Bangladeshi woman tries to reach roof of train రైలు బోగిపైకి ఎక్కేందుకు మహిళ విఫలయత్నం.. ఆ తరువాత..

Bangladeshi woman s attempt to climb onto train s roof fails after police arrive

woman climbs on trains roof, Bangladeshi woman tries to climb on train, railway station in Bangaldesh, women, yellow churidar, Trains, Passenger Train, Crowded train, passengers, train roof, Cop, Bangladesh, social media, Instagram, viral video

Passenger trains are often crowded with people and many rush to get a spot. While overcrowded trains are common in India, a glimpse from a Bangladesh railway station has left netizens shocked. A clip showing a woman trying to climb onto the roof of a crowded train has gone viral on social media. In the video shared by the Instagram handle fresh_outta_stockz, a woman clad in a yellow churidar is seen attempting to get onto the train’s roof.

ITEMVIDEOS: రైలు బోగిపైకి ఎక్కేందుకు మహిళ విఫలయత్నం.. ఆ తరువాత..

Posted: 08/26/2022 05:35 PM IST
Bangladeshi woman s attempt to climb onto train s roof fails after police arrive

భారతదేశంలో దశాబ్దాల క్రితం బొగ్గు ఇంధనంగా రైళ్లు నడిచేవి. ఇప్పటికీ కొన్ని మార్గాల్లో అలాంటి రైళ్లు నడుస్తున్నాయి. అయితే దాదాపుగా అన్ని రైలు మార్గాలను రైల్వేశాఖ విద్యుదీకరణ చేయడంతో.. మన దేశంలో ప్రస్తుతం ఎక్కడా అప్పట్లో కనిపించిన దృశ్యాలు ఇప్పుడు కనపించవు. కాగా, ఆప్పట్లో మన దేశంలో కనిపించిన దృశ్యాలు ఇప్పటికీ బంగ్లాదేశ్ రైళ్ల‌లో దర్శనమిస్తున్నాయి. ఇంతకీ ఆ దృశ్యాలు ఏంటా అని అంటారా.? ఫ్యాసింజర్ రైళ్లలో జనం కిక్కిరిపోయి.. కాలు పెట్టేంత స్థలం కూడా లేకపోవడమే. అదేంటీ ఢిల్లీ, ముంబై మెట్రో రైళ్లలోనూ అలాంటి దృశ్యాలు దర్శనమిస్తుంటాయి కదా..? అంటారా..

అయితే రద్దీ గురించి కాదు మనం ఇక్కడ ప్రస్తావిస్తున్న విషయం.. రైళ్లు రద్దీగా ఉన్నప్పుడు ప్రయాణికులు తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు సహసంతో కూడాన ప్రయాణం చేయడం గురించి. అదేంటి అంటే.. మనం మాట్టాడుతున్నది ఏకంగా రైలు బోగిపైకి ఎక్కి ప్రయాణాలు చేసే దృశ్యాల గురించి. సర్వసాధారణంగా బంగ్లాదేశ్ లోని ప్యాసింజర్ రైళ్లు,, ఎప్పుడు చూసినా జ‌నం ర‌ద్దీ క‌నిపిస్తుంటుంది. రైలు బోగీల్లోకి ఎక్కేందుకు ఒక‌రినొక‌రు తోసుకోవ‌డం, కొట్లాడుకునే వీడియోలు సోష‌ల్‌మీడియాలో ఇటీవ‌ల వైర‌ల్ అవుతున్నాయి. కొంద‌రు ఫుట్‌బోర్డుపై వేలాడుతూ అతి ప్ర‌మాద‌క‌రంగా వెళ్తుంటే, మ‌రికొందరు రైలు బోగీపైన ఎక్కి ప్ర‌యాణిస్తున్నారు.

కాగా, రైలులో సీట్లు దొర‌క్క‌పోవ‌డంతో ఓ మ‌హిళ బోగీపైకి ఎక్కేందుకు నానా తంటాలు పడింది. ఈ వీడియో ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. బంగ్లాదేశ్‌లోని ఓ స్టేష‌న్‌లో ఇంట‌ర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగి ఉంది. రైలు మొత్తం జ‌నాల‌తో నిండిపోయింది. దీంతో చాలామంది బోగీపైకి ఎక్కి కూర్చున్నారు. ఓ మ‌హిళ పైకి ఎక్కేందుకు ప్ర‌య‌త్నించినా విఫ‌లమైంది. నానా తంటాలు పడింది. చివ‌ర‌కు రైల్వే పోలీసులు వ‌చ్చి ఆమెను వారించ‌డంతో అక్క‌డినుంచి వెళ్లిపోయింది. ఈ షాకింగ్ దృశ్యాలు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారాయి. ఇలా బోగీపై ప్ర‌యాణించ‌డం క్రిమిన‌ల్ నేరం కాదా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నించారు. ఈ స‌న్నివేశం ‘గ‌ద‌ర్ ఏక్ ప్రేమ్‌క‌థ’ చిత్రాన్ని గుర్తుచేసింద‌ని ఒక యూజ‌ర్ కామెంట్ చేశారు.

 
 
 
View this post on Instagram

A post shared by Vidyadhar Jena (@fresh_outta_stockz)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles