UP lineman cuts power supply to police station లైన్‌మెన్ పోలీసుల జరిమానా‌..! ఠాణా చీకటిమయం..!!

Police fines lineman in up lineman avenges by cutting power supply for rs 56 000 dues

LIneman cutsoff power supply to police station, lineman police station, lineman helmet fine, lineman police fine, electricity dues, Electricity department, lineman, contract employee, Shamli area, Helmet, electricity bill, Thana Bhavan police station, Uttar Pradesh, Crime

In a bizarre incident, a lineman of Uttar Pradesh’s Shamli area took to hit back at the police force on being charged a heavy amount for not wearing a helmet. As the man was aware of electrical circuits and wires, he used his practice to cut-off power supply of the police station.

ITEMVIDEOS: లైన్‌మెన్ పోలీసుల జరిమానా‌..! ఠాణా చీకటిమయం..!!

Posted: 08/26/2022 03:26 PM IST
Police fines lineman in up lineman avenges by cutting power supply for rs 56 000 dues

బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమలచేత చిక్కిచావదె సుమతీ.. అన్న పద్యం గుర్తుందా.. సరిగ్గా అలాంటిదే ఈ ఘటన కూడా. పోలీసులంటే ప్రజలకు కొంత భయం వారితో పెట్టుకుని మనజాలలేమని అంటారు. కేసులు, కోర్టులతో తమ విలువైన సమయానంత వృధా చేసుకోవాల్సి వస్తుందని వారి భయం. అయితే పోలీసులు ఈ భయాన్ని ప్రజల నుంచి పోగొట్టిందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ మార్పు తీసుకోచ్చారు. అయితే ఎంత ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నా.. వారిలో కాఠిన్యం మాత్రం అలాగే ఉంటుంది.

ఇటీవల కేంద్రప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన నూతన ఆర్టీఏ చట్టాల సవరణల ప్రకారం ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులకు భారీ మొత్తంలో జరిమానాలు విధించడం వారి విధి. అయితే కొన్ని సందర్భాల్లో పోలీసులే ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి వాహనాలను నడపడం అప్పుడప్పుడు పేపర్లలో కనిపిస్తోంది. ఇలా ప్రతీ ఒక్కరూ పొరబాట్లు చేస్తారులే అని మాత్రం వారు ఊరుకోరు. దొరికారు కదా అని వాహనదారులపై జరిమానా విధిస్తుంటారు. అలాగే తాజాగా పోలీసలు ఎల‌క్ట్రిసిటీ లైన్‌మెన్‌కు భారీగా జరిమానా వడ్డించారు. ఆయన హెల్మెట్ పెట్టుకోలేద‌ని ఈ ఫైన్ వేశారు.

కాంట్రాక్టు పద్దతిలో విద్యుత్ శాఖలో పనిచేసే ఆయనకు ఆ సంస్థ చెల్లించేదే నెలకు రూ.5వేల జీతం. కానీ ఇక్కడ మాత్రం ఈయన పోలీసులు వడ్డించిన జరిమానా ఏకంగా రూ.6 వేలు. దీంతో లబోదిబోమంటూ అంత జరిమానా వేయకండీ అంటూ ప్రాధేయపడ్డాడు. అయితేనేం పోలీసులు వినలేదు. తాను పోలిస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ఏరియాకు లైన్ మెన్ అని చెప్పినా.. వినిపించుకోని పోలీసులు ఫైన్ వేసి వదిలేశారు. అయితే తాను ఎంత చెప్పినా.. బతిమాలినా పోలీసులు వినిపించుకోకపోవడంతో.. లైన్‌మెన్‌తో పాటు విద్యుత్‌శాఖ‌కూ కోపం తెప్పించింది.

దీంతో పోలీసులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆయనకు అవకాశం దొరికింది. పోలీస్ స్టేష‌న్ బ‌కాయిల‌ను సాకుగా చూపుతూ విద్యుత్ క‌నెక్ష‌న్ క‌ట్‌చేశారు. క‌రెంట్ క‌ట్ చేసేందుకు లైన్‌మెన్ పోల్ ఎక్కుతున్న వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. యూపీలోని షామ్లీకి చెందిన ఎల‌క్ట్రిసిటీ లైన్‌మెన్‌కు ఠానా భ‌వ‌న్ పోలీసులు హెల్మెట్ లేద‌నే కార‌ణంతో రూ. 6వేల ఫైన్ వేశారు. దీంతో ఆ లైన్‌మెన్ పోలీసుల‌పై ప‌గ‌తీర్చుకోవాల‌నుకున్నాడు. ఆ స్టేష‌న్ క‌రెంట్ బిల్లు బ‌కాయిల‌ను చెక్ చేశాడు. ఈ విష‌యాన్ని పై అధికారుల‌ దృష్టికి తీసుకెళ్లాడు. వారి ఆదేశంతో ఠానా భ‌వ‌న్ పోలీస్ స్టేష‌న్‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపివేశాడు. దీంతో ఆ పోలీస్ స్టేష‌న్ చీక‌టిమ‌య‌మైపోయింది. ఓ రోజు రాత్రంతా కారు చీక‌ట్లోనే ఉండిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles