Doctor need not disclose identity of minor seeking abortion అబార్షన్లపై ‘సుప్రీం’ సంచలన తీర్పు.. పెళ్లితో సంబంధం లేదు..

Supreme court says all women entitled to safe and legal abortion

Supreme court, pocso act, medical termination of pregnancy act, Teenage Pregnancies, Teenage abortions, Doctors Need Not Disclose Identity Of Minor, Abortion information, Justice DY Chandrachud, Justice AS Bopanna, Justice JB Pardiwala, Supreme Court ruling , Abortion, pregnancy , Women's rights, reproductive rights, marital rape, MTP Act, Medical Termination of Pregnancy , Abortion law, Posco Act

The Supreme Court said that the distinction between married and unmarried women for the purposes of the MTP Act is "artificial and constitutionally unsustainable" and perpetuates the stereotype that only married women indulge in sexual activities. The rights of reproductive autonomy give similar rights to unmarried women as that to a married woman, the bench held. A bench headed by Justice DY Chandrachud said that the meaning of the rape must include marital rape for the Medical Termination of Pregnancy Act.

అబార్షన్లపై ‘సుప్రీం’ సంచలన తీర్పు.. పెళ్లితో సంబంధం లేకుండా.. 24 వారాల్లోపు..

Posted: 09/29/2022 03:48 PM IST
Supreme court says all women entitled to safe and legal abortion

అబార్షన్స్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. చట్ట ప్రకారం ప్రతీ మహిళకు అబార్షన్ ఎంచుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) కేసులో తీర్పును వెలువరించే సమయంలో గురువారం ఈ వ్యాఖ్య‌లు చేసింది. మహిళలందరూ అబార్షన్ చేసుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు మహిళ వైవాహిక స్థితిని ప్రామాణికంగా పరిగణించలేమని తెలిపింది. పెళ్లితో సంబంధం లేకుండా అబార్షన్‌ చేయించుకునే హక్కు మహిళకు ఉందని తెలిపింది.

వివాహితలతో పాటు అవివాహిత మహిళలు కూడా అబార్షన్‌ చేయించుకోవచ్చని పేర్కొంది. గర్భం దాల్చిన 24 వారాల వరకు మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టం ప్రకారం అబార్షన్‌కు అనుమతినిచ్చింది. అదే విధంగా భర్త బలవంతం చేసినా అది అత్యాచారమే అవుతుందని సుప్రీం తీర్పునిచ్చింది. వైవాహిక అత్యాచారం నేరంగా పరిగణించాలన్న సుప్రీంకోర్టు.. దాని ద్వారా కలిగే గర్భాన్ని కూడా అబార్షన్ చేసుకునే అధికారం మహిళలకు ఉందని తెలిపింది. ప్రతి భారతీయ మహిళ తనకు నచ్చినది ఎంచుకునే హక్కు ఉందని, కేవలం వివాహిత స్త్రీలే శృంగారం చేయాలని నిబంధన ఏమీ లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

పోస్కో చట్టం ప్రకారం అబార్షన్ చేయమని కోరితే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు మైనర్ యొక్క గుర్తింపును వెల్లడించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. "ఎంటీపీ మైనర్‌లకు దూరం చేయడం చ‌ట్టం ఉద్దేశం కాదు. స‌ద‌రు మహిళ ఉన్న‌ సామాజిక పరిస్థితులు ఆమె అబార్ష‌న్‌ రద్దు నిర్ణయంపై ప్రభావం చూపవచ్చు" అని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీకి (ఎంటీపీ) సంబంధించిన ఓ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది. ‘పెళ్లిన వారిని 24 వారాల లోపు అబార్షన్‌కు అనుమతిస్తూ, పెళ్లి కాని వారిని అనుమతించకపోవడం సరికాదు. కాలం మారింది చట్టం స్థిరంగా ఉండకూడదు. మారుతున్న సామాజిక వాస్తవాలకు అనుగుణంగా నిబంధనలు మారుతుంటాయి’ అని కోర్టు స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles