Twin blasts on buses leave 2 injured in Udhampur ఉధంపూర్ లో ‘ఉగ్ర’దాడులు.. 8 గంటలలో రెండు బాంబు పేలుళ్లు

Jammu and kashmir back to back blasts in parked buses leave 2 injured in udhampur

Udhampur blast, blast in Jammu, terrorism in Kashmir, civilians injured in Udhampur explosion, bus explosion, bus bomb blast, udhampur, Udhampur, bomb blast, twin bomb blasts, terrorists, Bus explosion, Twin bus bomb blasts, IED bomb blasts, Jammu and Kashmir, Crime

Two civilians were injured in coordinated detonation of two improvised explosive devices (IEDs), planted on two parked buses, within eight hours on September 29 in Jammu's Udhampur district, just four days ahead of Union Home minister Amit Shah's three-day visit to J&K.

ITEMVIDEOS: ఉధంపూర్ లో ‘ఉగ్ర’దాడులు.. 8 గంటలలో రెండు బాంబు పేలుళ్లు

Posted: 09/29/2022 01:51 PM IST
Jammu and kashmir back to back blasts in parked buses leave 2 injured in udhampur

జమ్ముకశ్మీర్‌లో జంట బాంబు పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మళ్లీ ఉగ్రమూకలు బాంబుదాడులకు తెగబడ్డాయి. ఉధంపూర్‌లో అనుమానాస్పద పేలుళ్లు సంభవించాయి. ఇది ఉగ్రవాదుల పనేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం రాత్రి తొలి బాంబు పేలుడు జరిగిన తరువాత ఎనమిది గంటల వ్యవధిలో రెండో బాంబు పేలుడు జరగడం పెను కలకలం రేపుతోంది. ఇవాళ ఉదయం ఉధంపూర్‌లోని పాతబస్టాండ్‌లో నిలిపిఉన్న బస్సులో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అయితే ఈ ఘటనలో ఎవ్వరికీ ప్రమాదం జరుగలేదని అధికారులు వెల్లడించారు.

కాగా ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి 10.45 గంటల సమయంలో ఉధంపూర్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పెట్రోల్ బకు సమీపంలో దొమాలి చౌక్‌ వద్ద నిలిపి ఉన్న ఖాళీ బస్సులో భారీ విస్పోటనంతో తొలి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులోని డ్రైవర్‌ క్యాబిన్‌లో కూర్చున్న కండక్టర్‌ సునీల్‌ సింగ్‌(27), అతని స్నేహితుడు విజయ్‌ కుమార్‌(40)కు గాయాలయ్యాయి. వీరిని ఉధంపూర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారికి అత్యవసర చికిత్సను వైద్యులు అందిస్తున్నారు.

కాగా, ఇవాళ ఉదయం ఐదు గంటల సమయంలో ఉధంపూర్ లోని పాత బస్టాండ్ వద్ద నిలిపి వున్న మరో బస్సులోనూ భారీ విస్పోటనంతో రెండో పేలుడు సంభవించింది. దీంతో అప్పటివరకు చిన్న చిన్న ఘటనలు సాధారణమే అనుకున్న ప్రజలు ఒక్కసారిగా రెండో పెలుడుతో అందోళనకు గురయ్యారు. ఈ రెండు పేలుడు తొలి పేలుడు ఘటన సంభవించిన ప్రాంతానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. అయితే ఈ రెండు పేలుడు ఘటనలపై పోలీసులు, భద్రతా బలగాలు దృష్టిసారించాయి. గంటల వ్యవధిలోనే ఇవి చోటుచేసుకోవడంతో ఏమైనా ఉగ్రవాద కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

కాగా అక్టోబర్‌ మొదటి వారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటన నిమిత్తం జమ్మూకశ్మీర్‌కు వెళ్లనున్నారు. కత్రా పట్టణానికి సమీపంలో ఉన్న త్రికుటా హిల్స్‌లోని మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రాన్ని సందర్శించి, పూజలు చేయనున్నారు. అనంతరం సరిహద్దు జిల్లా రాజౌరి, బరాముల్లాలో బహిరంగ ర్యాలీలో ప్రసంగించడంతో పాటు, అక్కడే బస చేయనున్నారు. అయితే కేంద్రమంత్రి పర్యటన ముందు ఉధంపూర్ పట్టణంలో రెండు శక్తివంతమైన పేలుళ్లు సంభవించడం కలకలం రేపుతోంది. హోంమంత్రి  సందర్శనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు, భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles