Congress party asks ec for arranging security to campaigning nagma

Congress asks EC for security to Nagma, Nagama contesting from Meerut, Congress leader Gajaraj Singh, Gajaraj Singh kisses Nagma

Congress party asks EC for arranging security to campaigning Nagma

నగ్మా భద్రతకు ఇసి ని అర్థించిన కాంగ్రెస్

Posted: 04/02/2014 03:11 PM IST
Congress party asks ec for arranging security to campaigning nagma

మీరట్ నుంచి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటి నగ్మాకి వరుసగా చేదు అనుభవాలు ఎదురవటంతో, నగ్మా ప్రచారానికి వెళ్ళినచోట ప్రజలు ఎక్కువగా గుమికూడుతున్నారని, దానివలన ఇబ్బందులు ఎదురౌతున్నాయని, అందువలన ఆమెకు స్థానికంగా భద్రతా ఏర్పాట్లను కలుగజేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ ని కోరింది. 

అయితే ముందుగా నియంత్రణ కోల్పోయిన కాంగ్రెస్ శాసనసభ్యుడు గజరాజ్ సింగ్ బహిరంగంగా నగ్మా ఉపన్యసించవలసిన చోట ఆమె ముఖాన్ని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు.  ఆమె అతన్ని తోసేసి స్పీచ్ ఇవ్వకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయింది.  ఈ వీడియో మాత్రం టివి ఛానెల్స్ లోను, నెట్ లోను బాగా ప్రచారమైంది.  అయినా కాంగ్రెస్ పార్టీ పలుకుబడివున్న గజరాజ్ సింగ్ ని ఏమీ అనలేదు కానీ, ఈ ఉదంతాన్ని బహిరంగంగా విమర్శించిన ప్రమోద్ కట్యాన్ ని మాత్రం పార్టీ నుంచి బహిష్కరించింది. 

మరోసారి మీరట్ లో జనసమ్మర్దంలో చెయి వేసిన మనిషి మీద చెయిచేసుకుంది నగ్మా.  ఈ సంఘటనల వలన బౌన్సర్లను తనకు అండగా పెట్టుకుందామె. 

అయితే, అధికారికంగా నగ్మాకి భద్రతను ఏర్పాటు చెయ్యమని కోరిన కాంగ్రెస్ పార్టీ తన సొంత పార్టీ నాయకుడి విషయంలో మాత్రం మౌనంగా ఉండటం నగ్మాకి కూడా నచ్చకపోయినా ఆమె ఈ విషయంలో ఎన్నికల సమయంలో అనవసరమైన రాద్ధాంతం ఎందుకులే అని మిన్నకుండిపోయినట్లుగా చెప్పుకుంటున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles