Anna hazare absent in mamata rally at delhi

Anna Hazare absent in Mamata Banerjee ally at Delhi, Anna Hazare promised support to Mamatha Banerjee, Fourth Front of Mamatha Banerjee

Anna Hazare absent in Mamata Banerjee rally at Delhi

మమతకు మద్దతిస్తానన్నఅన్నాగైర్హాజర్

Posted: 03/12/2014 03:50 PM IST
Anna hazare absent in mamata rally at delhi

ఈరోజు ఢిల్లీలో మమతా బెనర్జీ ర్యాలీలో మద్దతుగా నిలబడతానన్న అన్నా హజారే లేకపోవటంతో రామ్ లీలా మైదాన్ వెలవెలబోయింది. 

ఎవరొచ్చినా రాకున్నా, ఎవరు మద్దతిచ్చినా ఇవ్వకున్నా మేము ఢిల్లీ పీఠాన్ని కదిలించటానికే కంకణబద్ధులమయ్యామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ర్యాలీలో తన జాతీయ పార్టీ అజెండాను వివరించారు.
నేను నా పోరాటాన్ని పశ్చిమ బెంగాల్ తో ప్రారంభించినా ఢిల్లీ నాదన్నది మర్చిపోలేదు, అలాగే పంజాబ్, అలాగే మహారాష్ట్ర అంటూ సారే జహాఁ సే అచ్ఛా హిందూసితాఁ హమారా అనే పాట పల్లవిని అందుకున్నారు. 

నాకు వ్యక్తిగతమైన అధికారాలు వద్దు.  ప్రజలకు అధికారం రావాలి.  ప్రజలను దోచుకునేవారిని తరిమికొట్టాలి అంటూ మమత బెనర్జీ పిలుపునిచ్చారు.  యుపిఏ కి మద్దతును ఉపసంహరించుకున్న సమయంలో, భాజపా కావొచ్చు లేదా కాంగ్రెస్, సిపిఎమ్ ఏ పార్టీయైనా కావొచ్చు కానీ వాళ్ళు విలాసవంతులు, దేశాన్నే అమ్ముకునేవాళ్ళు.  మేము వాళ్ళల్లా డబ్బులు వెదజల్లలేము కానీ మా వాగ్దానాలను మాత్రం పూర్తిచేస్తామన్నారు మమత బెనర్జీ.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles