Kiran kumar and botsa feelers to bjp

Kiran Kumar and Botsa feelers to BJP, Botsa Satyanarayana, Kiran Kumar Reddy, Bharatiya Janata party, Elections 2014, Jai Samaikyandhra party, Congress party, Congress bus yatra

Kiran Kumar and Botsa feelers to BJP, Botsa Satyanarayana, Kiran Kumar Reddy, Bharatiya Janata party, Elections 2014

భాజపాకి కిరణ్ బొత్సల మైత్రీ సంకేతాలు?

Posted: 03/29/2014 08:34 AM IST
Kiran kumar and botsa feelers to bjp

భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ మైత్రీ సంకేతాలను పంపించారని సమాచారం. 

కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ ప్రకటన చేసినప్పుడు స్పందన బాగానే కనిపించింది కానీ ఆయనకు నాయకుల నుంచి మద్దతు పెద్దగా లేని సందర్భంగా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన తన అనుచరులను కొందరిని భాజపాతో సంప్రదింపులకు పంపించినట్లుగా తెలుస్తోంది.  భాజపాలో చేరటానికి ప్రస్తుత పరిస్థితులలో ఎంత అవకాశం ఉందన్నది వాళ్ళు తెలుసుకుంటున్నారు. 

అలాగే పిసిసి అధ్యక్ష పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ తప్పించటంతో బొత్సా సత్యనారాయణ కూడా కొంతకాలంగా భాజపా వైపు దృష్టి సారిస్తున్నారు.  ఆయన స్వయంగా భాజపా నాయకులతో సంపర్కంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.  పిసిసిలను కూడా విభజించిన తర్వాత కనీసం మిగిలిన ఆంధ్రప్రదేశ్ కైనా పిసిసి అధ్యక్ష పదవిని అట్టేపెడతారని ఆశించిన బొత్సాకి ఆ స్థానానికి రఘువీరా రెడ్డి నియామకంతో అది కూడా నీరుకారిపోయింది.  దానితో పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు లెదనే నిర్ణయానికి వచ్చారు.  అందుకే కాంగ్రెస్ బస్ యాత్రలో కూడా పాల్గొనటానికి సిద్ధపడలేదని వార్తలు వచ్చాయి. 

ఏ పార్టీలో ఎవరైనా ఎప్పుడైనా చేరవచ్చు కానీ అందులో సముచిత స్థానం కోసం చూస్తే మాత్రం కాస్త కష్టమే అవుతుంది.  నిర్ణయం తీసుకోవటంలో ఇంత ఆలస్యమవటంతో భాజపాలో చేరటం జరిగినా పార్టీలో సీట్ల అడ్జస్ట్ మెంట్లసమస్య వలన వీరు ఆశించిన స్థానాలు దక్కక పోవచ్చు, అసలు పార్టీ టికెట్ కూడా లభించకపోవొచ్చు.   ఇక వీరితోపాటు వీరి వెంట వున్నవారి సంగతి పై వాడికే తెలియాలి.  అందువలన భాజపాలో చేరాలా వద్దా అన్నది చేరేవాళ్ళే కాదు చేర్చుకునేవాళ్ళు కూడా ఆలోచిస్తారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles