Cm chandrababu naidu to visit soundaryalahari etv program

cm chandrababu naidu to visit soundaryalahari, cm chandrababu naidu, Soundaryalahari, show Soundarya Lahari, K Raghavendra Rao

cm chandrababu naidu to visit soundaryalahari etv program

తప్పక చూడండి! కె.ఆర్.డి.ఆర్ తో బాబు శృంగారం!

Posted: 07/12/2014 11:50 AM IST
Cm chandrababu naidu to visit soundaryalahari etv program

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నిద్రపోడు.. ఎవరినీ నిద్రపోనియడని అందరికి తెలుసు. అందుకే.. బాబు మళ్లీ అధికారంలోకి వచ్చి తెలుగు ప్రజలకు సేవ చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా చాలా బిజీ బిజీగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇలాంటి సమయంలోనే చంద్రబాబు ఆంద్రప్రదేశ్ ప్రజల గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా 24 గంటలో ప్రజా సేవకు అంకితమయ్యారు.

ముఖ్యమంత్రి చంద్రబాబులో.. అలసట, ఆయాశం, నిరాశ, దిగులు, బాధ ఏ మాత్రం కనిపించటంలేదు. నిత్యం నవ యువకుడు మాదిరే బాబు పనిలో రెచ్చిపోతున్నారు. ఒకవైపు రాజకీయ విమర్శలు, మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీలు, రాష్ట్ర అభివృద్ది అనే వాటిపై ..నిత్యం సతమతమవుతున్నారు. ఆయనలో ఒక్కటే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి!!. ఎవరినీ ఇబ్బంది పెట్టకుడదు.!! శత్రువుకు అయిన ఆశ్రయం కల్పించాలనే సంకల్పంతోనే ముందుకు సాగిపోతున్నారు.

అయితే ఇటీవకాలంలో చంద్రబాబు రాజకీయ స్పీడ్ వెనుక టాలీవుడ్ దర్శకుడు ఉన్నాడనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. ఆ దర్శకుడు.. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి సపోర్టు చేయకపోయిన.. చంద్రబాబు సైకిల్ అంటే చాలా ఇష్టం అనే మాటలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఆ దర్శకుడు మనసు నిండా పెద్ద ఎన్టీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ పై అభిమానం, చంద్రబాబు పై మమకారం పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో సమయంలో తెర వెనుక నుంచి చంద్రబాబు కు దర్శకత్వం వహించినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

chandrababu-k-raghavendrarao

 ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు.. టాలీవుడ్ హీరోయిన్లను.. పూలతో, పండ్లతో కొట్టించే డైనమిక్ దర్శకుడు కె. రాఘవేంద్రరావు(కె.ఆర్.డి.ఆర్). చంద్రబాబుతో మంచి సంబంధాలు ఉన్న దర్శకుడు ఎవరు అంటే .. కే.ఆర్.డి.ఆర్ అనే చెబుతారు. మౌనంతో.. అనేక విజయాలు సాధించాడు కే.ఆర్.డి.ఆర్. ఇప్పటి వరకు ఎక్కడ కే.ఆర్.డి.ఆర్ నోరు తెరిచి మాట్లాడింది లేదు. ఆయన మాటలు వినాలని చాలా మంది అభిమానులు చాలా సార్లు ప్రయత్నించారు. కానీ చివరకు విఫలమయ్యారు.

అయితే ఇటీవల కాలంలో ఈటీవీ వారు చేసిన ప్రయోగం ఫలించి మౌన మునీ మాట్లాడేందుకు సాహసం చేశాడు. దీంతో ఆయన సినీ జీవితం వెనుక దాగిన కొత్త కొత్త విషయలు బయటపడుతున్నాయి. పెద్ద ఎన్టీఆర్ తో చేసిన అనుభావాలు, శ్రీదేవితో పడిన కష్టాలు కొంచెం కొంచెం చెప్పి అందరికి ఆశ్చర్యం కలిగించారు. ఆయన ముద్దుల హీరోయిన్ రమ్యకృష్ణ తో, దర్శకురాలు జయ, టీవీ యాంకర్ తో గత వారం ఈటీవీలో ‘‘సౌందర్యలహరి ’’ ప్రోగ్రమ్ లో మౌన మునీ మాటలు, రమ్యకృష్ణ నవ్వులు కలిసి ..బుల్లితెర అభిమానులకు కనువిందు చేశాయి. ఈ సౌందర్య లహరిలో ..ఎన్నో ప్రశ్నలు, ఎన్నో జోకులు, ఎన్నో వింతలు , విశేషాలు బుల్లితెరపై మౌన మునీ చూపించారు.

అయితే ఇప్పుడు ఈ సౌందర్యలహరి మౌన మునీతో.. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కలిసి బుల్లితెర అభిమానుల ఆనందం పంచబొతున్నారు. అ ఇద్దరి మద్య పాటల రచయిత.. అనంత శ్రీరామ్ అడిగే ప్రశ్నలు .. బుల్లితెర అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇదే సమయంలో కె.ఆర్.డి.ఆర్ తో బాబు శృంగారం పదం వాడి అందర్ని ఆశ్చర్యపరిచారు. బాబు మాట్లాడుతూ.. ఈ దర్శకుడి శృంగారం గురించి అందరికి తెలిసిందే, నేను కూడా చూశానని చెప్పటంతో అందరి షాక్ తిన్నారు.

babu-k-raghavendrarao

 బాబు మాటలను బట్టి, దర్శకుడు రాఘవేంద్రరావు తీసే సినిమాలో ఉండే శృంగారం పై బాబు జోకులు వేసినట్లు తెలుస్తోంది. అంటే దర్శకుడు శృంగార సన్నివేశాలను సినిమాలో ఎంత బాగా పండిస్తాడో అనే విషయం చంద్రబాబు వివరించి చెప్పటం జరుగుతుంది. ఇంకా చంద్రబాబు, దర్శకుడు కే. రాఘవేంద్రరావు మద్య జరిగిన శృంగార వ్యాఖ్యలు తెలుసుకోవాలంటే.. రేపు రాత్రి .. ఈటీవీలో వచ్చే ప్రోగ్రమ్ తప్పకచూడండి.....!!!!!

RS

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles