Heavy rains likely across Telangana for next three days రాష్ట్రానికి వరుణ గండం.. రానున్న మూడు రోజులు భారీ వర్షాలే.!

Several districts of telangana likely to recieve heavy rainfall for next three days

Yellow alert to 24 districts of Telangana, India Meteorological Department (IMD), Yellow alert to Adilabad, Yellow alert to Kumram Bheem Asifabad, Mancherial, Nirmal, Jagtial, Jayashankar Bhupalpally, heavy rainfall to 24 districts of Telangana, Nizamabad, Rajanna Sircilla, Karimnagar, Peddapalli, Mulugu, Bhadradri Kothagudem, Siddipet, Yadadri-Bhongir, Rangareddy, Hyderabad, Medchal-Malkajgiri, Vikarabad, Sangareddy, Medak, Kamareddy, Mahbubnagar districts.

In the wake of cyclonic circulation, many parts of the State are likely to record heavy rainfall over the next three days. According to the IMD, districts like Kumurambheem-Asifabad, Mancherial, Jagtial, Peddapalli, Jayashankar-Bhupalapally, Mulugu, Bhadradri-Kothagudem, Khammam, Nalgonda, Suryapet, Mahabubabad, Warangal, Hanamkonda, Jangaon, Siddipet, Yadadri-Bhongir, Rangareddy, Hyderabad, Medchal-Malkajgiri, Vikarabad, Sangareddy, Medak, Kamareddy and Mahbubnagar will see heavy rainfall.

రాష్ట్రానికి వరుణ గండం.. రానున్న మూడు రోజులు భారీ వర్షాలే.!

Posted: 09/29/2022 04:43 PM IST
Several districts of telangana likely to recieve heavy rainfall for next three days

తెలంగాణకు వరుణ గండం తప్పినట్టు లేదు. ఇప్పటికే వర్షాకాలం ఆరంభం నుంచి సాధారణం కన్నా మూడింతల ఎక్కువ వర్షపాతం నమోదైనా.. ఇప్పటికీ రాష్ట్రాన్ని వరుణుడు వీడటం లేదు. నైరుతి రుతుపవనాలకు ముందు నుంచి రాష్ట్రంలో విస్తారంగా కురిసిన వర్షాలు.. రుతు పవనాలు తిరోగమనమైనా.. వరుణుడు మాత్రం ఇంకా తన ప్రభావాన్ని చాటు తూనే వున్నాడు. గడిచిన మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారన్న కురిసిన వర్షాలతో పండగ సంబరాలన్నీ హరించుకుపోతున్నాయి. ఈ క్రమంలో మరోమారు రానున్న మూడు రోజులు రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

మరో రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలోని ఏకంగా పలు జిల్లాల వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇవాళ్టి నుంచి రేపటి వరకు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. కొమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్ధిపేట జిల్లాల పరిధిలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీవర్షం పడే అవకాశం ఉందని వివరించింది. అక్టోబర్‌ 1న రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అక్టోబర్‌ 2న పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles