'zombie bug' video makes the rounds in Social Media కీట‌కాన్ని జాంబిలా మార్చేసిన ఫంగ‌స్‌..గగుర్పాటు క‌లిగించే వీడియో!!

Twitter users are creeped out after a new video about zombie bug makes the rounds

Twitter zombie bug, zombie, leucochloridium, twitterati, zombie bugs, bugs, Massimo, Massospora, Twitter, Viral video, social media, Netizens

Recently a video made the rounds showing a 'zombie' bug and it has people freaked out. The video has already garnered over 10 million views. "A zombie bug. While it's not alive, it's not even dead. A large number of mind-controlling fungi leads insects to assume the strangest behaviors in order to spread their spores and infect more insects to survive," the caption of the viral video reads.

ITEMVIDEOS: ఈ కీట‌కం బతికున్నట్లా.? జాంబిలా మార్చేసిన ఫంగ‌స్‌.. గగుర్పాటు క‌లిగించే వీడియో!!

Posted: 08/26/2022 06:30 PM IST
Twitter users are creeped out after a new video about zombie bug makes the rounds

జాంబిరెడ్డి సినిమా చూశారా? అందులో జాంబీలు ఎలా ప్ర‌వ‌ర్తిస్తారో తెలుసు క‌దా? అచ్చం అలాంటివే జంతురాజ్యంలో కూడా ఉన్నాయి. అందుకీ వీడియోనే సాక్ష్యం. అయితే ఇక్కడ జాంబిలను మరో జాంబీలు మార్చడం కాదు.. అంతకన్నా ప్రమాదకరమైన మరోకటి కీటకాలను జాంబిలుగా మార్చేస్తున్నాయి. ఇక్కడ మీకు మరో విషయాన్ని కూడా గుర్తుచేయాలని భావిస్తున్నాం. బోజనం చేసే ముందు.. లేదా బయటకు వెళ్లి వచ్చిన తరువాత కాళ్లు చేతులు కడుక్కోవాలని పెద్దలు పలుమారు అదే పనిగా ఎందుకు చెబుతారో విషయాన్ని కూడా ఈ వీడియో తెలియజేస్తోంది.

మాసిమో అనే యూజ‌ర్ షేర్ చేసిన ఈ వీడియోలో ఓ కీట‌కం గగుర్పాటు క‌లిగిస్తున్న‌ది. దీంతో ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. లక్షలాది మంది నెటిజనులు ఇప్పటికే ఈ వీడియోను వీక్షించారు. అంతగా ఆకర్షించేందుకు ఈ వీడీయోలో ఏముందీ.? అంటే.. జాంబి పురుగు. అదేంటీ అంటారా.. తన దేహాన్ని దాదాపుగా కోల్పోయింది.. కానీ ప్రాణాలతోనే ఉంది. అలాగనీ ఈ కీట‌కం చ‌నిపోలేదు.. అయితే కేవలం ప్రాణాలతో మాత్రమే ఉంది అని చెప్పాలి. దాని పైభాగం మొత్తం కోల్పోయినా అది గ‌డ్డిలో న‌డుచుకుంటూ వెళ్తున్న‌ది. అంటే దాన్ని చంపేసి దాని శ‌రీరాన్ని జాంబీలా మార్చేసింది పరాన్నజీవులైన ఫంగ‌స్‌.

కీటకం దేహాన్ని పూర్తిగా ఆక్ర‌మించేశాయి. దాన్ని వాహ‌కంలా వాడుకుంటూ ఇతర కీటకాలపైకి దాడి చేసేందుకు సన్నధం అవుతున్నాయి. ఈ ఫంగ‌స్‌ల‌ను మాసోస్పోరా అని పిలుస్తారు. పుట్ట‌గొడుగుల్లో క‌నిపించే ర‌సాయ‌నాల‌ను క‌లిగి ఉంటాయి. ఇవి ప్రాణాంత‌క ప‌రాన్న‌జీవులు. కీట‌కాల‌ను అవి చంపేసి జాంబీలుగా మార్చేస్తాయి. వాటి బీజాంశాలను వ్యాప్తి చేసేందుకు, మనుగడ కోసం మరిన్ని కీటకాలకు సోకేందుకు వింత‌గా ప్ర‌వ‌ర్తించేలా చేస్తాయి. ఇక అందుకనే బయటకు వెళ్లిరాగానే, ఆడుకుని ఇంట్లోకి రాగానే. లేదా బోజం చేసే ముందు సబ్బుతో చక్కగా కాళ్లు చేతులు కడుక్కోవాలని పెద్దలు చెబుతారు. ఇవి కంటికి కనిపించని శ్రతువులు కదా.. అందకనే అప్రమత్తత అవసరం. కాగా ఈ వీడియోకోటి మందికి పైగా వీక్షించడం గమనార్హం.

A zombie bug.

While it's not alive, it's not even dead. A large number of mind controlling fungi leads insects to assume the strangest behaviors in order to spread their spores and infect more insects to survive.

[read more: https://t.co/jGMPpf08cP]pic.twitter.com/KWTIuIT20U

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles