దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు దక్షిణాది రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలోనూ నూతనోత్సాహాలను తీసుకువచ్చింది. అమ్మవారిని భక్తితో ప్రార్థించేందుకు భక్తజనం దేశవ్యాప్తంగా పోటీపడుతున్నారు. దీంతో దేశంలో ఎటుచూసినా పండగ వాతావరణం అవతరించింది. అయితే ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగినులు మాత్రం అమ్మవారికి ఎక్కువ సమయం కేటాయించి పూజలు చేయలేకపోతుండటం సాధారణమే. కానీ ఇలాంటి వాళ్లు అందరూ తమ శక్తి కొలది అమ్మవారికి భక్తితో పూజలు చేయాలని ప్రయత్నాలు చేస్తుంటారు.
ఇదిలావుండగా, మొన్న ఢిల్లీలో ఓ చిన్నారి తన డాన్స్ స్కిల్స్ ను ప్రదర్శించిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో.. ముంబైలోని మహిళలు కూడా ఇలాంటిదే ఓ ప్లాన్ చేశారు. ఢి్ల్లీ చిన్నారిని ఆదర్శంగా తీసుకున్నారో ఏమో తెలియదు కానీ.. ఇటీవల ముంబై మెరైన్ డ్రైవ్‌లో మహిళల గర్బా పెర్ఫామెన్స్ చేశారు. దీంతో వాళ్లూ వీళ్లూ చేయడమేంటని భావించిన ఉద్యోగుణిులు తమ వ్యవహారాలను త్వరగా ముగించుకుని ఏకంగా కదులుతున్న లోకల్ ట్రైన్‌లో మహిళల బృందం గర్బా నృత్యం చేస్తున్న మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ముంబై రైల్వే యూజర్స్ అనే పేజ్ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. కళ్యాణ్ నుంచి వస్తున్న ఓ లోకల్ ట్రైన్‌లో మహిళలు గర్బా పెర్ఫామ్ చేస్తున్న షార్ట్ క్లిప్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇతర ప్రయాణీకులు చూస్తుండగా వీరంతా ఎంతో ఉత్సాహంతో డ్యాన్స్ చేస్తుండటం వీడియోలో కనిపించింది. ఈ పోస్ట్‌కు ముంబై లోకల్స్ క్రియేట్ మొమెంట్స్..ఫన్ హ్యాజ్ నో లిమిట్ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ లక్షకు పైగా వ్యూస్ రాబట్టింది. మహిళల స్ఫూర్తిని మెచ్చుకున్న నెటిజన్లు కామెంట్స్ బాక్స్‌లో వారిపై ప్రశంసలు గుప్పించారు. మహిళలు డ్యాన్స్ చేసేందుకు వీలుగా ఇతర మహిళలు వారికి దారిచ్చిన తీరు ప్రశంసనీయమని మరికొందరు కామెంట్ చేశారు.
#Garba #Navrathri
— Mumbai Railway Users (@mumbairailusers) September 28, 2022
MUMBAI LOCALS CREATE MOMENTS
Now in yesterday's 10.02 am #AClocal from Kalyan.
FUN HAS NO LIMIT. pic.twitter.com/Hruzxwbeqr
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more