Nannapaneni rajakumari will be legislative councl chief whip

nannapaneni rajakumari, nannapaneni rajakumari caste, telugu desham party, tdp, mlc, ap mla mlc list, ap mla mps, telangana, guntur, latest news, andhrapradesh, chief whip, ap assembly, ap council

ap cm chandrababu naidu will appoint nannapaneni rajakumari as ap legislative council chief whip : nannapaneni rajakumari may appointed as ap council chief whip

రాజక్కకు బాబు రాచమార్గం

Posted: 09/03/2014 04:50 PM IST
Nannapaneni rajakumari will be legislative councl chief whip

టీడీపీ రాజక్కకు చంద్రబాబు రాజమార్గం చూపారు. శాసన మండలి చీఫ్ విప్ పదవిని నన్నపనేని రాజకుమారికి ఇచ్చే అవకాశముందని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. పార్టీలో సీనియర్ మహిళా నేతగా రాజకుమారి ఉన్నారు. గత ప్రభుత్వ నియమించిన స్థాయీ సంఘం కమిటీల్లో కూడా ఆమె సభ్యురాలిగా ఉన్నారు. రాజకుమారికి సీనియారిటీ, మహిళా రిజర్వేషన్ తో పాటు సామాజిక సమీకరణం కూడా అనుకూలించినట్లు తెలుస్తోంది. ఇక విప్ గా అంగర రామ మోహన్ ను నియమిస్తారని టీడీపీ నేతలు అనుకుంటున్నారు.

గుంటూరు జిల్లాకు చెందిన రాజకుమారి గతంలో సమైక్య ఉద్యమం సమయంలో లగడపాటి దీక్షా శిభిరానికి వెళ్ళటం ద్వారా వివాదాస్పదం అయ్యారు. ఆ తర్వాత పలుమార్లు సమైక్య స్వరం విన్పించి సభలో తెలంగాణ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదుర్కున్నారు. ఓ సారి అసెంబ్లీ భవనం నుంచి దూకుతానని కూడా హల్ చల్ చేశారు రాజక్క. పార్టీ అదినేతకు ఎప్పుడూ అండగా ఉంటూ.., సీనియర్ నేతగా ఉన్నందు వల్లే ఈ పదవి ఆమెను వరించినట్లు ప్రచారం జరుగుతోంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nannapaneni rajakumari  chief whip  latest news  ap council  

Other Articles