Opposition party questions delays in plans

Opposition party questions delays in plans, First Assembly Session of AP State, CM reminded of delayed promises in Assembly, Opposition party questions delays in plans, Promises in Election Manifesto of TDP questioned by opposition

Opposition party questions delays in plans

మంత్రదండం దాచిపెట్టుకున్న బాబు?

Posted: 06/24/2014 07:21 PM IST
Opposition party questions delays in plans

(Image source from: Opposition party questions delays in plans)

మంత్రదండం ఉన్నా దాన్ని దాచిపెట్టుకున్న చందాన చంద్రబాబు మీద తొలి శాసనసభలోనే ప్రతిపక్షనాయకులు విరుచుకుపడ్డారు.  వైకాపా నాయకుడు కాకాణి గోవర్దన్ రెడ్డి చంద్రబాబు మీద వ్యంగ్య వ్యాఖ్యలు సంధించారు.  తెలుగు దేశం చేసిన ఎన్నికల హామీల మీద అప్పడే నిలదీయటం మొదలుపెట్టారు.

అన్నిటికన్నా ఎక్కువ వ్యంగ్యం చేటుచేసుకున్న వ్యాఖ్య- చంద్రబాబు వలన కుటుంబాలు విడిపోయాయన్నది.  కుటుంబానికో ఉద్యోగం చొప్పున వాగ్దానం చేసిన చంద్రబాబు వలన ఉమ్మడి కుటుంబాలు ఆ లబ్ధిని ఎక్కువగా పొందటానికి విడిపోయాయని, కానీ ఆ ఉద్యోగాలెక్కడా కనిపించటంలేదని అన్నారు.  వెటకారంలో హాస్యం పాలు కలిపినందుకు నవ్వు తెప్పించే వ్యాఖ్యే కానీ, ఇందులో చంద్రబాబు కంటే ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలనే ఎక్కువగా తిట్టినట్లయింది.  

కుటుంబానికో ఉద్యోగమన్నది వాగ్దానం.  వెంటనే ఇవ్వగలిగేదే అయితే దానికోసం వాగ్దానం చేసే అవసరం ఎందుకు వస్తుంది?  అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని చట్టబద్ధం చెయ్యటానికి, అమలులోకి తేవటానికి సమయం పడుతుంది.  ఈ లోపులోనే ఉద్యోగం కోసం అన్నదమ్ములు విడిపోయారన్నది రాష్ట్ర ప్రజల చిత్తశుద్ధిని శంకించటమౌతుంది.  

ప్రమాణస్వీకారం చేసి అధికారంలోకి రావటంతోనే గవర్నర్ గారు ముఖ్యమంత్రి చేతికో మంత్ర దండం ఇస్తారా లేకపోతే ముఖ్యమంత్రే వస్తూ వస్తూ మంత్రదండాన్ని తీసుకునివస్తారా?  

రైతుల ఋణమాఫీల గురించి కూడా కమిటీలు వేసి తాత్సారం చేస్తున్నారంటూ ఎద్దేవా చేసారు కాకాణి.  ఆ కమిటీలకు కూడా కాలం తీరితే ఏకంగా కుబేరుడికే అర్జీ పెట్టుకున్నానని చెప్తారేమో అని కూడా అన్నారాయన.  వేల కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న పనది.  ఏ ఆదాయం లేకుండా ఎలా చేస్తారా పని.  కనీసం కేంద్ర నుంచి మొదటి విడత నిధులు కూడా రాష్ట్రానికి అందలేదింకా.  రాష్ట్రంలోనా ఆదాయవనరులు లేవు.  ఋణమాఫీలకు బ్యాంక్ లనుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించి దాన్ని అధిగమించటానికే చూస్తున్నామని చెప్తున్న ప్రభుత్వానికి ఎప్పుడింకా అని నిలదీయటం కేవలం తమ ప్రతిపక్ష గుర్తింపుని పొందటానికే అనిపిస్తోంది.  లేకపోతే ప్రతిపక్షంలో ఉండి ఏం చేస్తున్నారనే ప్రశ్న కూడా మిగిలిన పార్టీల నుంచి లేవవచ్చు.  

ఇంకా, నిరుద్యోగ భృతి గురించి, వికలాంగుల పెన్షన్ గురించి కూడా కాకణి ఎత్తిపొడుపులను ప్రయోగించారు.  నిరుద్యోగులు తమకి ప్రభుత్వం నుంచి వచ్చే కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని, వాటిని ఎప్పుడెప్పుడు ఉపయోగించి క్యాష్ తీసుకోవచ్చా అని చూస్తున్నారని కాకాణి చెప్పుకొచ్చారు.  

హామీలనేవి లక్ష్యాలు.  ఆ లక్ష్యాల దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వానికి ఆ పని చెయ్యటానికి తగినంత సమయాన్ని ఇవ్వాలి కదా.  మరీ మొట్టమొదటి సభలోనే నిలదీస్తే ఎలా అని తెదేపా నాయకులు అంటున్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles