ ఇక్కడే ఉంటారా.. లేక విశాఖకు వెళ్లిపోతారా అనేది తెలియాల్సి ఉంది. ఏపీ సీఎం తాజా ఆహ్వానంపై ఇండస్ర్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : vizag  tollywood  chandrababu  telangana  

Other Articles