Trs expelled ex mp congress leader vijayashanti

TRS expelled Ex MP Vijayashanti, Congress leader Vijayashanti, Vijayashanti not to join BJP, Rumors on Vijayashanti denied

TRS expelled Ex MP Congress leader Vijayashanti not joining BJP as rumors are spread

విజయశాంతి మీద కుట్ర

Posted: 07/27/2014 01:03 PM IST
Trs expelled ex mp congress leader vijayashanti

ఎవరికీ వేరే ఏమీ పనిలేదు ఒక్క విజయశాంతి మీద కుట్రలు పన్నటం తప్ప అన్నట్లు మాట్లాడుతోంది మెదక్ మాజీ ఎంపీ, తెరాసను వీడి కాంగ్రెస్ లో చేరిన సినీ నటి విజయశాంతి.  తనను రాజకీయాల నుంచి, ప్రజాసేవ చేసే భాగ్యం నుంచి దూరం చేస్తున్నారని ఆమె ఆరోపిస్తోంది.  

తెలంగాణా ప్రజల ఆకాంక్షను (60 సంవత్సరాల పోరాటం తర్వాత) నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీని తాను వీడి భారతీయ జనతా పార్టీలో చేరుతానని పుకార్లు వస్తున్నాయని, అపారమైన గౌరవం గల కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని, అవన్నీ కుట్రపూరిత మైన వ్యాఖ్యలని విజయశాంతి అన్నారు.  ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్నిచ్చినందుకు కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీలో చేరి సేవచెయ్యటానికి సిద్ధపడ్డానని అన్న విజయశాంతి తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెరాస నుంచి ఎందుకు విడిపోవలసివచ్చిందో చెప్పలేదు కానీ ఏ పదవీ లేకుండానే ఏమీ చెయ్యకుండానే వార్తలలోకి రావటం ఎలాగో ఆమెకు బాగా తెలిసినట్లుంది అంటున్నారు ఆమె మాటలు విన్నవాళ్ళల్లో కొందరు.  ప్రస్తుతం కాంగ్రెస్ సుప్త చేతనావస్థలో ఉంది కానీ లేకపోతే ఆమెకు ఆ పార్టీలోనూ వ్యతిరేకత వచ్చేదే అంటున్నారు.  

"మీ ఇష్టమొచ్చిన విధంగా ప్రజలకు సేవచేసుకోమ్మా ఎవరు కాదంటున్నారు, ఎవరు అడ్డుపెడుతున్నారు, ఇంతకీ తమరు సేవ చేస్తున్న సేవ ఏమిటో?" అని అడుగుతున్నారు కొందరు విశ్లేషకులు, రాజకీయాలలో ఆసక్తి ఉన్నవాళ్ళు.  కాంగ్రెస్ పార్టీని విజయశాంతి వదిలిపెడుతుంది అని ఎవరో అనగానే ఆమె చేస్తున్న ప్రజాసేవకి గండి పడిపోయిందంటోందామె.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles