Rabbit in the ear of mandela statue

rabbit in the ear of Mandela statue, Nelson Mandela, South African legend Mandela, Mandela statue

rabbit in the ear of Mandela statue

మండేలా చెవిలో కుందేలు కలకలం

Posted: 01/23/2014 05:53 PM IST
Rabbit in the ear of mandela statue

ప్రతి కళాకారుడికీ, చిత్రకారుడికీ, రచయితకూ తన సృష్టి మీద గర్వం ఉంటుంది, దాని మీద తనదైన ముద్ర శాశ్వతంగానూ, చెరిగిపోకుండానూ ఉండాలని ఉంటుంది.  అదే వాళ్ళు కోరుకునే నిజమైన ప్రతిఫలం.

దక్షిణాఫ్రికా దివంగత నాయకుడు నెల్సన్ మండేలా విగ్రహాన్ని మలచిన కళాకారులు కూడా అందుకు మినహాయింపేమీ కాదు.  అయితే వాళ్ళు చేసిన పనే అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. 

30 అడుగుల ఎత్తైన కంచులోహ విగ్రహాన్ని తయారు చేసిన శిల్పులు ఆండ్రే ప్రిన్స్ లూ, రూహన్ జాన్సే వాన్ వూరిన్ లు తమ పనితనానికి గుర్తుగా ఒక కుందేలు బొమ్మను ఆ శిల్పంలో ఉంచారు.  అయితే దాన్ని నెల్సన్ మండేలా కుడి చెవిలో పెట్టారు.  దాన్ని గమనించిన అధికారులు ఆగ్రహావేశాలు ప్రదర్శించారు.  అంతటి ప్రపంచ విఖ్యాత నాయకుడిని అవమానపరచటమైందని వాపోయారు. 

దక్షిణాఫ్రికావాసులు గర్వంగా చూసుకుంటున్న తమ ప్రియతమ నాయకుడి చెవిలో ఉండాల్సింది కాదని ప్రభుత్వ అధికార ప్రతినిధి మోగోమోట్సి మోగోడిరి అన్నారు. 

విగ్రహానికి కింది భాగంలో నెల్సన్ మండేలా వేసుకున్న ప్యాంట్ మీద తమ ట్రేడ్ మార్క్ కుందేలు ని చెక్కుతామంటే అధికారులు అందుకు అంగీకరించలేదని, అందువలన చెవిలోపల పెట్టవలసివచ్చిందని శిల్పులు చెప్పారని దక్షిణాఫ్రికా వార్తాపత్రిక బీల్డ్ ప్రచురించింది.  దానితో విషయం బయటకు పొక్కి మండలా అభిమానులకు మనస్తాపం కలుగజేసింది.

మండేలా విగ్రహానికి హాని జరగకుండా ఆ మినియేచర్ కళాకృతిని ఎలా తీసివేయాలా అని ఆలోచిస్తున్నామన్నారు అధికార ప్రతినిధి.  ఈ విగ్రహాన్ని మండేలా అంత్యక్రియలు జరిగిన తర్వాత డిసెంబర్ 16 న ప్రిటోరియాలో ప్రభుత్వ కార్యాలయం బయట ప్రతిష్టించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles