Kcr daughter kavitha satire on jana sena pawan kalyan

pawan, kavitha, kcr daughter, janasena party, trs party, KCR daughter Kavitha satire on pawan, KCR daughter Kavitha satire on Jana sena Pawan Kalyan, election 2014.

KCR daughter Kavitha satire on Jana sena Pawan Kalyan

పవన్! ఆ సొమ్ము లెక్కలు చెప్పు : కవిత?

Posted: 04/28/2014 04:43 PM IST
Kcr daughter kavitha satire on jana sena pawan kalyan

నిన్న కేసిఆర్, నేడు ఆయన కూతురు కల్వకుంట్ల కవిత.. జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై మాటల యుద్దం చేయటం జరిగింది. అంతేకాకుండా పవన్.. ముందు ఆసొమ్ము లెక్కలు చెప్పు అంటూ కవిత ఘాటుగా విమర్శించారు. అసలు ఇంతకీ పవన్ కళ్యాన్ ఏ సొమ్ములు లెక్కలు కవితమ్మకు చెప్పాలి. అంటే.. ప్రజారాజ్యం పార్టీ పెట్టి, టిక్కెట్లు అమ్ముకున్న వాటాలో పవన్ ఎంత వాటా తీసుకున్నారో చెప్పాలని కేసిఆర్ కవిత డిమాండ్ చేయటం జరిగింది.
పవన్ కళ్యాణ్ తిక్క గురించి తెలుసుగానీ, ఆయన లెక్కలు గురించి కేసిఆర్ కూతురు కవితకు తెలియాదట. ఇప్పుడు లెక్కలు తెలుసుకోవాటానికి కవితమ్మ సిద్దమైనట్లు తెలుస్తోంది. నిజమాబాద్ లోకసభ అభ్యర్ధిగా టీఆర్ఎస్ నుంచి పోటి చేస్తున్న కవిత... పవన్ కళ్యాణ్, చిరంజీవిలపై మండిపడ్డారు.
నరేంద్రమోడీ అధికారంలోకి వస్తుందనే భ్రమలో ఆయన పక్కన పవన్ చేరారని కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇది సినిమా కాదు.. రీటేకులు ఉండటానికి అని ఆమె అన్నారు.
పవన్ కళ్యాణ్ పిచ్చివాడిలా మాట్లాడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ పిచ్చి మాటలను ప్రజలు నమ్మరని కవిత అన్నారు. కమెడియన్లు, విలన్లు చిరంజీవి, పవన్ లేనని కవిత ఎద్దేవా చేశారు. ప్రజారాజ్యం టికెట్లు అమ్ముకున్న సొమ్ములో పవన్ కు ఎంత వాటా దక్కిందో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.

ఇప్పటి వరకు బాగానే ఉంది.. కవితమ్మ కు బుర్ర ఉందో లేదో తెలియటంలేదు. ఎందుకంటే.. జనసేన పార్టీ పెట్టిన రోజే.. తెలంగాణ జాగృతి సంస్థ తరుపున వసూలు చేసిన లెక్కలు చెప్పమని పవన్ అడిగిన విషయం ఎలా మరిచిపోయ్. ఆ ప్రశ్నకు ఇప్పటి వరకు సమాధానం చెప్పకుండే.. మళ్లీ పవన్ కే ఎదురుప్రశ్న వేస్తున్నాన్, మీకు , మీ పార్టీకి నీతి, నీజాయితీలు ఉండవా అని తెలుగు ప్రజలు అడుగుతున్నారు. 

ముందు మన కంట్లో దులం పెట్టుకొని, ఎదుటివారి కంట్లో నలుసు గురించి ఎలేత్తి చూపటం అంత మంచికాదని చదువుకున్న యువకులు అంటున్నారు. మీరు ఎన్ని నేరాలు , ఘోరాలు చేసిన .. తెలంగాణ ప్రజలు గెలిచిపిస్తారని అంటున్నారు. కానీ అది మీ గొప్పతనం కాదు. తెలంగాణ ప్రజల గొప్పతనం, ఎందుకంటే.. తెలంగాణ ప్రజలు అమాయకులు. ‘‘మేక కసాయివాడినే నమ్ముతుందనే ’’ విధంగా.. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారు కాబట్టి.. మీరు ఇలా రెచ్చిపోతున్నారని తెలంగాణ ప్రజలు అంటున్నారు.
మిమల్ని ప్రశ్నించిన ప్రతి వాడి పై ఇలాగే దాడి చేస్తున్నారు. లేదా మీ పార్టీ నుండి పంపిస్తున్నారు. మీరు చేసే ప్రతి పని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటి తెలంగాణ విద్యార్థుల నుండి మీ పార్టీ కి వ్యతిరేకత వినిపిస్తుంది. ఉదా: నిన్న ఓయూలో కేసిఆర్ పై జరిగిన చెప్పులా దాడి, కేసిఆర్ గో బ్యాక్ లాంటి నినాదాలే నిదర్శనం అని కొత్తగా ఓటు హక్కు కలిగిన యువకులు అంటున్నారు. ముందు మన లెక్కలు బయట పెట్టి, తరువాత ఎదుటివారి లెక్కలు అడగటం.. ధర్మం అనే మంచి మాటను మరిచి పోవద్దు ఇది ప్రతి ఒక్క రాజకీయ నేతలకు వరిస్తుంది. (షరతులు వర్తిస్తాయి)

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles