Priyanka gandhi name propose pm candidate

Rahul Gandhi,Priyanka Gandhi Vadra,Indian National Congress,Sonia Gandhi,Lok Sabha elections,Ahmed Patel, Congress, Janardhan Dwivedi, Priyanka Gandhi, Rahul Gandhi

In an interesting turn of events, Congress president Sonia Gandhi daughter Priyanka Gandhi Vadra on Tuesday called a high-level meet of party leaders.

కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ప్రియాంక గాంధీనా ?

Posted: 01/08/2014 01:40 PM IST
Priyanka gandhi name propose pm candidate

త్వరలో 2014 ఎన్నికల నగారా మోగబోతుంది. ఇప్పటికే ప్రత్యర్థి పార్టీ బీజేపీ ప్రధాని అభ్యర్థిని ప్రకటించింది. మరి అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంత వరకు ప్రధాని అభ్యర్థిని ప్రకటించక పోగా, సరైన టైంలో సరైన వ్యక్తిని ప్రకటిస్తామని ఇటీవలే కాంగ్రెస్ పార్టీ లో ముఖ్యనాయకుడు ఒకరన్నారు. ఇప్పటి వరకు అందరికి తెలిసి కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీనే. ఇటీవలే మూడోసారి తాను ప్రధాని పదవిని చేపట్టబోనని చెప్పిన మన్మోహన్ రాహుల్ కి ప్రధాని కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయని ప్రకటించాడు.

ఇంత వరకు బాగానే ఉన్నా ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమీ బాగా లేకపోవడం, జనమంతా ‘నమో ’ జపం చేస్తుండటం, ఢిల్లీలో కాంగ్రెస్ ని ‘చీపురు ’ తో ఆప్ పార్టీ ఊడ్చేయడం చూస్తుంటే 2014 లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా ? అనే అనుమానాలు కాంగ్రెస్ పెద్దల్లో తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితి నుండి బయటపడటానికి లోలోపల పెద్ద కసరత్తే మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, సోనియా ‘ప్రియాంక గాంధీ ’ ని తెర పైకి తెచ్చి, ఆమెను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని చూస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దానికి తోడు నిన్న జరిగిన పార్టీ కీలక సమావేశంలో ప్రియాంక పాల్గొనడం చూస్తుంటే నిజమనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రాహుల్‌గాంధీ, అహ్మద్‌పటేల్‌, జనార్ధన్‌ ద్వివేదీతో పాటు మరో అర డజన్‌ మంది పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ప్రియాంక పాల్గొన్నారు. ఈమె అధికారికంగా పాల్గొన్నది కేవలం అయిదు నిమిషాలే అయినా ఇప్పుడు మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. ప్రియాంక వ్యూహాత్మక భేటీపై అప్పుడే రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చకు తెరలేచింది. రాహుల్ ను ప్రక్కకు పెట్టి ప్రియాంకను పీఎం అభ్యర్థిగా ప్రకటించబోతున్నారా.. ? లేదా.. తమ్ముడి కి పట్టాభిషికం కోసం అక్క రంగంలోకి దిగనుందా.. ? అనే చర్చ మొదలైంది. ప్రియాంక రాజకీయ ప్రవేశంపై ఇప్పటికే వార్తలొచ్చాయి. సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేస్తారనే ప్రచారమూ జరుగుతోంది.

ఇక ఆమె పూర్తికాలం రాజకీయాలకే వెచ్చిస్తారనే ప్రచారం జరుగుతున్న సమయంలో సమావేశంలో పాల్గొనడం కాంగ్రెస్‌ పార్టీలో కీలక మలుపునకు సంకేతాలు వస్తున్నాయి. సోనియాగాంధీ కూతురిగా, రాహుల్‌గాంధీ సోదరిగానే కాకుండా తనకంటూ ఓ సొంత పాపులారిటీ, ఇమేజ్‌ ను ప్రియాంక గాంధీ కలిగిఉంది. నాన్నమ్మ ఇందిర పోలికలతో వుండే ఈమెను ఎన్నికల ప్రచారంలో, ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే కాస్లో కూడా పార్టీకి ప్లస్ అవుతుందని కొంత మంది సలహా కూడా ఇస్తున్నారట.

రాహుల్‌ ఓట్లు రాబట్టడంలో విఫలమవ్వడం, ఆయన ప్రసంగాలూ పేలవంగా సాగిపోవడం, ఆయన పై యువకుల్లో వ్యతిరేకతను పోగొట్టాలంటే ప్రియాంకే కరెక్ట్ అంటున్నారు. ఓఇప్పటికే మోదీ ప్రధాని రేసులో దూసుకుపోతున్నాడు... మరో వైపు ఈ రేసులోకి కేజ్రీవాల్ వచ్చే అవకాశాలు ఉండటంతో... ప్రియాంకను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే వీరి ప్రజంజనాన్ని ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles