Telangana ministers and people treated pawan kalyan as social perpetrator

pawan kalyan, cm kcr, vijaya shanti, social perpetrator, pawan kalyan latest news, telangana survey, telangana ministers, telangana people, telangana samagra kutumba survey

telangana ministers and people treated pawan kalyan as Social perpetrator : telangana minsiters and cm kcr controversial comments on pawan kalyan and treated him as social perpetrator for not participating in telangana survey

సామాజిక నేరస్థుల్లో ‘‘పవన్ కల్యాణ్’’!

Posted: 08/21/2014 01:12 PM IST
Telangana ministers and people treated pawan kalyan as social perpetrator

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పటినుంచి అయితే రాజకీయరంగంలో అడుగులు వేశారో... అప్పటి నుంచి ఆయనపై రకరకాల విమర్శలు వెల్లువడుతూనే వున్నాయి. ముఖ్యంగా ఈయనకు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య అయితే తరచూ ఏదో ఒక అంశం మీద వివాదం రేగుతూనే వుంటుంది. ఇక సీఎం కేసీఆర్ తో అయితే ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే! మొన్నటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరూ చేసుకున్న ఆరోపణలు పతాక శీర్షికల్లో చేరిన విషయం విదితమే! అయితే ఆ తర్వాత కొన్నాళ్లపాటు సైలెంట్ గా వున్న వీరిద్దరూ.. తాజాగా తెలంగాణ సమగ్ర సర్వే నేపథ్యంలో కేసీఆర్ మరోసారి పవన్ కల్యాణ్ మీద పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణాలో నిర్వహించిన సమగ్ర కుటుంబసర్వేకు తెలంగాణ రాష్ట్రంలోని పదిజిల్లాల్లో వున్న ప్రజలందరూ తమ పూర్తి వివరాలను నమోదు చేయించి బాగానే సహకరించారు. ఇటువంటి విశేష సర్వే మన దేశంలో మొదటిసారి అంటూ దేశ, విదేశాల్లో వున్న ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. మన కేంద్రప్రభుత్వం కూడా ఇటువంటి సర్వేను నిర్వహించాలని ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారాలు కూడా వెలువడుతున్నాయి. ఇక రాష్ట్ర విషయానికి వస్తే.. తెలంగాణ ప్రజలతోపాటు సీమాంధ్ర, ఇతర రాష్ట్రాలనుంచి వచ్చి హైదరాబాద్ లో వున్న ప్రజలందరూ ఈ సర్వేలో భాగమయ్యారు. అయితే కొంతమంది ప్రముఖులు ఇందులో పాల్గొనకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. అందులో ముఖ్యంగా పవన్ కల్యాణ్, కాంగ్రెస్ నేత విజయశాంతిలు ఈ సర్వేకు దూరంగా వుండటం ఇప్పటికీ టాక్ ఆఫ్ ది టౌన్ గా వుండిపోయింది. వీరిద్దరూ ఎందుకు పాల్గొనలేదంటూ వాదోపవాదనలను కొంతమంది రాజకీయ నాయకులు వినిపించారు.

సమగ్ర సర్వేలో పవన్ కల్యాణ్, విజయశాంతిలు పాల్గొనలేదనే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. దాంతో ఆయన వీరిద్దరి మీద పరోక్షంగా ఎన్నోరకాల ఘాటు కామెంట్లు గుప్పించారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఆయన చాలా విమర్శలు చేశారు. తెలంగాణ ప్రాంతంలోనే నివసిస్తూ ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలను వినియోగించుకుంటూ సర్వేలో పాల్గొనలేకపోవడాన్ని సామాజిక నేరం అంటూ ఆయన స్పందించారు. అంతే! అప్పటి నుంచి పవన్ కల్యాణ్ సామాజిక నేరస్థుడు అంటూ వార్తలు తెగ తిరుగుతున్నాయి. వ్యక్తిగత కారణాలవల్లో లేక ఇతర పనుల వల్ల పవన్ ఈ సమగ్ర సర్వేకు దూరంగా వున్నారు. అలాకాకుండా ఈయన సర్వేను వ్యతిరేకిస్తే అందుకు కారణాలేమిటో మీడియాకు వెల్లడిస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడ్డారు.

కేవలం వ్యక్తిగత కారణాలవల్ల పవన్ హాజరు కాకపోయివుంటే.. మరో దఫా సర్వేలో పాల్గొంటానంటూ పవన్ సోషల్ మీడియా ద్వారా స్పందించి వుంటే అతని మనోభావాల గురించి తెలిసి వుండేదని వారు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ఒక సినీనటుడిగా ఈ సర్వేకు హాజరు కాకపోతే అంత వివాదమయ్యేది కాదుకానీ... ‘‘జనసేన’’ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల్లో ప్రచారం చేసిన పవన్.. ఈ సర్వేలో పాల్గొనకుండా మౌనం వహించడం ఆయన సామాజిక నేరస్థుడిగా అంగీకరించినట్లేనని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. ఎవరేమనుకున్నా.. ప్రస్తుతం పవన్ పై సామాజిక నేరస్థుడు అనే ముద్ర తెలంగాణాలో, రాజకీయ నాయకుల్లో బలంగా ముద్రపడిపోయింది. మరి ఈ ముద్రను పవన్ ఎలా చెరిపేసుకుంటారు.. రాజకీయంగానే ఆయన సమాధానం చెబుతారా..? లేక మరో దఫా సర్వేలో పాల్గొంటారా..? దీని మీద పవన్ ఎలా స్పందించనున్నాడో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  kcr  telangana people  telangana samagra kutumba survey  

Other Articles