Ys jagan may attend chandrababu swearing ceremony june 8th

jagan may attend chandrababu swearing, ys jagan may attend chandrababu swearing, Chandrababu invites YS Jagan, Chandra Babu Invite Jagan, నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్, చెప్పండి.. చంద్రబాబు గారు

ys jagan may attend chandrababu swearing ceremony june 8th, Chandrababu invites YS Jagan

చెప్పండి..! చంద్రబాబు గారు? జగన్

Posted: 06/06/2014 07:15 PM IST
Ys jagan may attend chandrababu swearing ceremony june 8th

వైఎస్ జగన్ లో ఉన్న మంచి మనిషి ఈరోజు బయటకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసినప్పుడు జగన్ స్పందించలేదు. అంటే బాబుతో మాట్లాడటం ఇష్టంలేక..ఫోన్ ఎత్తలేదని విమర్శలు పబ్లిక్ లో వినిపిస్తున్నాయి.

అయితే జగన్ ఆ సమయంలో బాబు ఫోన్ ను ఎందుకు రిసీవ్ చేసుకోకలేకపోయాడుఅనే దానికి వైసీపీ నాయకులు అనేక కారణాలు చెబుతున్నారు.జగన్ రాజమండ్రిలో ఉన్నట్లు చెబుతున్నారు.అక్కడ పార్టీ నేతలతో కలిసి సమావేశం అయినట్లు చెబుతున్నారు.

కానీ అసలు విషయం ఏమిటంటే..!చిన్న ఇగో ఫీలింగ్ తోనే..బాబు ఫోన్ ను ఎత్తలేదని పార్టీలోని కార్యకర్తలు అంటున్నారు. అయితే బాబు ఫోన్ చేసిన విషయం పై జగన్ పార్టీలోని సీనియర్ లతో చర్చించినట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకుల ఒత్తిడి మేరకు జగన్ చంద్రబాబుకు రిటన్ ఫోన్ చేసినట్లు సమాచారం

ఇలా ఎందుకు జరిగిందంటే..!! చంద్రబాబు ఫోన్ ను ఎత్తని వైఎస్ జగన్ అంటూ..మీడియావారుజడివాన కూరిపించారు. దీంతో ప్రజలకు వైఎస్ జగన్ పై తప్పుడు సంకేతాలు వెళ్లే ఛాన్స్ బలంగా ఉందని, అసలే మనల్ని ప్రజలు నమ్మె పరిస్థితి లో లేరని, అందులో అధికారంలో లేదనే విషయాన్ని పసిగట్టిన సీనియర్ నాయకులు వెంటనే జగన్ తో సమావేశం అయ్యారు. జగన్ తల్లి విజయమ్మ కూడా చంద్రబాబుతో మాట్లాడమని తన కొడుకు జగన్ కు చెప్పినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.

ys-jagan-chandrababu-swearing-june-8th

చంద్రబాబుతో.. మంచిగా ఉంటే.. రాబోయే రోజుల్లో మనకు మంచి ఫలితాలు వస్తాయని పార్టీలోని సినియర్ నేతలు ఒత్తిడి చేయటంతో జగన్ కు ఇష్టం లేకపోయిన ..చంద్రబాబు కు ఫోన్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ‘‘చంద్రబాబుది మిస్డ్ కాల్, జగన్ ది రిటర్న్ కాల్ ’’ గా ఉంటుందని ఆయన సన్నిహితులు చెప్పటంతో జగన్ లో ఉన్న ఇగో తొలగిపోయి.. ‘‘చెప్పండి.. చంద్రబాబు గారు ’’ అనే స్థాయికి ఎదిగిపోయారు.

దీంతో జగన్ నూతన ఉత్సహంతో.. చంద్రబాబు ఫోన్ కు .. లైన్ కలిపారు.. వెంటనే.. చంద్రబాబు ఫోన్ ఎత్తి..‘‘ హాలో.. ఎవరు? ..చంద్రబాబు గారు.. నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సార్.., సారీ చంద్రబాబు గారు.. మీరు ఫోన్ చేసినప్పుడు ..నేను అందుబాటులేను చంద్రబాబు గారు.’’ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి, ముఖ్యమంత్రి కానున్నందుకు.. నా అభినందానలు, ... ఇక ‘‘చెప్పండి...!! చంద్రబాబు గారు..! అనటంతో బాబు.. జగన్ గారు.. మీరు తప్పకుండా జూన్ 8 తేది ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని, మీతో పాటు.. అమ్మ.. విజయమ్మను కూడా తీసుకురావాలని జగన్ ను చంద్రబాబు కోరినట్లు(ఆహ్వానించినట్లు) తెలుస్తోంది. దీనికి జగన్ సానుకూలంగా స్పందించి తప్పకుండా ఆదివారం గుంటూరులో జరిగే ప్రమాణా స్వీకారానికి వస్తామని చెప్పినట్లు సమాచారం.

jagan-chandrababu-ysr

దీంతో జగన్ పార్టీ నేతలు..కాస్త ఊపీరి పీల్చుకున్నారు. బాబు ప్రమాణా స్వీకారం మనకు అనుకూలంగా మార్చుకోవాలనే ఉద్దేశంలోఉన్నట్లు సమాచారం. అయితే టిడిపి నాయకుల్లో కొత్త భయం పట్టుకుంది. జగన్, బాబు ప్రమాణ స్వీకారానికి వస్తే.. ఏం జరుగుతుందో, అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందోనని తెలుగుతమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. అయితే కొంతమంది నేతలు మాత్రం ఒకే చోటు సీమాంద్ర నేతలను చూసుకొనే అవకాశం ఉంటుందని ఆనందపడుతున్నారు.

అసలే.. సీమాంద్ర లో వైసీపీ, టిడిపి కార్యకర్తల మద్య .. ఎండి గడ్డి వేస్తే.. పచ్చగా మారిపోతున్నయ విషయం తెలిసందే. ఇలాంటి సమయంలో జగన్ , చంద్రబాబు ప్రమాణా స్వీకారానికి పరిస్థితి వస్తే ఎలా ఉంటుందదోనని, ముందు జాగ్రత్తగా.. భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఇక జూన్ 8 తేది ఏం జరుగతుంతో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles