Vastu fears keep chandrababu and kcr

Vastu fears kcr, Vastu fears chandrababu, Vastu tension trs chief kcr, Vastu tension tdp chief, trs party, tdp, chandrababu naidu, telangana state cm kcr, seemandhra cm chandrababu.

Vastu fears keep chandrababu and kcr

బాబుకు-కేసిఆర్లకు ఒక్కటే దెబ్బ!!

Posted: 05/24/2014 10:49 AM IST
Vastu fears keep chandrababu and kcr

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి కల్వకుంట్ల చంద్రశేఖరరావులకు ఒక్కటే దెబ్బ కొడుతుంది. రెండు రాష్ట్రాల చంద్రాలు.. వెలగటానికి ఆ దెబ్బ బాగా అడ్డుపడుతుందని ఇరుపార్టీల నాయకులు అంటున్నారు. అతి కొద్ది రోజుల్లో ఈ చంద్రాలు రెండు రాష్ట్రాల్లో అధికారం పీఠం పై కూర్చోపోతున్న సమయంలో.. ఇలాంటి దెబ్బ వారికి అసహనం కలిగిస్తుంది. ఈ చంద్రాలు అడుగులు తీసి అడుగు వేయలంటే చాలా భయపడుతున్నారు. ఇంతకీ చంద్రబాబును, కేసిఆర్ని భయపెడుతుంది .. మనిషి దెబ్బ కాదు.. వాస్తు దెబ్బ. ఇప్పుడు వాస్తు దెబ్బతో ఈ ఇద్దరిలో అల్లాడిపోతున్నారు.

ఆ భయంతోనే మేం... రాం, మేము రాం.. అంటూ ముందుగానే చెబుతున్నారు. చంద్రబాబు, కేసిఆర్లకు కేటాయించిన కార్యాలయాల్లో వాస్తు దోషాలున్నాయి..మేము రాం..అని కాబోయే ముఖ్యమంత్రులంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేక్ వ్యూ అతిధి గృహం, తెలంగాణ రాష్ట్రానికి బేగంపేట్ లోని సీఎం క్యాంపు కార్యాలయాలు కేటాయించి,గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేయటం జరిగింది.

కానీ ఆ భవనాల్లో వాస్తు దోషాలున్నాయని సదరు ఇద్దరు ముఖ్యమంత్రులు వెళ్లడానికి అయిష్టత చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటినుండే కార్యకలాపాలు కొనసాగిస్తామని చెబుతున్నట్లు సమాచారం. లేదంటే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొనే అవకాశాలున్నాయి.Vastu-fears-keep-chandrababu-and-kcr-trs

కేసిఆర్ కూడా చంద్రబాబు బాటలోనే వెళ్తుతున్నారు. వీరి వాస్తు పోటును తగ్గించేందుకు మనం రాష్ట్రం నుండే ఇతర రాష్ట్రాల నుండి పండితులను, జ్యోతిష్యులను పిలిపిచినట్లు సమాచారం. కేసిఆర్ అయితే ..త్వరలో ఒక మహాయాగం చేయటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. వాస్తు పోటు తగ్గిన తరువుతానే చంద్రబాబు , కేసిఆర్ ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేయటానికే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఇద్దరు ఎక్కడున్న ప్రజలకు అందుబాటులో ఉండే చాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles