అక్కినేని నాగార్జున అంటే తెలియని వారు ఎవరు ఉండరు. అలాగే తెలంగాణ ఉద్యమ వీరుడు, తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే తెలియని వ్యక్తి ఈ భూమి మీద పెట్టలేదు. అయితే ఈ ఇద్దరికి వ్యక్తిగతంలో ఎలాంటి విభేదాలు లేవు. వీరు కలుసుకున్నది కూడా ఒకే ఒక్కసారి.. కేసిఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సందర్భంలో.. అక్కినేని నాగార్జున రహస్యంగా వెళ్లి అభినందనలు చెప్పినట్లు ..అప్పట్లో రాజకీయ నాయకులు గుసగుసలాడుకున్నారు.
అయితే ఇప్పుడు పరిస్థితి అందుకు విరుద్దంగా ఉంది. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కేసిఆర్ , తెలంగాణను బంగారు తెలంగాణ చేయటానికి నిరంతరం కష్టపడుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే అక్రమా, కబ్జ , ఆస్తులను, భూములను స్వాధీనం చేసుకొని పనిలో ప్రభుత్వ అధికారులతో చాలా బిజీగా ఉన్నారు. నగరంలో ఉన్న చెరువులు, కుంటలపై కేసిఆర్ సర్కార్ దృస్టి సారించారు. దీంతో మన అక్కినేని నాగార్జున ఆలోచనల్లో పడినట్లు తెలుస్తోంది.
నాగార్జున పై ప్రతి రోజు మీడియాలో, పేపర్లలో ఏదో ఒక హాట్ న్యూస్ వస్తుంది. దీంతో ఖంగారుపడి, తన ఎన్ కన్వెన్షన్ ను ఎలాగైన కాపాడుకోవాలనే ఉద్దేశంతో.. రెండు నిర్ణయాలను తీసుకున్నారు. 1. కోర్టు ఆశ్చయించటం, 2 సిఎం కేసిఆర్ తో ఫోన్ ద్వారా మాట్లాడటం. ఇప్పటికే.. నాగర్ ..మొదటి పని మొదలుపెట్టాడు. ఎన్ కన్వెన్షన్ పై హైకోర్టు లో పిటిషన్ వేయటం జరిగింది. అయితే ఇక మిగిలింది కేసిఆర్ తో మాట్లాడటమే.
ఇప్పుడు నాగార్జున .. మాటీవీలో ‘‘మీలో కోటేశ్వరుడు ఎవరు’’ అనే ప్రోగ్రామ్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఆడే వారికి మూడు లైఫ్ లైన్లు ఉంటాయి. అలాగే ఇప్పుడు నాగార్జునకు..రెండు లైప్ లైన్లు మాత్రమే ఉన్నాయి. వాటిలో మొదటి లైప్ లైన్ ను వాడుకుంటున్నారు. ఇప్పుడు రెండో లైఫ్ లైన్లు వాడుకోవటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.
హాల్.. కేసిఆర్.. సార్.. నేను అక్కినేని నాగార్జునను మాట్లాడుతున్నా? నేను సార్.. నటుడు అక్కినేని నాగార్జున మాట్లాడుతున్నా...? ఆరోజు.. ఆరాత్రి .. మీ ఇంటిలో.. అని నాగార్జున గుర్తు చేయగ.. చేయగా.. తెలంగాణ సీఎం కేసిఆర్ సార్ గుర్తుపట్టిండు.. ! ఓ.. అక్కినేని నాగేశ్వరరావు కొడుకువా.., అంత మంచిగున్నారా? ఏంటీ విషయం.. ? ఇంత అర్థరాత్రి సమయంలో ఫోన్ చేసినావు.. రేపు ఉదయం సచివాలయంలోకి రా.. కూర్చోని అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని చెబుతుండగానే.. సార్ .. ఒక్క అయిదు నిమిషాలు నేను చెప్పిదే వినండి సార్. సరే చెప్పవయ్యా..!
మీరు తెలంగాణను బంగారు తెలంగాణ చేయటానికి చాలా కష్టపడుతున్నారు.. నాకు చాలా ఆనందంగా ఉంది సార్.. ఏమయ్యా ..నాగార్జున.. అసలు విషయం చెప్పవయ్యా.. ! అంటే ఏదో చెబుతావు.. పొద్దుగాల నాకు పనులు ఉన్నాయి ? జల్దీ లేవాలే. త్వరగా చెప్పువయ్యా.. అప్పుడు నాగ్ షూరువు చేసిండు. మీరు మీ సర్కార్ మంచి పనులు చేస్తుంది. అందులో కబ్జా భూమలను, అక్రమా ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. కానీ అందులో ఇప్పుడు నాకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌పై అధికారులు సర్వేలు చేసి, ఏదో చెబుతున్నారు. నాకు చాలా భయంగా ఉంది సార్. అందులో మా నాన్నగారిని చూసుకుంటున్నారు. మీరు సెంటిమెంట్ విలువిస్తారు కాబట్టి చెప్పాను సార్. మీరు ఒక్కసారి నా ఎన్ కన్వెన్షన్‌పై జాలి చూపించండి సార్.
అంతేకాదు ..నేను న్యాయబద్దంానే కొన్నాను ..సార్..అంటూ.. గురుకుల్ ఘట్కేసర్ ట్రస్ట్ అధ్యక్షుడు బి.కిషన్‌లాల్ నుంచి 1982లో కొందరు వ్యక్తులు భూమిని కొనుగోలు చేయగా, 1992లో వారి నుంచి తాను 27 వేల చదరపు మీటర్ల స్థలాన్ని కొన్నట్టు నాగార్జున కేసిఆర్ వివరించారు. చట్టపరంగా, న్యాయబద్ధంగానే కొన్న ఈ స్థలంలో హుడా అనుమతితో ప్రహరీగోడ నిర్మించినట్టు చెప్పారు. నిబంధనల ప్రకారం అక్కడ ఫంక్షన్ హాల్ నిర్మించి జీహెచ్ఎంసీ నుంచి లెసైన్స్ తీసుకున్నట్టు, ఆస్తి పన్ను కూడా చెల్లిస్తున్నట్టు నాగార్జున తెలంగాణ సీఎం కేసిఆర్ కు చెప్పటం జరిగింది. .
అంతేకాకుండా భవనాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నట్టు కూడా ఆయన వివరించారు. తన బీఆర్ఎస్ దరఖాస్తుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ, ఫంక్షన్‌హాల్‌పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా గతంలోనే హైకోర్టును కూడా ఆశ్రయించినట్టు సీఎం కేసిఆర్ కు ఫోన్లే తెలిపినట్లు గులాబీ వర్గాలు అంటున్నారు.
మరో విషయం ఏమిటంటే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, ఆ వ్యాజ్యాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. కాగా, ఆ ఫంక్షన్‌హాల్‌ను వివిధకార్యక్రమాలకు పలువురు ఇప్పటికే బుక్ చేసుకున్నారని కేసిఆర్ కు నాగార్జున పూర్తిగా చెప్పటం జరిగింది. దీంతో చూడు నాగార్జున.. మేము అక్రమంగా ఏదీ తీసుకోవటంలేదు. నాయ్యబద్దంగా ఉంటే అందరికి మంచిగుంటది, ఎన్ కన్వెన్షన్ అక్రమా అని తెలిసిన తరువాత నేను వదిలిస్తే.. ఆ తరువాత మరో లగడపాటి వస్తారు. ఇలా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అప్పుడు నేను తెలంగాణ ప్రజలకు న్యాయం చేయలేను.. కాబట్టి, నీకు న్యాయం చేస్తా! కానీ తెలంగాణ ప్రజలకు నచ్చే విధంగా న్యాయం చేస్తానని చెప్పటం జరిగింది.
అలా ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా.. తెలంగాణ ప్రజలకు కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది. తెలంగాణ బిడ్డల కోసం .. నేను కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి.ఎందుకంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని గట్టి నిర్ణయం తీసుకున్నాం. అందుకే మంచి పని చేయలంటే.. కొన్ని వదులుకోవాల్సిందేనని చెబుతూ.. అవునూ.. మాటీవీ బాగుందా.! గదేదో.. చేస్తూ.. కోటి రూపాయలు ఆఫర్ పెట్టినవట, మా ఇంటిల్లో నా బిడ్డ బిల్లు, కొడుకు పిల్లు చూస్తున్నారు. ఎంతైన నాగార్జున.. మీరు కోటిశ్వర్లు కదా అంటూ కేసిఆర్ నవ్వుతూ.. ఫోన్ కట్ చేయటంతో.. నాగ్ అసలేం అర్థం లేదట.. ఇంతకీ కేసిఆర్ సార్ సాయం చేస్తానన్నాడా? లేదా? అనే అనుమానంతో.. హైకోర్టు పై ద్రుష్టిపెట్టినట్లు ..టాలీవుడ్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.
మరో విషయం ఏమిటంటే.. నాగ్ త్వరలో..మరో వ్యక్తిని కేసిఆర్ తో రహస్య మంతనాలు జరపటానికి సిద్దం చేస్తున్నట్లు.. ఫిలింనగర్ వాసులు చెవులు కొరుక్కుంటున్నారు. అతను ఎవరో..కాదు.. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న యువ రాజకీయ నాయకుడని టాలీవుడ్ టాక్. పాపం నాగ్..కేసిఆర్ సర్కార్ దెబ్బ నుండి ఎలా బయటపడతారో వేచి చూద్దాం.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more