Ysr congress learders of vishakapatnam district set to join tdp soon

ysr congress, ysr congress leaders, ysr congress vishakapatnam leaders, ysr congress programmes latest updates, jagan mohan reddy latest news, jagan mohan reddy case latest updates, andhra pradesh politics, dadi veerabadra rao, konatala rama krishna, telugudesam party andhra pradesh, bjp andhra pradesh, telugu latest news updates

ysr congress learders of vishakapatnam district set to join tdp soon : ysr congres cheif jagan mohan reddy soon to face shock by vizag leaders as they all set to join in tdp very soon also dadi veerabadra rao to go back to his home party very soon with this party leadership in vishakapatnam district will no more

ఇక దిమ్మతిరిగి బొమ్మ కన్పిస్తుందేమో

Posted: 11/17/2014 08:35 AM IST
Ysr congress learders of vishakapatnam district set to join tdp soon

ఆంధ్ర్రపదేశ్ రాష్ర్టంలో ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ వైభవం క్రమంగా తగ్గుతుంది. పార్టీలో జంపు జిలానీలు ఎక్కువ కావటంతో వైసీపీ బలం తగ్గుతోంది. అసెంబ్లీకి తొలిసారి ఎన్నికవటంతోనే ప్రతిపక్ష హోదాలో కూర్చుని ప్రభుత్వానికి చుక్కలు చూపెడుతున్న జగన్ బాబుకు సొంత పార్టీ నేతలే దిమ్మతిరిగే షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే పార్టీలో లుకలుకలు ఎక్కువ కాగా.., వీటి సంఖ్య ఇక మరింత పెరగనుంది. త్వరలోనే విశాఖ జిల్లా వైసీపీ ఊడ్చుకుపోవటం ఖాయమని తెలుస్తోంది.

విశాఖను తీసుకుంటే పార్టీకి ఇద్దరే బలమైన నేతలుగా ఉన్నారు. అందులో ఒకటి కొణతాల రామకృష్ణ కాగా మరొకరు దాడి వీరభద్రరావు, కొణతాల ఇప్పటికే పార్టీని వీడారు. ఈయనతో పాటు గండి బాబ్జి వంటి నేతలు కూడా వైసీపీ పై అసంతృప్తులుగా ఉన్నారు. ఇక దాడి వీరభద్రారావు కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు అంతా సర్దేసుకుని సెటిల్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పుట్టినిల్లు లాంటి టీడీపీకి దాడి తిరిగివస్తారని తెలుస్తోంది. అటు దాడితో పాటు జిల్లాకు చెందిన చోటా, మోటా నాయకులంతా ఫ్యాను నుంచి ఎగిరి సైకిల్ ఎక్కుతారని తెలుస్తోంది.

ఈ మద్యే జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావును కలిసిన కొందరు నేతలు తాము టీడీపీలో చేరతామని చెప్పారట. ఈ విషయం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళి., ఆయన ఓకే అంటే, అంతా కట్టగట్టుకుని వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. అటు దాడి టీడీపీలో చేరుతారని తెలియటంతో, కొణతాలకు ఇక మిగిలి ఉన్న బీజేపీ శరణ్యంగా తెలుస్తోంది. నేతలు రూట్లు వేరయినా.., మార్గం మాత్రం వైసీపి నుంచి బయటకు వెళ్ళటమే. ఇలా సొంత పార్టీ నేతలు ఇస్తున్న దిమ్మదిరిగే షాకులతో జగన్ కు బొమ్మ కన్పిస్తున్నట్లుందని విమర్శకులు చెప్తున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysr congress  vishakapatnam  tdp  dadi  jagan  

Other Articles