Cm ramesh shared to ys sharmila pain

cm ramesh shared to ys sharmila pain, tdp cm ramesh shared to ys sharmila pain, ysrcp, tdp, ys jagan sister sharmila, tdp mp cm ramesh, 2014 election,

cm ramesh shared to ys sharmila pain , tdp cm ramesh shared to ys sharmila pain

జగన్ చెల్లెల బాధను పంచుకున్న సీఎం

Posted: 11/25/2013 08:22 PM IST
Cm ramesh shared to ys sharmila pain

వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల పడుతున్న బాధ గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అయితే జగన్ వదిలి బాణం ఇప్పుడు కన్నీరు పెడుతుందని, జగన్ కు షర్మిల రాజకీయ విభేదాలు రావటంతో .. షర్మిల విడిపోయి బెంగళూరులో ఉంటుందనే పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. జగన్ జైల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం. అహర్నిసలు కష్టపడిన షర్మిలను .. జగన్ జైలు నుండి బయటకు వచ్చిన తరువాత దూరంగా ఉంచాడనే విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సమైక్య శంఖారావానికి తన సొంత తల్లి విజయమ్మను, చెల్లి షర్మిల ను దూరంగా పెట్టిన విషయం తెలిసిందే.

 

అయితే షర్మిల, జగన్ల మీద రోజుకోక కథ రాజకీయ వర్గాల నుండి బయటకు వస్తుంది. ఎవరికి వారే కథలు అల్లేసుకొని, పేజీలు పేజీలు వ్యాసాలతో నింపుకుంటున్నారు. అయితే ఈ విషయం తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆయుధంగా ఉపయోగపడింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులంత జగన్ చెల్లెలు షర్మిలపై సానుభూతి చూపుతున్నారు. ముందుగా సీఎం బయటపడ్డారు. సీఎం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాదులేండి. టిడిపి ఎంపీ సీఎం రమేష్ చాలా బాదపడుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

 

జగన్ జైల్లో ఉంటే కష్టాల్లో ఉన్న పార్టీకోసం శ్రమించిన సొంత చెల్లెలు షర్మిలను సైతం జగన్ దూరం పెట్టడంతో కడుపు చించుకుంటే కాళ్లపై పడుతుందని బెంగళూరులో ఆమె బాధపడుతున్నారని సి.ఎమ్. రమేష్ వ్యాఖ్యానించారు .అన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న షర్మిల ఇప్పుడు అన్న వదిలేసిన బాణం అయిందన్నారు.

 

అంతేకాకుండా ఇప్పుడు బాబాయ్ వివేకాను, వైవీ సుబ్బారెడ్డికి సైతం వదలివేశారని సీఎం రమేష్ తెగ బాదపడుతున్నట్లు ఆ పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ సీఎం రమేష్ కు వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల పై సడన్ గా ఇంత సానుభూతి ఎందుకు చూపిస్తున్నారో.. వైసీపీ నాయకులు అర్థం కావటంలేదని అంటున్నారు. అంటే సీఎం రమేష్ కూడా.. టిడిపి వదిలి.. జగన్ పార్టీలోకి జంపు అయ్యే ఆలోచన ఏమైన ఉందా అని వైసీపీ నాయకులు చెవులు కొర్కుకుంటున్నారు. రీసెంట్ గా సీఎం రమేష్ పెట్టుబడులు ..నమాస్తే తెలంగాణ పత్రికలో ఉన్నాయని రాజకీయ చర్చించుకుంటున్నారు. అలాగే.. రాజకీయల్లో, రాజకీయ పార్టీల మద్య, రాజకీయ నాయకుల మద్య ఎప్పుడు, ఎం జరుగుతుందో చెప్పటం చాలా కష్టంమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles