2014 election hot politics in visakhapatnam

visakhapatnam, 2014 election, hot politics in visakhapatnam, political parties, chandrababu naidu, ys jagan, congress party, jai samaikyandhra, purandeswari, kiran.

2014 election hot politics in visakhapatnam

రంగులు మారుతున్న ‘విశాఖ ’రాజకీయాలు?

Posted: 03/11/2014 04:02 PM IST
2014 election hot politics in visakhapatnam

త్వరలో జరగబోయే ఎన్నికలు రాష్ట్ర రాజకీయలను మార్చటం ఖాయమని అంటున్నారు.  ఇప్పుడు  రాజకీయ నాయకులు పోటీ పడి తమ గెలుపు స్థానాలను వెతికే పనిలో బిజీగా ఉన్నారు.  ఆయా రాజకీయ పార్టీల మేరకే పోటీ చేయటం  జరుగుతుంది.

 ఒక వేళ  ఆయా పార్టీలు  రాజకీయ నాయకులు కోరుకున్న, అనుకున్న స్థానం ఇవ్వకపోతే.. గోడలు దూకటానికైన సిద్దంగా ఉన్నారు.  ఇలాంటి పరిస్థితులు అన్ని పార్టీల దుష్టి విశాఖ నియోజకవర్గం పై పడింది.  రాజకీయ నాయకులు అందరి చూపు  విశాఖ మీదనే.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏ పార్టీ తరపున ఎవరు బరిలోకి దిగుతారనే దానిపై ఇప్పటి వరకు ఓ స్పష్టత రాకపోవడం ఓటర్లను అయోమయానికి గురిచేస్తోంది. స్థానికంగా అక్కడ రోజుకో కొత్త పేరు తెరమీదకు వస్తోంది. ఇక స్ధానికేతర అంశం ఈ సారి ఎన్నికల్లో కీలకం కానుండడంతో మరింత ఉత్కంఠత పెరుగుతోంది.

రాజకీయ పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెట్టాయి. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఆయా స్ధానాలనుంచి పోటీ చేసే లోక్‌సభకు అభ్యర్ధులను దాదాపుగా ఖరారు చేసుకున్నాయి.

కానీ పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం ఇంకా ఓ కొలిక్కిరానందున అన్ని పార్టీలు గుంభనంగా ఉంటున్నాయి. కానీ ముందు జాగ్రత్తగా అభ్యర్ధులను అనధికారంగా ప్రచార రంగంలోకి దింపాయి. అయితే విశాఖపట్టణం తీరు మాత్రం ఇందుకు విరుద్థంగా ఉంది. 

విశాఖ పార్లమెంట్ స్ధానం చరిత్ర ఓసారి చూస్తే 1952 నుంచి ఇప్పటి వరకు విశాఖ స్ధానానికి 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ 9 సార్లు జయకేతనం ఎగురవేసింది. ఇక టిడిపి 3సార్లు గెలిచింది. ఇండిపెండెట్లు 4 సార్లు గెలిచారు. విశాఖ లోక్‌సభనుంచి ప్రాతినిధ్యం వహించిన వారిలో భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విజయానంద్, తెన్నేటి విశ్వనాధం, పివిజి రాజులు వంటి ప్రముఖులు ఉన్నారు. 

అయితే 1991 తరువాత విశాఖ నుంచి ఎక్కువగా స్ధానికేతరులే గెలుస్తుండటంతో విశాఖ వలస నేతల ఇలాఖాగా మారింది. దీంతో ఈసారి స్ధానికులకే టిక్కెట్‌ ఇవ్వాలనే డిమాండ్‌ ఊపందుకుంటోంది. పరిణామాలు శరవేగంగా మారుతుండటంతో విశాఖ రాజకీయం వేడెక్కుతోంది. కొత్తగా స్ధానికేతర వివాదం తెరమీదకు రావడంతో పార్టీలన్నీ స్ధానిక అభ్యర్ధుల వేటలో పడ్డాయి. 

చంద్రబాబు ముందు చూపు.. 

ఇక టిడిపి విషయానికొస్తే గంటాశ్రీనివాసరావు పేరు ప్రముఖంగా విన్పిస్తుండగా, మహిళా కోటాలో అనిత పేరును అధినేత చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాని వీరికి కూడా స్ధానికేతర అంశం అడ్డంకిగా మారనుంది. ఏది ఏమైనప్పటికి ఏ పార్టీ అయినా సరే స్ధానికులకే టిక్కెట్టివ్వాలని విశాఖ వాసులు కోరుతున్నారు.

అయోమయంలో జగన్ పార్టీ? 

ఇటు వైసిపి పరిస్ధితి కూడా ఇలాగే ఉంది. వైసిపి నుంచి షర్మిల లేదా వైవి సుబ్బారెడ్డిలు బరిలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే స్ధానికేతరులనే అడ్డంకి వీరికి అడ్డుపడుతోంది. స్ధానికులకే టిక్కెట్లు ఇవ్వాల్సి వస్తే దాడి వీరభద్రరావును, జహీర్‌ అహ్మద్‌లకు అవకాశం ఇవ్చొచ్చని అంటున్నారు. కాని పొత్తులు ఇంకా ఖరారు కానందున వైసిపి పరిస్ధితి గందరగోళంగా ఉంది.

వెతుకులాటలో కాంగ్రెస్ పార్టీ 

పార్టీల విషయానికొస్తే కాంగ్రెస్‌ తరపున లోక్‌సభకు పోటీ చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపటం లేదు. దీంతో అధిష్ఠానమే అభ్యర్ధిని వెతికేందుకు రంగంలోకి దిగింది. గత ఎన్నికల్లో పిఆర్ పి నుంచి పోటీ చేసి ఓడిపోయిన పల్లా శ్రీనివాస్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికి రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి, ద్రోణంరాజు శ్రీనివాస్‌లలో ఒకరిని పోటీకి నిలిపేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  కానీ విభజన దుమారం కారణంగా కాంగ్రెస్‌ నుంచి క్యాడర్‌ దూరమవటం నేతలను కలవరానికి గురిచేస్తోంది.

పురందేశ్వరి పాట్లు 

 తాజాగా  బీజేపి పువ్వును కౌగిలించుకున్న పురంధేశ్వరి పరిస్ధితి అగమ్యగోచరంగా ఉంది. బిజెపి తరపున విశాఖ నుంచి పోటీ చేసే అభ్యర్ధుల పేరులో పురంధేశ్వరి ముందంజలో ఉన్నారు. కానీ స్ధానికేతర అంశం ఈమెను సైతం చుట్టుముట్టేస్తోంది. 

పవర్ లేని కిరణాలు..? 

ఇక కొత్తగా రానున్న కిరణ్ పార్టీ నుంచి సబ్బం హరి పోటీకి దిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇలా ఊహాగానాలే కాని ఇంతవరకు ఏ పార్టీ కూడా తమ అభ్యర్ధిని ప్రకటించలేదు. దీంతో విశాఖ నుంచి ఎవరు పోటీ చేస్తారు? ఎవరు గెలుస్తారనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మొత్తం మీద  ఈసారి  విశాఖలో రాజకీయ రంగులు మారటం ఖాయమని  స్థానికులు అంటున్నారు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles