Mla kisses nagma in public

MLA kisses nagma in public, cine star Nagma, Congress MLA Gajaraj, Nagma contesting from Meerut, Telugu actress Nagma

mla kisses nagma in public, cine star Nagma, Congress MLA Gajaraj

నగ్మా అందం చూసి నిగ్రహించుకోలేక పోయిన ఎమ్మెల్యే

Posted: 03/24/2014 08:29 AM IST
Mla kisses nagma in public

రాజకీయాలలోకి వచ్చి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికలలో పోటీకి దిగనున్న  సినీతార నగ్మాకు కాంగ్రెస్ నాయకుడి నుంచే అవమానం జరిగింది. 

కార్యకర్తలకు అభివాదం చేస్తూ ప్రసంగాన్ని మొదలుపెట్టబోతున్న నగ్మాను కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే గజరాజ్ ఉన్నట్టుండి ఆమెను పట్టుకుని ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేసాడు.  అనుకోని సంఘటనకు బిత్తరపోయిన నగ్మా ప్రసంగించకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయారు. 

గజరాజ్ చర్యకు స్థానిక మహిళలు, మహిళా సంఘాల నుంచి ప్రతిఘటన వచ్చింది.  నగ్మా అభిమానులు కూడా గజరాజ చేష్టలకు ఆగ్రహం వహించారు.  గజరాజ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వాళ్ళంతా కోరారు.  ఇంత బలహీన మనస్తత్త్వంతో ఈ నాయకులు మహిళ సంక్షేమంలో ఏం చేస్తారనే ప్రశ్న ఉదయిస్తోంది.  పెద్దమనిషి తరహాలో ముద్దు పెట్టుకున్నానని గజరాజ్ వాదించవచ్చేమో కానీ, అలాంటి సంస్కారం మన దేశంలో లేదు.  అంతే కాదు అక్కడే మహిళా పోలీసులున్నారు, ఎందరో మహిళా కార్యకర్తలున్నారు. 

సినీ తారల మీద సామాన్యంగా ఉండే చిన్నచూపు గజరాజ్ ని అలా చెయ్యటానికి పురికొల్పిందని కూడా అర్థమౌతోంది.  ఆకర్షణీయంగా కనిపించే సినీ తారలు పార్టీల ప్రచారానికి ఓటు బ్యాంక్ కోసం పార్టీలకు కావాలసివస్తుంది కానీ మహిళా సినీ తారలకు ప్రమాదం ఎప్పుడూ పొంచివుంటుందని ఈ సంఘటన ద్వారా అర్థమౌతోంది.  బయటి వారినుంచి భద్రత కల్పించవచ్చు కానీ పక్కనున్నవారి నుంచి ఎవరు రక్షించగలుగుతారు.  నగ్మా అందానికి ముగ్ధుడౌన ఎమ్మల్యే బహిరంగంగానే అలా చేస్తే రేపు రాజకీయాలలో కలసి తిరగటం వీలవుతుందా అని ప్రశ్నిస్తున్నారు ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు.

నిజమైన నాయకులకు, యోగులకు స్త్రీ వ్యామోహం కూడని పనులు.  నిజంగా ప్రజాసేవ లోకి వచ్చిన నాయకులు, నిజంగా ఆధ్యాత్మిక సేవ చెయ్యదలచుకున్న యోగులు వ్యామోహాలకు దూరంగా ఉంటేనే వారి బాధ్యతలను సరిగ్గా నిర్వహించగలుగుతారు. 

నగ్మా తెలుగు, తమిళం, హిందీ, పంజాబీ, భోజ్ పురి, మరాఠీ భాషల్లో 70 వరకు సినిమాలలో నటించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles