తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన బిడ్డ ప్రాణాలను కాపాడుకుంటుందని ఇటీవల పశ్చిమబెంగాల్ లో జరిగిన ఘటన కూడా నిరూపించింది. అలాంటిది తల్లి ప్రేమ. తల్లి ప్రేమ, మమకారం, రక్షణ ముందు.. ఎవరూ సాటిరారన్న విషయం తెలిసిందే. తాజాగా అలాంటిదే ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కోడుతోంది. ఓ తల్లి తన చిన్నారి కన్నకొడుకు శరవేగంగా స్పందించి రక్షించిన వీడియో నెటిజనుల వెన్నులో వణుకుపుట్టించింది.
తన బిడ్డఒక తల్లి తన కుమారుడ్ని పెద్ద నాగుపాము బారి నుంచి చాకచక్యంగా కాపాడింది. అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని మాండ్యలో ఈ సంఘటన జరిగింది. ఒక తల్లి తన కుమారుడ్ని స్కూల్‌కు పంపేందుకు అతడితోపాటు ఇంటి నుంచి బయటకు వచ్చింది. అయితే ఆ ఇంటి మెట్ల కింద ఒక పెద్ద నాగుపాము పాకుతూ వెళ్తున్నది. మెట్ల పైనుంచి దిగుతున్న ఆ బాలుడు బూటు వేసుకున్న కాలును ఆ పాముపై వేశాడు. దీంతో ఆ పాము వెంటనే వెనక్కి వెళ్లింది. పెద్ద ఎత్తున పైకిలేచింది.
ఊడిన బూటు కోసం దగ్గరకు వస్తున్న బాలుడ్ని ఆ పాము కాటేయబోయింది. మరోవైపు పామును గమనించిన తల్లి క్షణాల్లో స్పందించింది. పాము కాటువేయబోతున్న కుమారుడ్ని వెంటనే పక్కకు లాగింది. బాలుడ్ని ఎత్తుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్లింది. దీంతో ఆ పాము పాకుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా, అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒళ్లు జలదరించేలా ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు షాకయ్యారు. క్షణాల్లో స్పందించి పాము బారి నుంచి కుమారుడ్ని కాపాడిన ఆ తల్లిపై ప్రశంసలు కురిపించారు.
Everybody reacted the way they shud . Snake defensive, child panicked and mother composed. Finally everything ended well
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more