Chandrababu flinches as where congress strengthens back

Chandrababu, flinch, chief minister, NTR, TDP, Congress, PM modi, Rahul gandhi, AICC

Chandrababu flinches as where Congress strengthens back

కాంగ్రెస్ ఎక్కడ బలపడుతుందోనని జంకుతున్న బాబు..

Posted: 10/18/2014 07:36 PM IST
Chandrababu flinches as where congress strengthens back

టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ అంటే జంకుతున్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావస్తున్నా.. ఆయన ఇంకా కాంగ్రెస్ ను దోషిగానే పరిగణిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఆంధ్రపదేశ్ లో అటు ఎంపీ స్థానాల్లో కానీ, ఇటు ఎమ్మెల్యే స్థానాల్లో కాని ఒక్క సీటు గెలవని కాంగ్రెస్ ను చంద్రబాబు టార్గెట్ చేయడమేంటని అందరు విస్మయం చెందుతున్నారు. ఎన్నికలు జరిగినప్పుడు విమర్శలు, ప్రతివిమర్శలు తప్పవూ కానీ.. ఏ వేదిక నెక్కినా.. చంద్రబాబు కాంగ్రెస్ ను తూర్పాబడుతున్నారు, ఇందకు కారణాలేంటి అన్నది మాత్రం ఎవరికీ అర్థం కాని శేష ప్రశ్నే

కాంగ్రెస్ గూటి నుంచి వచ్చిన చంద్రబాబు.. తరువాత తన మామగారు పెట్టిన తెలుగుదేశం పార్టీలోకి దూకి ఎమ్మెల్యేగా, మంత్రిగా, చివరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే తన రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పతనాన్ని, కాంగ్రెస్ బలపడటాన్ని చవిచూసిన చంద్రబాబు.. వామ్మో కాంగ్రెస్ అని మదిలో నిత్యం కాంగ్రెస్ జపం చేస్తున్నారట. తొమ్మిది మాసాల్లో పార్టీని స్థాపించి.. అనతి కాలంలో అధికారంలోకి తీసుకువచ్చిన ఆంధ్రుల ఆరాధ్య నటుడు.. టీడీపీ వ్యవస్థాపక అద్యక్షుడు ఎన్టీ రామారావును కూడా కాంగ్రెస్ ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిందని చంద్రబాబు గతాన్ని మర్చిపోకుండా జాగ్రత్త పడుతున్నారట.

అంతెందుకు ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుని హ్యట్రిక్ కోడతామనున్న చంద్రబాబు ఆశలపై కూడా నీళ్లు చల్లింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన మర్చిపోలేరుగా. ప్రకృతి వైపరిత్యాలు, కరువు విలయతాండవం చేస్తుంటే అధికారంలో వున్న ఏ పార్టీ ఐనా ఏం చేయగలుగుతుంది. అయినా సరే ప్రభుత్వ నిధులన్నీంటిని శిల్పారామం, శిల్పకళావేదిక, బాలయోగి స్టేడియం, స్పోర్ట్స్ సిటీ, హైటెక్ సిటీలకు వెచ్చించి అభివృద్ది చేసిన ఘనత చంద్రబాబుదేనని రాష్ట్ర ప్రజలు అంగీకరించక మానరు. ఇంత చేసినా.. విద్యుత్ చార్జీల పెంపు, రైతుల అత్మహత్యలు, రుణాలు వీటినే ఆధారంగా చేసుకున్న కాంగ్రెస్.. చంద్రబాబు హ్యాట్రిక్ కలల సౌధ్యంపై నీళ్లు చల్లింది.

ఈ విషయాలన్నింటినీ ఇప్పటికీ మరువని చంద్రబాబు.. అవకాశం దోరికినప్పుడల్లా.. కాంగ్రెస్ పై విరుచుకుపడుతున్నారట. శేషాంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా తన కలను నిజం చేసుకోవాలని యత్నిస్తున్న చంద్రబాబు.. కాంగ్రెస్ కు చాన్స్ ఇచ్చేదే లేదంటున్నారట. అందుచేతనే ఎక్కడ వున్నా, సందర్భమైనా, కాకపోయినా.. కాంగ్రెస్ పై మాత్రం విరుచుకు పడుతున్నారట. తాజాగా, ఆ పార్టీ యువనేత, ప్రధాన కార్యదర్శి 'రాహుల్‌గాంధీ హుద్ హుద్ తుపాను బాధితులను పరామర్శించటానికి వస్తున్నారని తెలియగానే.. ఆయన ఎందుకు రావడం, ఆయన చూడటానికి అప్పటికి ఏముంటుంది ఇక్కడ?' అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారట.

ఓ వైపు ప్రకృతి విపత్తులు జరిగిన సందర్భంలో అక్కడికి వీఐపీలు పెద్ద సంఖ్యలో రావడం మూలంగా వారికి రక్షణ కల్పించడం ప్రభుత్వానికి సవాల్ గా మారుతుందని తన మంత్రుల బృందంతో, అధికారులతో చెప్పించిన బాబు.. మరోలా  చూస్తే విపత్తు జరిగిన 24 గంటల్లోనే ప్రధాని వచ్చారు. మీరు తీరక చేసుకుని వారం రోజుల తరువాత వస్తే.. ఇక్కడేముంటుంది చూడటానికి అని ప్రశ్నించడం ఆయనలోని ద్వంద వైఖరికి దర్పణం పడుతోందన్న విమర్శలు వినబడుతున్నాయి. నిజానికి చంద్రబాబుది ద్వంద వైఖరి కాదని, కాంగ్రెస్ అంటే తనకున్న భయమే అలా చేయిస్తుందని పార్టీ శ్రేణులు కొందరు గుసగుసలాడుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  flinch  chief minister  NTR  TDP  Congress  PM modi  Rahul gandhi  AICC  

Other Articles