సమైక్య రాష్ట్రం కోసం .. మేము కేంద్ర క్యాబినెట్ లో .. మా వాణి వినిపించి.. తెలంగాణ బిల్లు ను అడ్డుకుంటామని .. మీడియా ముందు మీసాలు దువ్విన కేంద్ర క్యాబినెట్ సీమాంద్ర మంత్రులు .. ఘోరంగా విఫలం అయ్యారు. సమైక్య వాదులం అంటూ.. సీమాంద్ర ప్రజలను మోసం చేసిన మోనగాళ్లు వీరే. కిషోర్ చంద్రదేవ్, పల్లంరాజు, కావూరి సాంబశిరావు. సీమాంద్ర ప్రాంతం నుంచి ..కేంద్ర క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్నారు. కానీ వీరి వల్ల సీమాంద్ర ప్రజలకు ఎలాంటి లాభం లేదని నిన్నటి అర్థమైంది. ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికి.. కేంద్ర క్యాబినెట్ లో.. వీరి మాటలకు విలువ లేకుండాపోయిందని ..సీమాంద్ర ప్రజలు అంటున్నారు.
ఈ ముగ్గురు.. అమ్మ(సోనియాగాంధీ)కి .. బాగా సన్నిహితులే, కానీ వీరు మాటలను.. అమ్మ .. వర్రీపాయింట్స్ గా కొట్టిపారేసింది. అంటే .. కర్రీలో.. కరేపాకుల మాదిరే ఈ ముగ్గురును తీసి పారేసింది. .. సోనియా గాంధీ ఇంటిముందు ఉన్న ..వాచ్ మెన్ కు ఇచ్చిన విలువ కూడా.. ఈ ముగ్గురు మంత్రులు ఇవ్వపోవటం.. అందరికి ఆశ్చర్యం వేస్తుంది. అసలు అమ్మ ద్రుష్టిలో.. సీమాంద్ర నేతలు అంటే..చులక భావం ఏర్పాడిపోయిందా? ఇలా చులకన అవ్వటానికి కారణం ఎవరు? సీమాంద్ర నేతలకు .. కాంగ్రెస్ హైకమాండ్ వద్ద విలువా లేదా? సీమాంద్ర నేతలు రబ్బర్ స్టాంపులు మారిపోయారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఈ ముగ్గురు మంత్రులకు ..నిన్న కేంద్ర క్యాబినెట్ లో.. అవమానం జరిగింది. సారీ.. సారీ.. కాంగ్రెస్ హైకమాండ్ అవమానించింది. సహచరమంత్రుల సమక్షంలో.. ఈ ముగ్గురికి.. దౌప్రతివస్త్రభరణం జరిగింది. అదీ కూడా.. తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయుకుడు.. కేంద్ర క్యాబినెట్ మంత్రి జైపాల్ రెడ్డి కళ్ల ముందు జరగటం సమైక్యవాదులు సిగ్గుతో తలదించుకున్నారు. ఎందుకంటే.. అసలు మీకు ఏం కావాలి అని అడిగినప్పుడు.. మాకు ఇది కావాలని దైర్యంగా చెప్పలేని .. సమైక్య ఉత్తరకుమారులుగా మిగిలిపోయారు.
ఈ ముగ్గురికి .. అడగటం చేతకాలేదు. పోనీ హైకమాండ్ కు మాకు సమైక్యం రాష్ట్రం కావాలని గట్టిగా చెప్పటం చేతకాలేదు. వీరు చేవలేని .. చవట దద్దమ్మలాగా.. కేంద్ర క్యాబినెట్ సమావేశం నుంచి అన్నీ మూసుకోని బయటకు .. భయపడుతు, నటిస్తూ , సమైక్యాంద్ర సింహాలు (పిల్లులు) మాదిరిగా చప్పుడు కాకుండా నిష్కక్రమించారు.
ఒకప్పుడు మనల్ని తరిమేసిన రాష్ట్రానికి చెందిన.. పి. చిదంబరం.. కేంద్ర క్యాబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలో.. సీమాంద్ర ప్రాంతానికి చెందిన ముగ్గురు మంత్రులను నోరు ముసుక్కోండి అన్నారంటే సీమాంద్ర నేతలపై మిగిలిన రాష్ట్రాల నాయకుల్లో ఎంత విలువ ఉందో ఇట్టే అర్థమవుతుంది. అసలు తెలుగు ప్రజల మద్య చిచ్చుపెట్టింది చిదంబరమే.. సీమాంద్ర నేతల నోర్లు మూయింసింది కూడా చిదంబరమే. అంటే.. సీమాంద్ర ప్రాంత నేతలకు .. కాంగ్రెస్ పార్టీ ఎంత విలువు ఇస్తుందో ఇట్టే అర్థమవుతుంది. సీమాంద్ర ప్రాంతం నుండి ముగ్గురు క్యాబినెట్ మంత్రులు ఉన్న వేస్టే అని రాజకీయ మేథావులు అంటున్నారు.
ఎందుకంటే. తెలంగాణ ప్రాంతం నుండి ఒకే ఒక్కడు కేంద్ర క్యాబినెట్ లో ఉన్నారు. అతనే.. తెలంగాణ సింహం.. జైపాల్ రెడ్డి. ఈయన కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. అయితే.. జైపాల్ రెడ్డికి ..రాజీకయం తప్పు.. మరో వ్యాపనం లేదు. జైపాల్ రెడ్డి చాలా ముక్కుసూటి మనిషి. అలాగని.. జైపాల్ రెడ్డి ఎప్పుడు .. జై తెలంగాణ అని అమ్మ ముందు కుప్పిగంతులు వేయలేదు. కానీ హుందగా వ్యవహరించేవాడు.
అలాగే జైపాల్ రెడ్డి రాజకీయ వ్యూహాలు రచించడంలో చాలా సిద్దహస్తుడు. మీడియా ముందు మీసాలు దువ్వి, పంచె లేపి .. తొడకొట్టే రకం కాదులేండి. ఇప్పుడు ఆయన నడవడికే.. కేంద్ర క్యాబినెట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందటానికి కారణమైందని రాజకీయ మేథావులు అంటున్నారు. అంటే.. జైపాల్ రెడ్డి మాటలకు.. కాంగ్రెస్ హైకమాండ్ ఎంత విలువ ఇచ్చిందో ఇట్టే అర్థమవుతుందని రాష్ట్ర ప్రజలు అంటున్నారు.
సమైక్యాంద్ర అంటూ.. హైదరాబాద్ టూ.. ఢిల్లీకి ..ఆకాశంలో అటూ ఇటూ తిరిగిన సీమాంద్ర నేతల వల్ల సమైక్యంద్ర ..పుట్టి మునిగిందే గానీ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేకపోయారు. సీమాంద్ర నేతల ఢిల్లీ టూర్ తో.. ఎయిర్ లైన్స్.వాళ్లు, ఢిల్లీలోని హోటల్స్, టాక్సీ డైవర్లు బాగుపడ్డారని ఢిల్లీలోని మీడియా వాళ్లు, ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. సీమాంద్ర నేతల వల్ల సీమాంద్ర ప్రజలకు పెద్దగా వరిగింది ఏమీ లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇలాంటి నేతలకు ఓట్లు వేసి గెలిపించటం కంటే.. నోటా బటన్ నొక్కి ఓటు హక్కు ను సద్వినియోగం చేసుకోవటం మంచిదని సీమాంద్ర ప్రజలు భావిస్తున్నారు. అంటే సీమాంద్ర నేతల సంగతి.. రాబోయే ఎన్నికల్లో సీమాంద్ర ప్రజలే చూసుకుంటారు.
కొసమెరుపు: మొత్తం మీద రాష్ట్రం విడిపోవడం ఖాయం అనే నిజాన్ని నమ్మటం సీమాంద్ర ప్రజలు అలవాటు చేసుకోవాలి.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more