Wayanad Tour Packages From Hyderabad కేరళ అందాలను వీక్షించేలా ఐఆర్సీటీసీ వయనాడ్ టూర్ ప్యాకేజీ..

Irctc wayanad tour package tour dates costs itinerary and more details

hyderabad wayanad tour, irctc tourism wayanad hyderabad tour, irctc tourism latest updates, irctc latest news, hyd wayanad tour cost, Travel, IRCTC, IRCTC tourism, Indian railways, IRCTC tour packages, Wayanad tour package, Kerala tour package, Cheap Kerala tour packages, holiday package Kerala

IRCTC Tourism is offering a six days, five nights tour package to Wayanad, Kerala. Wayanad, the green paradise is nestled among the mountains of the Western Ghats, forming the border world of the greener part of Kerala. Wayanad is a hilly region in the Western Ghats, located in the southern region of the Deccan plateau. Mountains and forests intersperse to create numerous outback trails, trekking routes and opportunities for other adventure sports.

కేరళ అందాలను వీక్షించేలా ఐఆర్సీటీసీ వయనాడ్ టూర్ ప్యాకేజీ.. వివరాలివే

Posted: 08/26/2022 04:39 PM IST
Irctc wayanad tour package tour dates costs itinerary and more details

హైదరాబాద్ నుంచి వయనాడ్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి కేరళలోని వయనాడ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘వండర్స్ ఆఫ్ వయనాడ్‘ (WONDERS OF WAYANAD) పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. కన్నూరు, వయనాడ్ ప్రాంతాలు కవర్ అవుతాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల ఆగస్టు 30న ఈ టూర్ ప్రారంభం అవుతుంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

1వ రోజు మంగళవారం: ఉదయం 6 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి (కాచిగూడ - మంగళూరు సెంట్రల్ ఎక్స్ ప్రెస్) నుంచి బయల్దేరుతారు.

2వ రోజు బుధవారం: ఉదయం 06.17 నిమిషాలకు కన్నూరుకు చేరుకుంటారు. ఫ్రెష్ అప్ తర్వాత బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. అంజిలో ఫోర్టును, అరక్కల్ మ్యూజియంను సందర్శిస్తారు. ఇక్కడ్నుంచి వయనాడు ప్రయాణం ఉంటుంది. మధ్యలో కొన్ని పర్యాటక ప్రాంతాలను చూపిస్తారు. రాత్రి కాల్ పెట్టలో బస చేస్తారు.

3వ రోజు గురువారం: హోటల్ బ్రేక్ ఫాస్ట్ తర్వాత కుర్వాదీప్ లోని పలు ప్రాంతాలను చూస్తారు. తురునేల్లి ఆలయం, బాణాసూర సాగర్ డామ్ ను సందర్శిస్తారు. రాత్రికి కూడా కాల్ పెట్టలోనే బస చేస్తారు.

4వ రోజు శుక్రవారం: బ్రేక్ ఫాస్ట్ తర్వాత అంబల్వాయల్ హెరిటేజ్ మ్యూజియం, స్కూయిపారా ఫాల్స్, ఎడక్కల్ గుహాలు, పొక్కొడే సరస్సును సందర్శిస్తారు. రాత్రి కాల్ పెట్టలోనే ఉంటారు.

5వ రోజు శనివారం: బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. ఇక్కడ్నుంచి కొజికోడ్ కు చేరుకుంటారు. కప్పడ్ బీచ్ తర్వాత సాయంత్రం ఎస్ఎం స్ట్రీట్ లో షాపింగ్ చేయవచ్చు. అనంతరం రాత్రికి కాలికట్ రైల్వే స్టేషన్ వెళ్తారు. ఇక్కడ రాత్రి 11.35కి తిరిగి ప్రయాణం అవుతారు. సింగిల్ షేరింగ్ కు రూ. 35,130 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 20,370 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.16,590 గా ఉంది. 3 Tier AC కోచ్ లో ఈ ధరలు ఉంటాయి పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు.టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles