Strict election code in telangana elections

Election Code, Election Code in telangana, election 2014, 7th phase election poling in telangan, Election Code in Telangana Elections.

Strict Election Code in Telangana Elections

కోడ్ కూసింది-నోరుమూసుకున్నారు?

Posted: 04/29/2014 11:21 AM IST
Strict election code in telangana elections

కోడ్ కూసింది కొన్ని గంటలైంది. అలాగే రాజకీయ నేతలు నోరు మూసుకున్నారు. గత రెండు వారాల నుండి తెలంగాణలో మోగిన మైకుల సౌండ్ ఒక్కసారి మూగబోయింది. అలాగే రాజకీయ నేతలు, రాజకీయ పార్టీలు చేతిలో మైకు పట్టుకొని..ఓటర్ల చెవుల నుండి రక్తం వచ్చేదాకా తిట్లు, శాపనార్థాలతో..వాగిన నోర్లు ఒక్కసారిగా మూతపడ్డాయి. దీంతో తెలంగాణ ఓటర్లు కాస్త ఊపీరీ పీల్చుకున్నారు.

ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో నిన్నటి వరకు ప్రజల ముందు నోటీకి హద్దు ఆపు లేకుండా వాగిన నోర్లు సైలెంట్ అయ్యాయి. ఇప్పటి నుండి రాజకీయ నేతల గుండేల్లో ‘‘గెలుపు కోడ్ ’’ టెన్షన్ పట్టుకుంది. పోలింగ్ సమయం కొన్ని గంటలే ఉండటంతో రాజకీయ నేతలు ‘‘చీకటి మంతనాలు’’ జరుపుతున్నారు. ఓటర్లకు ఎలా గాలం వేయాలో అర్థంగాక సతమతమవుతున్నారు.

గతంలో జరిగిన ఎన్నికల కంటే.. ఈ సారి జరిగే ఎన్నికలకు చాలా ప్రాథాన్యత ఉందని రాజకీయ మేథావులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తరువాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి .. రాజకీయ పార్టీలకు, రాజకీయ నేతలకు ఒక అగ్ని పరీక్షగా మారింది. గెలుపు, ఓటమిల భయంతో.. రాజకీయ నేతలకు నిద్ర కరువైందని ఆయా పార్టీ కార్యకర్తలు అంటున్నారు.

ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో.. రాజకీయ నాయకులు పార్టీ ఆఫీసులకే పరిమితమయ్యారు. రోడ్లపై.. జెండాలు కనిపించాని, నాలుగు కలిసి ముచ్చట పెట్టిన, ఓటర్లు ఎలాంటి తాయిలాలు ఇవ్వటం జరిగిన ..కఠిన చర్యలు ఉంటాయాని.. ఎన్నికల కమిషన్ భన్వర్ లాల్ చెప్పటం జరిగింది. మరో పక్క భారీ బందోబస్తు ఏర్పాటు చేయటం జరిగింది. దీంతో రాజకీయ నాయకులు ఏం చేయలేక చేతులు నలుపుకుంటూ.. పార్టీ ఆఫీసులకే పరిమితమైయ్యారు.

ఆర్ఎస్  

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles