సోనియామ్మ ఇచ్చిన మాటను టి-గులాబీ అధినేతకు ఇవ్వటం జరిగింది. పుష్కర కాలం నుండి పోరాటం చేసిన రాజకీయ యోథుడైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసిఆర్) కల నేరవేరింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేసిఆర్ సాధించారు.
ప్రత్యేక తెలంగాణనే ద్వేయంగా పెట్టుకొని, రాజకీయల్లోకి దిగిన 12 సంవత్సరాల తరువాత కేసిఆర్ విజయం సాధించారు. ఇది ఆయన ముఖం పై కనిపిస్తున్న తెలంగాణ విజయం అనే ముద్ర మాత్రమే. కానీ ఆయన మనసులో గుబులు రేపుతున్న కొత్త భయం మరొకటి ఉందని రాజకీమేథావులు అంటున్నారు.
కేసిఆర్ ప్రజా నాయకుడై, తెలంగాణ మేథావులు, కళకారులు, విద్యార్థులు, తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ ప్రజలు ఆయన వెంట నడిచి తెలంగాఱ సాధించుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం కోసంపుట్టిన టిఆర్ఎస్ పార్టీ.. కొన్ని రోజుల్లో కాంగ్రెస్ కలిసి పోతుందని తెలిసినప్పటి నుండి అందరిలో ఒకటే గుబులు. అందుకే టిఆర్ఎస్ నాయకులు .. తెలంగాణ వస్తున్న ఆనందాన్ని బయటకు వ్యక్తం చేయలేకపోతున్నారు.
ఇక కేసిఆర్ అయితే పైకి నవ్వూతు కనిపిస్తున్న, లోపల మాత్రం చాలా ఆందోళన చెందుతున్నారని పార్టీ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో విలీనమా..? పొత్తా..? అనే అంశంపై గులాబీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా పార్టీలో చేరిన కేకే, మంద జగన్నాథం, వివేక్ లాంటి వారు విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. నిన్న మొన్నటి దాక కాంగ్రెస్‌లో ఉండి వచ్చిన తాము మళ్లీ అదే పార్టీలో విలీనం అయితే రాజకీయంగా దెబ్బ తినే ప్రమాదం ఉందని వారు భావిస్తున్నారు.
టీఆర్ఎస్లో ఎక్కువ సంఖ్యలో వామపక్ష భావాలు కలిగిన నేతలు ఉన్నారు. ఇన్నాళ్లు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన నేతలు విలీనంపై మాత్రం మండిపడుతున్నారు. విలీనం ప్రసక్తే వద్దంటున్నారు. విలీనం జరిగితే పార్టీనుంచి వీరంతా బయటకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీ సీనియర్లు ఈటెల, హరీశ్ రావు కూడా విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ను విలీనం చేయటం కన్నా ఎన్నికల పొత్తుతో సరిపెడితే చాలన్న అభిప్రాయాన్ని మరి కొందరు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
మరోవైపు టీఆర్ఎస్తో పొత్తునూ టీ కాంగ్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ సీట్లను టీఆర్ఎస్కు కట్టబెట్టి వారి ప్రాబల్యాన్ని పెంచడం ఎందుకని టీ ఉద్యమంలో ముందుండి పోరు సల్పిన పొన్నం లాంటి నేతలు బాహాటంగానే చెప్తున్నారు.
విలీనంపై అధిష్టానం ఆశలు పెంచుకోగా టీ-కాంగ్రెస్ భీష్మాచార్యులు మోకాలడ్డే ప్రయత్నాల్లో ఉన్నారు. గులాబీదళంతో తిప్పలు తప్పవని ముందే ఊహిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎం అయ్యేందుకు కలలుగంటున్న కొంతమంది నేతలు విలీనంపై నోరుమెదపడటం లేదు. విలీనంతో వచ్చే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువని ఆ నేతలు భావిస్తున్నారు.
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేననీ తెలంగాణలోని ప్రతి పల్లె, ప్రతి గడప గడపకు వెళ్లి టీ-కాంగ్రెస్ నేతలు ప్రచారం ప్రారంభించారు. ఇప్పటికే తెలంగాణ ఇచ్చామనే పేరు కాంగ్రెస్ పార్టీకి తప్ప మరో పార్టీకి రాకుండా తెలంగాణ వ్యాప్తంగా విజయోత్సవ సభలు, ర్యాలీలు నిర్వహించారు.
తెలంగాణపై క్రెడిట్‌ను వచ్చే ఎన్నికల్లో తమ ఖాతాలోకి వేసుకోవాలని భావిస్తున్న టీ-కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీని విలీనం చేయకున్నా తమకు వచ్చే పెద్ద నష్టమేమీ లేదనే ఆలోచనలో ఉన్నారు.
అంతేకాకుండా ఉద్యమపార్టీని విచ్ఛిన్నం చేసేందుకు వ్యూహాలు రచించారు. ఇప్పటికే టీఆర్ఎస్ ఎంపీ రాములమ్మకు కాంగ్రెస్ పార్టీ స్నేహహస్తాన్ని అందించింది. విజయశాంతి బాటలోనే మరికొందరు నేతలు క్యూ కడుతున్నట్లు సమాచారం.
అయితే పార్లమెంట్లో టీ-బిల్లు ఆమోదం తర్వాత కూడా కేసీఆర్ చాణుక్య నీతిని ప్రదర్శించారు. తెలంగాణ క్రెడిట్లో సింహభాగం తమ పార్టీ కార్యకర్తలకే దక్కుతుందన్న కేసీఆర్ టీ కాంగ్రెస్నేతలూ ఉద్యమంలో పాల్గొన్నారని ఎక్కడా పల్లెత్తు మాట కూడా చెప్ప లేదు.
దీంతో తెలంగాణ కాంగ్రెస్ కు క్రెడిట్ పోకూడదనే ఆయన అలా మాట్లాడినట్లు, విలీనం లేదని పరోక్షంగా ఇదే సిగ్నల్ గా గులాబీ శ్రేణులు చెప్తున్నాయి. సోనియా చేతిలో గులాబీ పెడతారో, లేక ముళ్లై గుచ్చుతారో చూద్దాం. మొత్తానికి విలీనంపై గులాబీదళం ఏం నిర్ణయం తీసుకుంటుందో.. వేచిచూడాల్సిందే.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more